తెలంగాణా ప్రాంతానికి మహారాష్ట్ర తుపాకులు
Publish Date:Apr 3, 2012
Advertisement
మహారాష్ట్రలోని నాందేడ్, చంద్రాపూర్, బిలోలి తదితర ప్రాంతాల నుంచి తెలంగాణాకు తపంచాలు, నాటు తుపాకులు అక్రమంగా చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో కొన్నిచోట్ల తపంచాలు, నాటు తుపాకులు విరివిగా తయారుచేస్తున్నారు. ఇక్కడ తయారవుతున్న తుపాకులలో ఎక్కువ భాగం తెలంగాణా ప్రాంతాలైన కరీనంగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్ లకు అక్రమంగా చేరుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణాలోని అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న కొందరు వ్యక్తులు మహారాష్ట్ర తపంచాలను కొని అటవీప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్నారు. ఒక్కో తపంచా ఐదువేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. మరికొందరయితే ఈ తుపాకులు కొని సూడో నక్సలైట్లుగా అవతారం ఎత్తుతున్నారు. వీరు బెదిరింపులకు, కిడ్నాపులకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారారు. ఇటీవల గోదావరిఖనిలో ఇటువంటి సూడో నక్సలైట్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటరాగేషన్ లో వీరు మహారాష్ట్ర నుంచి తుపాకులను కొనుగోలు చేసినట్లు అంగీకరించారు.
http://www.teluguone.com/news/content/telangana-maharashtra-guns-24-13117.html





