ఏ చట్ట ప్రకారం 19న సర్వేకి సహకరించాలి?

Publish Date:Aug 13, 2014

Advertisement

 

ఈనెల 19వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సర్వే తెలంగాణలో వున్న సీమాంధ్రులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశంతో చేపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తు్న్న నేపథ్యంలో ఈ సర్వేని తెలంగాణ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. సర్వే పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పౌర హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వేకి సహకరించాల్సిన అవసరం లేదని ప్రజలకు స్పష్టంగా చెబుతున్నారు. ఏ చట్ట ప్రకారం ఈ సర్వేకి సహకరించాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సర్వే విషయంలో ప్రజలు ఎంతమాత్రం భయభ్రాంతులకు గురి కావలసిన అవసరం లేదని, సర్వేకి సహకరించకపోతే ఏవైనా సమస్యలు ఎదురవుతాయేమోనని భయపడాల్సిన అవసరం కూడా లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే, ఈ సర్వేకి సహకరిస్తేనే ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుందని ఆయన అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు తమకు సంబంధించిన, తమకు వెల్లడించడానికి ఇష్టం లేని ఏ అంశాన్నీ సర్వే సిబ్బందికి వెల్లడించాల్సిన అవసరం లేదని, మనకు సంబంధించిన ఆస్తులు తదితర వివరాలన్నీ కేవలం ఒక్క భారత ప్రభుత్వానికి మాత్రమే వెల్లడి చేయాలని, ఆధార్ కార్డుల రూపకల్పన సమయంలో మనకు సంబంధించిన వివరాలన్నీ భారత ప్రభుత్వానికి వెల్లడించామని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వివరాలేవీ వెల్లడించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. మన ఆస్తులు, స్థానికత తదితర అంశాల గురించి మనను ప్రశ్నించే హక్కు కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఆయన చెబుతున్నారు.

 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేకి ఎలాంటి చట్టబద్ధత, హేతుబద్ధత లేదని సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ చెబుతున్నారు. నిజానికి కేంద్ర పరిధిలో వున్న అంశాల గురించి సర్వేలు జరపడం గానీ, సమాచార సేకరణ గానీ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు వుండదని, ఒకవేళ తమకు ఆ హక్కు వుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తు్న్న పక్షంలో తాము ఆ సర్వే ఎందుకు చేయబోతోంది, సర్వే ఉద్దేశమేమిటి? సర్వే సందర్భంగా ప్రజల్ని ఏయే ప్రశ్నలు అడగబోతున్నారు, ఆ ప్రశ్నల ద్వారా ప్రజల నుంచి ఎలాంటి సమాధానాన్ని ఆశిస్తున్నారు? ఆ ప్రశ్నలు అడగటంలో తమకున్న చట్టపరమైన హక్కులేమిటి అనే అంశాలన్నిటితో ఒక గెజిట్ విడుదల చేయాలి. ఆ గెజిట్ మీద అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ తర్వాతే తమకు ఉన్న హక్కులకు లోబడి సర్వే చేయాలి. మరి తెలంగాణ ప్రభుత్వం అలాంటి కసరత్తులేవీ చేయకుండా సర్వే చేయడానికి ప్రయత్నించడం చట్ట విరుద్ధమేనని జంధ్యాల రవిశంకర్ చెబుతున్నారు.

 

By
en-us Political News

  
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.