ఉమ్మారెడ్డికి చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమిటి?

Publish Date:May 16, 2012

Advertisement

తనకు సరైన ప్రాతినిథ్యం కల్పించటం లేదని ఆగ్రహించిన తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మొత్తానికి మెత్తబడి అదే పార్టీలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నారని తెలిసింది. తెలుగుదేశంపార్టీ తరుపున కేంద్ర పదవులను, రాష్ట్ర పదవులను అనుభవించిన ఆయనే కోప్పడితే ఎట్లా అని ఆ పార్టీ నేతలు కోరినందుకు ఉమ్మారెడ్డి వెనక్కి తగ్గారని తెలిసింది.

 

 

పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు, ఎంపి నామా నాగేశ్వరరావు తదితరులు ఉమ్మారెడ్డి నిర్ణయం మార్చుకోవాలని కోరారట. దీనికి ముందు ఆయనతో కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఉమ్మారెడ్డి ఇంట్లోనే చర్చలు జరిపారు. ఆ తరువాత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకులు కూడా ఈయన్ని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఉమ్మారెడ్డి పార్టీ మారుతున్నారని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ ఉప ఎన్నికలయ్యేంత వరకూ ఆగితే ఉమ్మారెడ్డికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చారు. దీంతో వెనక్కితగ్గిన ఉమ్మారెడ్డి పార్టీ మారే నిర్ణయం ఉపసంహరించుకున్నారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఈయన కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.