KCRను: గుర్తు చేసేలా ప్రియదర్శి నటన.. ‘శంకరన్న’పై హరీశ్ రావు ప్రశంసల వర్షం.!

Publish Date:Sep 30, 2026

Advertisement

‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు. ప్రియదర్శిని శాలువాతో సత్కరించిన హరీశ్ రావు.. అనంతరం ఆయనతో చాలాసేపు ముచ్చటించారు. సినిమా, శంకరన్న పాత్రకు సంబంధించిన పలు అంశాలపై ప్రియదర్శితో చర్చించారు.అనంతరం హరీశ్ రావు ‘ఎక్స్’ వేదికగా ప్రియదర్శి నటనపై ప్రశంసలు కురిపించారు. 

‘బలగం’, ‘మల్లేశం’ సినిమాలతో ప్రియదర్శి తనదైన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ‘ది ప్యారడైజ్’లో శంకరన్నగా ఆయన పలికిన తెలంగాణ యాస, మేనరిజమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్‌ను గుర్తు చేసేలా ప్రియదర్శి చూపించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా ఉన్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. సినిమాలోని “చావు నోట్లో తల పెట్టయినా… మీకు గుర్తింపు తెస్తా!!” అనే డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. ప్రియదర్శి నటనను ప్రశంసించారు.

అలాగే ‘ది ప్యారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని, చిత్ర బృందానికి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. ప్రియదర్శి భవిష్యత్తులో మరిన్ని గుర్తుండిపోయే పాత్రలు పోషిస్తూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఇప్పటికే ‘బలగం’లో తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించిన ప్రియదర్శి.. ది ప్యారడైజ్’లో శంకరన్న పాత్రతో మరోసారి అలరించారు. మరిన్ని సినిమాల్లో కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి  కనిపించబోతున్నారన్న టాక్. 

 

 

 

[ Priyadarshi, Harish Rao, The Paradise, Shankaranna, KCR, Nani, Sreekanth Odela, Telangana Cinema, Priyadarshi The Paradise, Telugu Movies, Harish Rao X Post, The Paradise Movie,  Telugu One, Telugu News ] 

By
en-us Political News

  
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో జరిగిన సంచలనాత్మక ఆర్మీ ఆయుధాల చోరీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో  తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కారు వదిలేసి ద్విచ్రవాహనంపై మునుగోడు వీధుల్లో  ఆయన పర్యటించారు.
ఆర్థిక నేర ఆరోపణలు, అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు విచారణను ఎదుర్కొనేందుకు అందుబాటులో లేకుండా విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పేర్కొంటూ..  వారి పాస్‌పోర్ట్‌లను నిలిపివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.
తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన లోకల్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది.
తెలంగాణ సచివాలయంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గ్రేటర్   పరిధిలో బీఆర్ఎస్ కు చెందిన  పలువురు  ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.  దానం నాగేందర్, వివేకానంద వంటి నేతల ఫిరాయింపులు పార్టీ కేడర్‌లో నిరుత్సాహాన్ని నింపాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.