ఐటీ దాడులతో టీడీపీలో కలవరం.. నాన్ బీజేపీ పార్టీలతో టచ్ లోకి వెళ్లాలని నాయుడు యోచన!

Publish Date:Feb 7, 2020

Advertisement

ఒకవైపు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రస్తుతం తెలుగుదేశాన్ని చుట్టుముడుతున్న తీరు, తెలుగుదేశం అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. దీన్ని ఎలా అధిగమించాలి అని తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్న తరుణంలోనే ఆ పార్టీకి రాష్ట్రంలో కష్టకాలం మొదలైంది. పార్టీ అగ్ర నాయకత్వానికి అతి దగ్గరి వారైన అందరినీ ప్రస్తుతం జరుగుతున్న ఇన్కమ్ టాక్స్ దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

గడిచిన 50 రోజులుగా మూడు రాజధానుల వివాదంతో  బలంగా ప్రజల్లోకి వెళ్లి గలిగిన తెలుగుదేశం పార్టీ, తాజాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అనుయాయుల నివాసాల మీద, కార్యాలయాల్లోనూ జరుగుతున్న ఇన్కమ్ టాక్స్ దాడులతో ఆత్మరక్షణలో పడిపోయింది. నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, లోకేష్ అనుచరుడు కిలారు రాజేష్, ఇంకా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు నివాసాలపై, ఇన్కమ్ టాక్స్ అధికారుల బృందం ఒకేసారి హైదరాబాద్ ,విజయవాడలో దాడులు జరిపింది.

2 నెలల క్రితం, నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ పెద్దలతో జరిపిన రాజీ మంతనాలు చంద్రబాబు నాయుడుకు ఎటువంటి ఊరటను ఇవ్వకపోగా బీజేపీ అధిష్టానం, ఇప్పట్లో తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధంగా లేదనే సంకేతాలను పంపాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో దూకుడు పెంచిన బిజెపి, తెలుగుదేశంతో సమానంగా అధికార వైయస్సార్సీపి పై ఉద్యమాల బాట పట్టింది. ఆరడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ బిజెపికి తోడవడంతో, ప్రస్తుతానికి తెలుగుదేశంతో దూరం పాటించాలనే ఆలోచన లో బిజెపి హెడ్ క్వార్టర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

రాజకీయంగా ఒక చిత్రమయిన పరిస్థితిని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ , వ్యూహాత్మకంగా వెళ్లలేక పోతుంది అనే భావన పార్టీ క్యాడర్లో నెలకొని ఉంది. మూడు రాజధానుల ప్రకటన చేసి జగన్మోహన్రెడ్డి సర్కార్, తెలుగుదేశం పార్టీకి కావలసినంత  ఆక్సిజన్ ఇచ్చినప్పటికీ, తాజాగా జరిగిన ఐటీ దాడులు ఆ పార్టీ అగ్ర నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. 2024 లో కనీసం ప్రతిపక్ష స్థాయిని చేరుకోవాలని భావిస్తున్న బిజెపి, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దశలవారీగా దెబ్బ కొట్టడానికి వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలను టచ్ చేస్తే, రాష్ట్రంలో ఆ పార్టీ బలహీన పడుతుందని, తద్వారా బీజేపీని బలోపేతం చేసుకోవచ్చునని అమిత్ షా ఇప్పటికే ఒక దిశా నిర్దేశనం  చేసినట్టు సమాచారం. అందులో భాగంగానే, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో టిడిపి ముఖ్య నాయకుల నివాసాలు కంపెనీల పైన కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోందని తెలుగుదేశం భావిస్తోంది.

ఒకవైపు ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతో పాటు, మరోవైపు పార్టీ అంతర్గత నిర్మాణం లో ఎటువంటి గ్యాప్ లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీకి, బిజెపి వైపు నుంచే ఎక్కువ ప్రమాదం కనిపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తనకు లేదని ఖరాఖండిగా చెప్పేసిన వైయస్సార్ సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి,  ఆ రకంగా టీడీపీకి రిలీఫ్ ఇచ్చినప్పటికీ, మరోవైపు బిజెపి దూకుడుగా వెళుతూ  రాష్ట్రంలో టిడిపిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది.

ఈ ఉధృతి ఇలాగే కొనసాగితే, నాయుడు ముఖ్య అనుచరులపై కేంద్ర సంస్థలు మరికొన్ని కేసులతో, తెలుగుదేశాన్ని ఇరకాటంలో పెట్టే  ప్రయత్నాలు జరగవచ్చునని సంకేతాలు ఉన్నాయి. దరిదాపుల్లో టీడీపీకి, బిజెపి నుంచి స్నేహ హస్తం అందే అవకాశం లేక పోవటం వల్ల, ప్రస్తుతానికి అడుగులు ఆచి తూచి వేయాలని, అవసరమైతే  నాన్ బిజెపి పార్టీలతో మరోసారి జట్టు కట్టి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.

By
en-us Political News

  
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.