గుడివాడ అభ్యర్ధి వేటలో తెలుగుదేశం?

Publish Date:Jul 23, 2012

Advertisement

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయగల సమర్థులైన అభ్యర్థుల కోసం ఆ పార్టీ ఇక కసరత్తులు చేయకతప్పదు. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ అథిష్టానంతో పోరాటం జరిపిన ఎమ్మెల్యే కొడాలి నాని తన అంతరంగాన్ని బయటపెట్టాడు. తాను వైఎస్‌ఆర్‌సిపి తరుపున పోటీ చేస్తానని ప్రకటించారు. అంటే అవసరమైతే రాజీనామా చేసి ఎన్నికలకు తెరలేపటానికి నాని సిద్ధంగా ఉన్నారు. అందుకే తన నియోజకవర్గ అభివృద్థికి రూ.250కోట్ల ప్యాకేజీని నాని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన తనకు అవసరమైన కార్యకర్తలను సమకూర్చుకున్న తరువాతే తెలుగుదేశం వీడినట్లు ప్రకటించటం గమనార్హం.

 

సస్పెండ్‌ చేశామని చెప్పిన తెలుగుదేశం పార్టీని తప్పుబడుతూ నాని కొందరు తెలుగుదేశం కార్యకర్తలను తనకు మద్దతుదారులుగా మలుచుకున్నారు. అనుకున్నది అయ్యేంత వరకూ ఓర్పువహించిన నాని జగన్‌ సూచనల మేరకే నడుచుకుంటున్నారని సమాచారం. తనపై దుమారం లేపిన తెలుగుదేశం నేతలను నాని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. పైగా, తెలుగుదేశం క్యాడర్‌ను నాని కొన్నాళ్లపాటు కార్యాలయం స్వాధీనం చేసుకుని ఒకరకంగా దెబ్బతీశారు. డబ్బులు తీసుకున్నారని నానిపై  ఆరోపణలు చేసిన వారందరినీ టార్గెట్‌ చేసిన నాని ఇప్పుడు ఫ్రీ అయ్యారు. సాక్షాత్తూ తమ పార్టీ అథినేత చంద్రబాబును తనకు తెలిసిన కోణంలో ప్రజల ముందుంచిన నాని ఇక వైకాపా అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నారు.



 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు స్వస్థలం గుడివాడ. ఇక్కడ నందమూరి కుటుంబానికీ, ఆయన సామాజికవర్గానికీ మంచి ఆదరణ ఉంది. ఆయన తరువాత మనుమడు, హీరో ఎన్టీఆర్‌ స్వయంగా కొడాలి నాని గురించి చంద్రబాబుకు రికమండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ సిఫార్సు మేరకు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన నాని ఇప్పుడు వైకాపాకు ఆదరణ ఉందంటున్నారు. అందుకే ఆ పార్టీ తరుపున ప్రజల ద్వారా ఎన్నికవుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల నందమూరి కుటుంబవారసుడు బాలకృష్ణ రాజకీయరంగ ప్రవేశానికి ఉవ్విళ్లూరుతున్నారు.



ఆయన ఈ గుడివాడ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే ఒక్క సామాజికవర్గానికి ప్రతినిధిగా మిగిలిపోతానని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన హిందుపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల ఆయన్ని ఇప్పుడు తప్పనిసరిగా గుడివాడకు ఒప్పిస్తే 2014కు హిందుపురం అసెంబ్లీలో రెండోసారి పోటీకి నిలపవచ్చని తెలుగుదేశం సీనియర్లు భావిస్తున్నారు. కొడాలినానిని ఎదుర్కోవాలంటే బాలకృష్ణ మాత్రమే బలమైన ప్రత్యర్థి అని భావిస్తున్నారు. అయితే బాలకృష్ణ కుమార్తెను కూడా రాజకీయాల్లో దింపాలన్న ఆలోచన ఉన్న సీనియర్లు ఆమెను దింపి వెనుక నుంచి బాలకృష్ణ మద్దతు తీసుకున్నా పర్వాలేదంటున్నారు.

 

By
en-us Political News

  
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.