కిలో సన్నబియ్యం రూ. 95కి చేరడానికి అసలు కారణం ఇదే.. సీఎం రేవంత్ కీలక ప్రకటన.!
Publish Date:Oct 23, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం కారణంగా వరి సాగు నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం పడిందని, ఈ నేపథ్యంలోనే సన్నవడ్ల ధర కిలో ఏకంగా 95 రూపాయలకు చేరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్ల సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న సమయంలో ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయని, కొందరైతే తనకు వ్యవసాయంపై అవగాహన లేదని కూడా విమర్శించారని ఆయన గుర్తుచేశారు. ఈ విమర్శలను తీవ్రంగా తిప్పికొట్టిన రేవంత్ రెడ్డి, ప్రజల సంక్షేమం కోసం తాము తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవని సమర్థించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3.48 కోట్ల మంది ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తూ పేద ప్రజలకు భరోసా కల్పిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వాల హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించడమే కాకుండా, వాటి ప్రయోజనాలను రెట్టింపు చేశామని ఆయన పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే, తాము రేవైతు భరోసా కింద దానిని 12,000 రూపాయలకు పెంచి అమలు చేస్తున్నామని తెలిపారు. ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా పారదర్శకమైన పాలన అందిస్తున్నామని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన ఉద్ఘాటించారు. సాగు రంగంలో వస్తున్న మార్పులు, వాతావరణ పరిస్థితుల హెచ్చుతగ్గులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని సీఎం తెలిపారు. సన్నవడ్ల సాగును ప్రోత్సహించడం వల్ల భవిష్యత్తులో రాష్ట్ర రైతాంగానికి మంచి మద్దతు లభిస్తుందని, ప్రజలకు నాణ్యమైన ధాన్యం అందుబాటులోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కొందరు నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏదేమైనా రైతుల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. [ CM Revanth Reddy, fine rice cultivation, BRS criticism, Telangana news, Rythu Bharosa, El Nino rice price,Telugu News, Telugu One ]
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-24-235217.html





