పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. కోటికి పైగా కాజేసిన కేటుగాడు.!

Publish Date:Oct 25, 2026

Advertisement

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. కమ్మ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా పరిచయమైన కోనేటి ప్రదీప్ అనే వ్యక్తి.. పెళ్లి పేరుతో మహిళకు దగ్గరై, మూడేళ్లుగా వివాహం చేసుకోకుండా కాలయాపన చేస్తూ రూ.1.18 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగకుండా, మహిళకు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలను బయటపెడతానని బెదిరించి మరో రూ.4 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదు అందింది.

మ్యాట్రిమోనీ పరిచయం.. ఆపై మోసం.!

కమ్మ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా బాధితురాలికి పరిచయమైన ప్రదీప్.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వివిధ కారణాలు చెబుతూ ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్లుగా పెళ్లి ప్రస్తావనను వాయిదా వేస్తూ వచ్చిన నిందితుడు.. చివరకు వ్యక్తిగత ఫొటోలను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు.

పాత కేసుల్లోనూ నిందితుడే.!

పోలీసుల సమాచారం ప్రకారం, కోనేటి ప్రదీప్‌కు గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు. మేడిపల్లి పరిధిలో నమోదైన ఓ హత్య కేసులో అతడు నిందితుడిగా ఉన్నట్లు, గోల్కొండ, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో అతడిపై రెండు గంజాయి కేసులు నమోదైనట్లు సమాచారం. ప్రదీప్‌ చేతిలో మరికొందరు మహిళలు కూడా మోసపోయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రిమాండ్‌కు తరలింపు.. మరిన్ని వివరాలపై ఆరా.!

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ప్రదీప్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని బాధితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాధితురాలి నుంచి వసూలు చేసిన నగదు, బెదిరింపులకు సంబంధించిన ఆధారాలు, ఇతర మహిళలతో అతడికి ఉన్న సంబంధాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లను వినియోగించే వారు పరిచయమైన వ్యక్తుల వివరాలు, ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

 

 

 

[ Koneti Pradeep, Medipally Police, Matrimony Fraud, Marriage Scam, Kamma Matrimony, Matrimonial Website Fraud, ₹1.18 Crore Fraud, Blackmail Case, Personal Photos Threat, Cybercrime, Hyderabad Crime News, Medipally Police Station, Woman Cheated on Marriage Promise, hyderabad police, CP Sajjanar, DGP C.V.Anand ]


 

By
en-us Political News

  
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.