తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్టిమేటమ్.. నిధుల కోసం నిరవధిక దీక్ష హెచ్చరిక.!

Publish Date:Oct 26, 2026

Advertisement

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ  పరిస్థితి సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నట్లుగా కనిపిస్తోంది. సొంత పార్టీ  ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా విమర్శలు గుప్పిస్తూ ఓ వైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోతుంటే.. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విధానాలపై తిరుగుబావుటా ఎగురవేశారు.  నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు. నిధుల కేటాయింపులో జరుగుతున్న జాప్యంపై విమర్శలు గుప్పించిన ఆయన  రోడ్ల అభివృద్ధి పనుల నిధుల కోసం   ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని సొంత ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు. 

రాజాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించిన ఆయన స్థానికులను మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.  కేవలం కొద్దిమంది మంత్రుల నియోజకవర్గాలకే అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నిధులు మంజూరు అవుతున్నాయనీ,  ఎమ్మెల్యేల నియోజకవర్గాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఒక కాంట్రాక్టర్ మరణిస్తే ఆయన కుటుంబానికి రూ.5 కోట్ల బిల్లు తక్షణమే చెల్లించారని, అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కూడా ప్రాణాలు కోల్పోవాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణమా,   అభివృద్ధి నిధులా   అనేది ప్రభుత్వమే తేల్చాలన్నారు. 

క్షేత్రస్థాయిలో పనులు జరగకపోవడంతో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నామన్న ఆయన, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను పలుమార్లు నేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించినా మాటల హామీలే తప్ప నిధుల విడుదల జరగలేదని జనంపల్లి అనిరుధ్ రెడ్డి విమర్శించారు.   ప్రభుత్వం  స్పష్టమైన సానుకూల నిర్ణయం రాకపోతే గాంధీభవన్‌ వేదికగా నిరవధిక దీక్ష కు దిగుతానని హెచ్చరించారు.  


[MLA Anirudh Reddy Hunger Strike Warning, Jadcherla MLA Congress, Pending Bills,Ultimatum, Revanth, Sarkar, Teluhu One] 

By
en-us Political News

  
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.