ప్రత్యేకతెలంగాణా ఓ నెరవేరని కల?

Publish Date:Jul 23, 2012

Advertisement

ప్రత్యేకతెలంగాణా రాష్ట్రం అనేది ఓ నెరవేరని కలగా మిగులుతుందని నేటి రాజకీయవాతావరణం తేటతెల్లం చేస్తోంది. దేశ తొలిపౌరునిగా, భారత రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ఎన్నిక తెలంగాణావాదులకు ఓ పెద్దషాక్‌. భారీమెజార్టీతో ఆయన  గెలుపొందినందున(70శాతం) తెలంగాణా వచ్చే సమస్యే లేదని రాజకీయ మేథావులు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా పొరబాటున తెలంగాణాకు అనుకూలంగా స్పందిస్తే మరో కాంగ్రెస్‌ నాయకుడు దాన్ని ఖండిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణా అవసరమా? అన్న విషయంపై కేంద్రంలోని ఎంపీలు అందరూ ఒక్కతాటిపై లేరనేది జగమెరిగిన సత్యం.

 

 

ప్రత్యేకించి కాంగ్రెస్‌ ఎంపీలందరూ కూడా కేంద్రపార్టీ నిర్ణయాలకు తలొంచాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీ తరుపున పూర్తిస్థాయి అథికారాన్ని పొందేందుకు సిద్ధమవటం వల్ల కాంగ్రెస్‌ ఆ హడావుడిలో బిజీగా ఉండిపోతుందని సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు ముగియకుండానే రాహుల్‌గాంథీ కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శిగా పూర్తిస్థాయిలో పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతేకాకుండా జాతీయస్థాయిలో ఇప్పటికే ఆయన నేతలతో అన్నిరాష్ట్రాల్లోని పరిస్థితులూ తెలుసుకుని తాను ప్రధాని అయితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అన్న విషయం పరిశీలిస్తున్నారు. ప్రత్యేకించి రాహుల్‌ రాకతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రాహుల్‌గాంధీ రాజకీయరంగ ప్రవేశం చేస్తే తాను మద్దతు ఇస్తానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ఆ మాటకు ఇప్పటికీ తాము కట్టుబడి ఉంటామని వైకాపా గౌరవాథ్యక్షురాలు విజయమ్మ ఇటీవల ఢల్లీ పర్యటనలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో అన్నారట.



సో! దీని వల్ల 2014 లోక్‌సభ ఎన్నికల్లో  ప్రధాని అభ్యర్థి రాహుల్‌గాంధీ అయితే వైకాపా మద్దతు ఇవ్వటం ఖాయమని తేలుతోంది. ఈ నేపథ్యంలో తెరాస కోరుకున్న ప్రత్యేకరాష్ట్రం అసలు సాధ్యమవదు. అంతేకాకుండా వైకాపాను తెలంగాణాప్రాంతంలో పట్టుపెంచుకోమని కాంగ్రెస్‌ ప్రోత్సహిస్తోంది. ఎందుకంటే ఒకవేళ జగన్‌ విడుదలయ్యాక పార్టీ కొనసాగించినా తెలంగాణా ప్రాంతం నుంచి వైకాపా మద్దతు కాంగ్రెస్‌ కోరుకుంటోంది. 2012 పరకాల ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిని కొండా సురేఖ ఇచ్చిన గట్టిపోటీ కాంగ్రెస్‌ పార్టీని ఆకట్టుకుంది. ప్రధాని కూడా ఇదే విషయాన్ని గమనించి తెరాసకు ప్రత్యామ్నాయంగా వైకాపా చాపకింద నీరులా విస్తరించాలని సూచించారట. అందుకే విజయమ్మ ఢల్లీ నుంచి వచ్చాక తన కుమారుడితో చర్చలు జరిపి కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికులకు మద్దతు నిరసనకార్యక్రమం రూపొందించింది. అలానే జగన్‌ కూడా మొన్నటి వరకూ టిఆర్‌ఎస్‌ అథినేత కెసీఆర్‌తో రహస్య మంతనాలు కొనసాగించి ఇప్పుడు అసలు ఆయనతో మాట్లాడేందుకూ ఇష్టపడటం లేదట. 



తెలంగాణా గురించి చర్చలు నిర్వహించే పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అథిష్టానం ఇప్పుడు లేదు. రాష్ట్రపతి ఎన్నికల తరువాత తెలంగాణా గురించి ప్రతిపాదిద్దామని కెసీఆర్‌ భావించారు. ఈలోపే రాహుల్‌ ప్రధాని అభ్యర్థిత్వం తెరపైకి రావటంతో కాంగ్రెస్‌ సీనియర్లు ఆ విషయంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. నాటి రాజీవ్‌గాంధీతో సమానంగా రాహుల్‌కు క్రేజ్‌ పెంచేపనిలో కాంగ్రెస్‌ నేతలు మునిగిపోవటంతో తెలంగాణా ఇప్పట్లో రానట్లే అని మేథావులు సైతం తేలుస్తున్నారు. అలా అని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కెసీఆర్‌ సంప్రదించకుండా తెలంగాణాలోనే కొత్తచిచ్చు రగులుతోంది.  వైకాపా, తెరాస తెలంగాణా ప్రాంతంలో నిరసనల ద్వారా బలప్రదర్శనకు సిద్ధమయ్యాయి. ఈ ప్రదర్శనల హోరు తరువాత కాంగ్రెస్‌ ప్రకటించే స్థానికఎన్నికలతో 2014 ఎన్నికల దాకా తెలంగాణా అంశం పోస్టుపోన్‌ అయింది. దీంతో ఆ ఎన్నికలే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రానికి రిఫరెండం అవుతాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర డిమాండు 2014 అజెండా అంశం కాక తప్పదంటున్నారు పరిశీలకులు. మరి కెసీఆర్‌ మరో జోస్యం సక్సెస్‌ అయిందా? లేక ఫెయిల్‌ను ఎలా కవర్‌ చేస్తారు? వంటి ప్రశ్నలు ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చాయి. కాలమే దీనికి సమాధానాలు ఇవ్వాలి మరి.


   
తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటని పిసీసీ అథ్యక్షుడు బొత్సా సత్యన్నారాయణ చేసిన వ్యాఖ్యలు తెలంగాణా వాదులకు ప్రత్యేకరాష్ట్ర ఆశలు పెంచాయి. అసలు ఈ వ్యాఖ్యలే యాథృచ్ఛికమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు అన్నారు. తెలంగాణా కలిసుండాలా? విడిపోవాలా? అన్నది కేంద్ర నిర్ణయంపై ఆధారపడి ఉందని, అది బొత్సాకు ఆపాదించొద్దని ఆయన కోరారు. ప్రభుత్వం ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్న ఈ సమయంలో తెలంగాణా అంశం ఒక్కదానిపై చర్చించటం బాగోలేదన్నట్లు పాలడుగు వ్యాఖ్యలున్నాయి. ఇంకా కాంగ్రెస్‌ అథిష్టానం ప్రత్యేక తెలంగాణా అంశంపై ఒక అభిప్రాయానికి రాలేదని బొత్సా, పాలడుగు ప్రకటనలను బట్టి అర్థం చేసుకోవాలి. ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే ఇలాంటి వైరుథ్య ప్రకటనలు వెలువడేది కాదు.

By
en-us Political News

  
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.