శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం: దంపతుల అరెస్టు.!

Publish Date:Oct 24, 2026

Advertisement

హైదరాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు విదేశీ కరెన్సీ అక్రమ రవాణా గుట్టు రట్టు చేశారు.  విదేశాలకు అక్రమంగా తరలించేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకుని దాదాపు కోటీ 56 లక్షల రూపాయల విలువైన   విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 

వివరాలిలా ఉన్నాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు వెళ్లేందుకు ఎయిర్ ఏషియా విమానం ఎక్కేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు అతడిని అడ్డుకుని లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అతడి  ట్రాలీ బ్యాగులోని దుస్తుల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్లలో విదేశీ కరెన్సీని  దాచిన విషయం బయటపడింది. అతడి వద్ద నుంచి  66 వేల 600 అమెరికా డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న విదేశీ కరెన్సీ విలువ   భారత కరెన్సీలో  సుమారు రూ. 63 లక్షల 62 వేల రూపాయలుగా అంచనా వేశారు. 

ఈ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, విమానంలో వేరే సీటులో ప్రయాణిస్తున్న అతని భార్య కూడా ఈ అక్రమ రవాణాలో భాగస్వామిగా ఉన్నట్లు తేలింది. వెంటనే అప్రమత్తమైన డీఆర్ఐ సిబ్బంది ఆమెను కూడా అడ్డుకుని తనిఖీలు చేపట్టారు. ఆమె లగేజీలోనూ సరిగ్గా అదే పద్ధతిలో దుస్తుల మధ్య దాచిన 97 వేల 600 అమెరికా డాలర్లను గుర్తించారు. వీటి విలువ ఇండియన్ కరెన్సీలో 91.94 లక్షల రూపాయలని అధికారులు తెలిపారు.   ఈ భారీ మొత్తానికి సంబంధించి ఎలాంటి చట్టబద్ధమైన అనుమతి పత్రాలు గానీ,   ఆధారాలు గానీ ఆ దంపతుల వద్ద లేకపోవడంతో,  కస్టమ్స్ చట్టం ప్రకారం నగదుతో పాటు రవాణాకు ఉపయోగించిన బ్యాగులను సీజ్ చేసిన డిఆర్ఐ అధికారులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  


[Foriegn Currency Seized Shamshabad Airport, DRI Seizure Hyderabad, Foreign Currency Smuggling, RGIA Airport , Kuala Lumpur Flight, TeluguOne] 

By
en-us Political News

  
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
1,000 మందికి పైగా టార్గెట్‌.. నిందితుడు అరెస్టు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.