స్టార్ లింక్ ఎంట్రీకి నో: కేంద్రాన్ని డిమాండ్ చేసిన స్వదేశీ జాగరణ్ మంచ్.!

Publish Date:Oct 14, 2026

Advertisement

ఎలాన్ మస్క్‌  సాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ  స్టార్‌లింక్  కార్యకలాపాలపై దేశ వ్యాప్తంగా  వ్యతిరేకత రోజు రోజుకూ తీవ్రమౌతోంది.   దేశ సార్వభౌమత్వానికి, రక్షణ రంగానికి ఈ ప్రాజెక్ట్ నుంచి ముప్పు పొంచిఉందన్న ఆందోళనలతో జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్   ఆర్థిక అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్ మంచ్  స్టార్‌లింక్ సేవలను దేశంలో పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి ఎలాంటి విదేశీ టెలికాం, సాటిలైట్ దిగ్గజాలకు అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది.

ఈ తాజా వివాదానికి ప్రధాన కారణం స్టార్‌లింక్ అనుసరిస్తున్న అత్యాధునిక సాంకేతిక విధానమే. ఆ సంస్థ వినియోగిస్తున్న సాటిలైట్-టు-సాటిలైట్ లేజర్ లింక్ టెక్నాలజీ ద్వారా డేటా నేరుగా ఇండియన్  గేట్‌వేలను తాకకుండా విదేశాలకు చేరే అవకాశం ఉందని నిపుణులు, ఎస్‌జేఎం నేతలు హెచ్చరిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ నిబంధనలను, నిఘా వ్యవస్థలను తప్పించుకుని ఈ సమాచారం అంతర్జాతీయంగా ప్రసారమైతే, అత్యవసర సమయాల్లో దేశ భద్రతా దళాలకు,  సంస్థలకు  పెను ముప్పు తప్పదని ఎస్జేఎం అంటోంది. దేశ సరిహద్దులు దాటి వెళ్లే సున్నితమైన సమాచారానికి ఎలాంటి సార్వభౌమ పర్యవేక్షణ ఉండకపోవడం పెద్ద లోపం అంటున్నారు.

ఈ అంశంపై ఎస్‌జేఎం జాతీయ సహ-సంచాలకుడు అశ్విని మహాజన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ సంస్థల ఒత్తిళ్లకు లేదా వ్యాపార వాదనలకు తలొగ్గి నిబంధనలను సడలించవద్దని కేంద్రాన్ని కోరారు. టెలికాం రంగంలో భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే  పోటీతత్వంతో కూడిన  డేటా సేవలను అందించే మార్కెట్‌గా ఎదిగిందని గుర్తుచేసిన ఆయన   విదేశీ సంస్థల హార్డ్‌వేర్,  రూటింగ్ ఆర్కిటెక్చర్‌పై పూర్తిస్థాయి స్పష్టత లేకుండా, రాకుండా వాణిజ్య పరమైన అనుమతులు ఇవ్వడం దేశ భద్రతను ప్రమాదంలో నెట్టడమేనన్నారు.

యూజర్ల నియంత్రణ కేంద్రాలు విదేశీ గడ్డపై ఉంటే, దేశ భద్రతా నిర్ణయాలను ప్రభావితం చేసే అదనపు లీవర్‌గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  భారత్‌లో స్పెక్ట్రమ్ కేటాయింపులు,  లైసెన్సింగ్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై ఎలాన్ మస్క్ ఇటీవల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఈ రగడకు మరింత ఆజ్యం పోసింది. 

నిబంధనలను వేగవంతం చేయాలని ఆయన ఒత్తిడి తెస్తున్న తరుణంలో, స్వదేశీ సంఘాల నుంచి  ప్రతిఘటన ఎదురు అవుతోంది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ గతంలోనే స్పష్టం చేసినట్లుగా, విదేశీ హార్డ్‌వేర్,  నెట్‌వర్క్ భద్రతా ప్రమాణాలను హోంశత్వ శాఖ ) నిశిత పరిశీలన తర్వాతే తదుపరి నిర్ణయాలు ఉంటాయి. ఉండాలి కూడా.  దేశీయ ప్రైవేట్ స్పేస్ పరిశ్రమ వృద్ధి చెందుతున్న తరుణంలో, విదేశీ నెట్‌వర్క్‌లపై అత్యధికంగా ఆధారపడటం భవిష్యత్తులో దేశీయ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.

రాబోయే రోజుల్లో శాటిలైట్ కమ్యూనికేషన్ మార్గదర్శకాలను మరింత కఠినతరం చేయాలని, అలాగే డేటా లోకలైజేషన్ నిబంధనలను అత్యంత కట్టుదిట్టంగా అమలు చేయాలని భద్రతా నిపుణులు కోరుతున్నారు. విదేశీ సంస్థల నుంచి ఏ చిన్న నిబంధన ఉల్లంఘన జరిగినా కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సమాజం నుండి కూడా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.


[Swadeshi Jagaran Manc Demand Starlink India Ban, National Security Threat, Elon Musk Satellite Internet, RSS Affiliated SJM,  Starlink Elan Musk, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.