జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు: ఏపీ నగరాలకు చోటు.. విశాఖకు టాప్ ప్లేస్.!

Publish Date:Nov 12, 2026

Advertisement

కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ఏటా   ప్రకటించే  స్వచ్ఛ సర్వేక్షణ్  జాతీయ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ నగరాలు సత్తా చాటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలతో పోటీపడి ఏపీకి చెందిన మూడు  నగరాలు.. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు అగ్రస్థానాలలో నిలిచి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు  సొంతం చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పటిష్టమైన పారిశుద్ధ్య విధానాలు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు ఈ జాతీయ ర్యాంకింగ్స్ నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి.

తాజాగా విడుదలైన కేంద్ర ప్రభుత్వ సర్వే ఫలితాల ప్రకారం, దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని నవీ ముంబై మొదటి  స్థానంలోనూ,  గుజరాత్‌లోని సూరత్ రెండో స్థానంలోనూ నిలిచాయి. ఇక వీటి సరసన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరం మూడో  స్థానంలో నిలిచింది. దక్షిణాదిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం వంటి దిగ్గజ మెట్రో నగరాలను తోసి రాజని బెజవాడ ఈ ఘనత సాధించడం విశేషం.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. తడి , పొడి చెత్తను వేరుచేసి సేకరించే విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు, గతంలో  వైసీపీ హయాంలో   నిర్లక్ష్యానికి గురైన చెత్త శుద్ధి కేంద్రాలను   పునరుద్ధరించింది. నగర వీధుల్లో ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా చెత్త సేకరణ వాహనాల సంఖ్యను పెంచడమే కాకుండా, అడుగడుగునా చెత్తకుండీలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు విజయవాడ రూపురేకలను మార్చేశాయి. ఈ కారణంగా బెజవాడ జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ లో నిలిచింది. 

 ఇక మరోవైపు, జనాభా ప్రాతిపదికన విభజించిన విభాగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ నగరాలు అగ్రభాగాన నిలిచాయి. పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల జాబితాలో విశాఖపట్నం దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విభాగంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో మూడో స్థానంలో నిలిచాయి. విశాఖలో మెరుగైన జీవన ప్రమాణాలు, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాలలో విస్తరిస్తున్న ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ అనుకూల విధానాల వల్ల ఇతర ప్రాంతాల ప్రజలు సైతం ఇక్కడ నివసించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇది కూడా చదవండి: స్వచ్ఛ సర్వేక్షణ్ 2020.. టాప్‌ 10లో మూడు ఏపీ నగరాలు

అదేవిధంగా, మూడు నుంచి పది లక్షల మధ్య జనాభా కలిగిన నగరాల విభాగంలో గుంటూరు  జాతీయ స్థాయిలో మూడో స్థానాన్ని సాధించింది. ఈ విభాగంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మొదటి స్థానంలో, చండీగఢ్ రెండో స్థానంలో నిలిచాయి.  గతంలో కేంద్రం ప్రకటించే జాతీయ జాబితాలలో ఆంధ్రప్రదేశ్ పట్టణాలకు పెద్దగా గుర్తింపు లభించేది కాదు.  

అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పట్టణాభివృద్ధి, పరిశుభ్రతకు పెద్దపీట వేయడంతో పరిస్థితులు వేగంగా మారాయి. ఏపీ అనుసరిస్తున్న పట్టణ పరిపాలన విధానాలను ఇప్పుడు ఇతర రాష్ట్రాలు సైతం అధ్యయనం చేసే స్థాయికి, ఆదర్శంగా తీసుకునే స్థాయికీ చేరుకున్నాయి.  

మీకు నచ్చవచ్చు: విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు: పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యం.!

విశాఖ వేదికగా సీఐఐ సదస్సు ప్రారంభం: ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి పియూష్ గోయెల్.!

[Swachhsurvekshan, APcities, Topranks, Chandrababu, TeluguOne]   

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.