సీఈసీ, ఈసీల నియామకంపై పిటిషన్లు: సుప్రీం ద్విసభ్య దర్మాసనం విభజిత తీర్పు.!

Publish Date:Sep 23, 2026

Advertisement

 ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీల) నియామకాలకు సంబంధించిన చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ  దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి   బదిలీ చేసే అంశంపై సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో దీనిపై  విభజిత తీర్పు వెలువడింది.   ఈ చట్టం రూపకల్పన, అమల్లోకి వచ్చిన తీరు,  రాజ్యాంగబద్ధతపై పిటిషనర్లు పలు ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఈ నూతన చట్టం ఉందనే వాదనలు గట్టిగా వినిపించాయి.

ఈ నేపధ్యంలో, పిటిషన్ల విచారణను మరింత విస్తృతమైన ధర్మాసనానికి సిఫారసు చేయాలా వద్దా అనే దానిపై న్యాయమూర్తుల మధ్య భిన్నమైన అభిప్రాయాలు తలెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఈసీ,  ఇతర ఈసీల నియామకాల పారదర్శకతను పెంచాలనే ఉద్దేశంతో దాఖలైన ఈ పిటిషన్లు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. 

సీఈసీ, ఈసీల నియామక ప్రక్రియలో కార్యనిర్వాహక వర్గానికి ఎక్కువ అధికారాలు కట్టబెడుతున్నారని పిటిషనర్లు తమ వ్యాజ్యాలలో పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో, తదుపరి విచారణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి,  ఈ కేసును ఏ బెంచ్‌కు కేటాయించాలనే విషయాలపై అత్యున్నత న్యాయస్థానం త్వరలోనే స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఈ న్యాయపరమైన వివాదంపై తుది తీర్పు వెలువడితే, భవిష్యత్తులో ఎన్నికల సంఘం అధికారుల నియామకాల్లో కీలకమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

[Supreme Court, Split Verdict, CEC and ECs Act, Chief Election Commissioner, Election Commissioners, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.