ఆయనకు తిక్కుంది... దాని వెనుక అర్థం కాని లెక్కుంది!

Publish Date:Feb 13, 2017

Advertisement

 

సుబ్రమణియన్ స్వామి... ఈయన పేరు చెబితే దాదాపు అన్ని పార్టీల వారు భయపడిపోతారు! అలా భయపడే వారి లిస్ట్ లో ఆయన స్వంత పార్టీ బీజేపి నేతలు కూడా వుంటారు! స్వామివారికి ఆగ్రహం వస్తే ఎంతటి వారిపైనైనా స్వారీ చేసేస్తారు! సుబ్బుతో పెట్టుకుంటే సబ్బు పెట్టి కడిగేస్తాడని ప్రతీతి!

 

తమిళనాడులో జరుగుతోన్న రాజకీయ జల్లికట్టులో బీజేపి పార్టీదీ, కేంద్ర ప్రభుత్వానిది, ఒక విధంగా .. మోదీది మద్దతు ఎవరికో అందరికీ తెలిసిందే! పన్నీర్ కే పట్టం కట్టాలని కమలనాథులు ఆశిస్తున్నారు. అయితే, సుబ్రమణియన్ స్వామి మాత్రం రివర్స్ రూటులో వెళుతున్నాడు. ఆయన శశికళ కోసం రంగంలోకి దిగాడు. నేరుగా తనకు అలవాటున్న కోర్టు మెట్లెక్కి పీటీషన్ వేసేశాడు! తమ కేంద్ర ప్రభుత్వమే నియమించిన తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు చేత శశికళకు ఆహ్వానం పంపాలని కోర్టును కోరాడు! అసలు సుప్రీమ్ కోర్టులో అవినీతి, అక్రమ ఆస్తుల కేసులో తీర్పు కోసం ఎదురు చూస్తోన్న శశికళ సీఎంగా ఎలా పనికి వస్తుంది? పోనీ సుబ్రమణియన్ స్వామికి సదరు కేసు గురించి తెలియదా అంటే... ఆ కేసు వేసి జయలలితను, శశికళను జైల్లో పెట్టించిందే ఆయన! కాని, ఇప్పుడు మాత్రం తప్పు చేసిందని ఆయన గతంలో తిట్టిపోసిన మన్నార్ గుడి మాఫియా మహారాణి శశికళే... సీఎం అవ్వాలంటున్నాడు!

 

సుబ్బు లాజిక్ చాలా సింపుల్ అనే చెప్పాలి శశికళ విషయంలో! ఆమెకు అవసరానికి తగినంత మద్దతు ఎమ్మెల్యేల నుంచి వుంది. కోర్టు తీర్పు ఎలా వచ్చినా ఆమె సీఎం అవ్వటం ఖాయం. గవర్నర్ ఎన్ని రోజులు ఆపినా ప్రమాణ స్వీకారం చేయించాల్సిందే. కాబట్టి ఆమెకు మద్దతుగా నిలిచి అందరి ముందు తాను న్యాయం వైపు వుంటానని నిరూపించుకోవటం ఆయన ఉద్దేశం. అలాగే, రేపు శశికళ సీఎంగా పీఠంపై స్థిరంగా కూర్చోగలిగితే ఆమెను కేంద్రానికి, బీజేపికి దగ్గర చేసే ఛాన్స్ కూడా ఆయనకు వుంటుంది. అంటే, తమిళ పాలిటిక్స్ లో ఢిల్లీ నుంచీ చక్రం తిప్పవచ్చన్నమాట!

 

సుబ్రమణియన్ స్వామి తిక్క, దాని వెనుక వున్న లెక్కా ఎలా వున్నా.... ఇప్పడు మాత్రం బీజేపికి ఆయన కంటిలో నలుసులా మారాడు! తమిళనాడులో బలంగా స్థిరపడాలని చూస్తూ, అందుకోసం పన్నీర్ ను తమ పాస్ పోర్ట్ గా భావిస్తున్న కమలనాథులు తమ స్వంత నేత వ్యవహార శైలి వల్ల ఇబ్బంది పడుతున్నారు! ఒకవైపు వెంకయ్య తమిళనాడులో సీఎం పదవి ఖాళీ లేదంటూ శశికళకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటే... సుబ్బూ మాత్రం కొందరు కేంద్ర మంత్రులు చెన్నై రాజకీయాల్లో అతిగా కలగజేసుకుంటున్నారని చురకలు అంటిస్తున్నాడు! చివరికి స్వామి సహకారం శశికి ఎంత మేర ఉపయోగపడుతుందో... చూడాలి!

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.