స్టార్ లింక్ ఇండియా ఎంట్రీలో జాప్యం: మస్క్ ఆరోపణలు, కేంద్రం ఖండనలు.. అసలు వాస్తవం ఏంటి.?

Publish Date:Oct 9, 2026

Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ భారత్‌లో మాత్రం ఇంకా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించలేదు. అవసరమైన కొన్ని కీలక అనుమతులు పొందినప్పటికీ, తుది భద్రతా పరిశీలనలు, స్పెక్ట్రమ్‌ కేటాయింపు ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది. ఈ ఆలస్యంపై మస్క్‌లో సహజంగానే అసంతృప్తి, అసహనం వ్యక్తమౌతున్నాయి. వాటిని ఆయన  సెన్సేషనలైజ్ చేసే విధంగా వ్యూహాత్మకంగా వ్యక్తం చేశారు.  భారత్‌లోని కొందరు ప్రభావశీల వ్యాపారవేత్తలు తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు స్టార్‌లింక్‌ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా  ఖండించింది. దేశంలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ పారదర్శకంగా, అన్ని సంస్థలకు ఒకే విధంగా కొనసాగుతోందని విస్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.  

స్టార్‌లింక్‌ సేవలు ఇండియాలో ప్రవేశంలో జరుగుతున్న జాప్యంపై ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. విస్తృత చర్చకు దారి తీశాయి. . భారత్‌లో కొందరు సంపన్న వ్యాపారవేత్తలు తమ మార్కెట్‌ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు స్టార్‌లింక్‌కు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆయన అక్కడితో ఆగకుండా..  ముఖేష్‌ అంబానీ ప్రభావం, ప్రమేయాన్ని ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రాన్ని ఆయన తన గుప్పిట పెట్టుకుని షాడో గవర్నమెంట్ గా వ్యవహరిస్తున్నారన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.  

ఆ వెంటనే కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ఇండియాలో ప్రవేశానికి స్వాగతం పలుకుతున్నామని ప్రకటించి.. ఆయన మరో వ్యక్తి గురించి తెలసుకున్నా తరువాత పరిస్థితి మరింత అవగాహనకు వస్తుందంటూ వ్యంగ్య వాఖ్యలను జోడించారు.  రాహుల్ వ్యాఖ్యలతో  స్టార్‌లింక్‌ అనుమతుల వ్యవహారం కేవలం సాంకేతిక అంశంగా ఉన్నది కాస్తా,  వ్యాపార పోటీ, రాజకీయ ప్రమేయం అన్న చర్చకు కేంద్ర బిందువుగా మారిపోయింది.  అది పక్కన పెడితే.. ఎలాన్ మస్క్ ఆరోపించినట్లుగా   గుత్తాధిపత్యం, షాడో గవర్నమెంట్ అన్న అంశాలను నిరూపించే ఆధారాలేవీ కనిపించడం లేదు. లేదా మస్క్ వెల్లడించలేదు.  

అన్నిటికీ మించి స్టార్‌లింక్‌ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల ఫలితాలే వచ్చాయి. ఇప్పటికే  టెలికమ్యూనికేషన్స్‌ శాఖ నుంచి జీఎంపీసీఎస్ ఆపరేటర్‌ లైసెన్స్‌, భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక,  అధికార సంస్థ (ఇన్ స్పేస్) నుంచి అవసరమైన అనుమతులు స్టార్ లింక్ పొందింది. దేశంలో కార్యకలాపాల కోసం మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేసింది. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.  

అయితే ఇవి దేశంలో వాణిజ్య సేవలు ప్రారంభించడానికి సరిపోవు.  భద్రతా ప్రమాణాలు, స్పెక్ట్రమ్‌ కేటాయింపు, దేశీయ నిబంధనలకు అనుగుణంగా సాంకేతిక వ్యవస్థల ఏర్పాటు వంటి ప్రక్రియలు పూర్తవ్వాల్సి ఉంది.   

ఆ విషయంలో ఇంకా అడుగు ముందుకు పడకపోవడానికి  భద్రతాపరమైన అంశాలే కారణమని ప్రభుత్వం చెబుతోంది. ఉపగ్రహ ఇంటర్నెట్‌ సేవల్లో వినియోగదారుల డేటా ఏ మార్గంలో ప్రయాణిస్తోంది, దాన్ని భారత అధికారులు అవసరమైనప్పుడు పర్యవేక్షించగలరా అనే కీలక అంశాల విషయంలో ఇప్పుడు పరిశీలనలు జరుగుతున్నాయి. చట్టబద్ధమైన నిఘా అవసరాలకు సహకరించడం, డేటా స్థానికీకరణ నిబంధనలను పాటించడం, అత్యవసర పరిస్థితుల్లో నిర్దిష్ట ప్రాంతాల్లో సేవలను నిలిపివేయగలగడం వంటి షరతులను ఉపగ్రహ సేవల సంస్థలు పాటించాల్సి ఉంటుంది.

స్టార్‌లింక్‌ నెట్‌వర్క్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఉపగ్రహ వ్యవస్థపై ఆధారపడుతుంది. ఉపగ్రహాల మధ్య లేజర్‌ లింకుల ద్వారా డేటా ప్రయాణించే విధానం వల్ల భారత వినియోగదారుల ట్రాఫిక్‌ దేశీయ గేట్‌వేల ద్వారానే వెళ్లేలా నియంత్రించడం ఎలా అన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అందువల్ల భద్రతా పరీక్షలు, సాంకేతిక అనుసరణలు పూర్తి చేయడం కోసమే తుది స్టార్ లింక్ కు  తుది అనుమతులకు ఇంకా లభించలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

స్టార్‌లింక్‌ విషయంలో వివక్ష చూపుతున్నారన్న మస్క్‌ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. స్టార్‌లింక్‌తో పాటు జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌, ఎయిర్‌టెల్‌ మద్దతున్న యూటెల్‌సాట్‌ వన్‌వెబ్‌ సంస్థలూ అవసరమైన భద్రతా పరిశీలనలను ఎదుర్కొంటున్నాయని స్పష్టం చేసింది. అన్ని సంస్థలకూ ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయని, భద్రతా అనుమతులు పూర్తయ్యే వరకూ  వాణిజ్య సేవలకు తుది అనుమతి ఇవ్వలేమని, ఇవ్వబోమనీ కేంద్రం కుండబద్దలు కొట్టింది.  ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.   దేశంలో ఏ సంస్థకూ గుత్తాధిపత్యం ఉండేలా ప్రభుత్వం వ్యవహరించదని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. స్టార్‌లింక్‌ ఒక్కటే కాకుండా, శాటిలైట్‌ ఇంటర్నెట్‌ రంగంలో పనిచేయాలనుకుంటున్న ఇతర సంస్థలూ నిర్దేశిత నిబంధనలను పూర్తి చేయాల్సిందేనని ప్రభుత్వం విస్పష్టంగా చెబుతోంది.  

[Starlink India Entry Delay, Elon Musk, Mukesh Ambani, Reliance Jio, Satellite Internet, Central Government, Security Clearances, Rahul Gandhi, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.