శ్రీకాకుళం రైతాంగానికి ఉద్యమాలు కొత్తేమీ కాదు. గతంలో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చారిత్రాత్మక సాయుధ పోరాటాలు చేశారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న శ్రీకాకుళం రైతాంగాన్ని నాగార్జున కనస్ట్రక్షన్స్ కంపెనీ రెచ్చగొడుతోంది. ఈ కంపెనీ సోంపేట మండలం రుషికుర్దా సమీపంలో 2,640 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్లాంట్ నెలకొల్పటానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ థర్మల్ ప్లాంటు ఏర్పాటును స్థానిక రైతాంగం వ్యతిరేకిస్తోంది. చిత్తడినేల బీట ప్రాంతాన్ని చవుడు నేలలుగా రికార్డుల్లో చూపి అక్కడ థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు నాగార్జున కనస్ట్రక్షన్స్ కంపెనీ యాజమాన్యం అనుమతులు పొందిందని రైతులు ఆరోపిస్తున్నారు.
కంపెనీ ప్రతినిథులు 2010 జులై 14న ఈ ప్రాంతంలో కంచె వేయటానికి ప్రయత్నించగా వందలాది మంది స్థానిక రైతులు, ప్రజలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విచక్షణారహితంగా కాల్చటంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన తరువాత ప్రాజెక్టు అనుమతులన్నీ పెండింగ్ లో పెట్టినట్టు కేంద్రం ప్రకటించింది. సోంపేటలోని కార్యాలయాన్ని ఎన్.సి.సి. యాజమాన్యం వేరే చోటికి తరలించింది. వివాదం సద్దుమణి గిందని అనుకుంటున్న సమయంలో ఈ ప్లాంటు ఏర్పాటుకు అన్ని అనుమతులు మంజూరు చేశామని కేంద్రమంత్రి జయంతి నటరాజన్ కొద్దిరోజుల క్రితం లోక్ సభలో ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తమ ప్రాణాలు పోయినా సరే తమ భూములను కాపాడుకుంటామని, విద్యుత్తు ప్లాంటు ఏర్పాటును అడ్డుకుని తీరతామని రైతులు హెచ్చరించారు. అణుధార్మిక కాలుష్యం కన్నా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కాలుష్యం ఎన్నోరెట్లు ప్రమాదకరమని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/srikakulam-district-farmers-ready-to-fight-against-nagarjuna-constructions-24-13831.html
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!