ధర్మాన్ కృష్ణదాస్ కు తొందరెక్కువ
Publish Date:Apr 2, 2012
Advertisement
శ్రీకాకుళంజిల్లా నరసన్నపేట ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన్ కృష్ణదాస్ కు తొందరెక్కువనే విమర్శలు వస్తున్నాయి. కృష్ణదాస్ అందరికన్నా ముందుగా తన నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ఇక్కడదాకా బాగానే ఉన్నా ఎన్నికల ప్రచారంలో ఆయన చేస్తున్న ప్రసంగాలు కార్యకర్తలకు కూడా కొంత భయాన్ని, మరికొంత అనుమానాన్ని కలిగిస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్, టిడిపిలు అభ్యర్ధుల ఎంపికలో సతమతమయ్యారు. అయితే కృష్ణదాస్ మాత్రం తన ఓటమికి ఈ రెండు పార్టీలు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన కార్యకర్తలను భయపెడుతున్నాయని కూడా ఆయన అంటున్నారు. నిజానికి అటువంటి సంఘటనలేవీ ఎక్కడా కనిపించలేదు. ధర్మాన్ సోదరులు తన అన్నగారైనా కృష్ణదాస్ పై ఇప్పటివరకు పల్లెత్తుమాట అనలేదు. ఎక్కడా ఎటువంటి విమర్శలు చేయలేదు. కానీ కృష్ణదాస్ తొందరపడి తన తమ్ముళ్ళపై నోరుజారుతున్నారన్న అపవాదును మాత్రం మూటగట్టుకుంటున్నారు. తమ్ముళ్ళు హుందాగా ప్రచారం చేస్తుంటే అన్నగారు అవాకులు చవాకులు పేలుతున్నారు.
http://www.teluguone.com/news/content/srikakulam-district-24-13078.html





