అమరావతిలో స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ: శాశ్వత్ గోయెంకాకు మంత్రి లోకేష్ ప్రతిపాదన.!

Publish Date:Nov 13, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌ను క్రీడలు, ఐటీ, పునరుత్పాదక ఇంధన రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో భాగంగా  ఆర్‌పీఎస్‌జీ  గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శాశ్వత్ గోయెంకాతో  మంత్రి నారా లోకేష్  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో అత్యాధునిక  స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయడంతో పాటు, పలు కీలక రంగాలలో   ఆర్పీఎస్జీ గ్రూపు కార్యకలాపాలను విస్తరించాలని   కోరారు.

ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఆధ్వర్యంలో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీని నెలకొల్పి, క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించాలని కోరిన లోకేష్.. లక్నో,  డర్బన్ సూపర్ జెయింట్స్ వంటి ఫ్రాంచైజీల నిర్వహణ అనుభవం ఉన్న ఆర్‌పీఎస్‌జీ గ్రూప్..  రాష్ట్రంలోని గ్రామీణ స్థాయి ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) లో ఒక స్థానిక జట్టును కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. గ్రామ స్థాయి శిక్షణ నుంచి ప్రొఫెషనల్ స్థాయికి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు పబ్లిక్, ప్రైవేట్-పీపుల్ భాగస్వామ్య (పీ4) నమూనాలో ముందుకు రావాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ యువ క్రీడాకారులకు స్పాన్సర్‌షిప్ అందించాలని విజ్ఞప్తి చేశారు.

వస్త్ర, జీవనశైలి,  ఇంధన రంగాలలో పెట్టుబడుల అవకాశాలను కూడా మంత్రి ఈ భేటీలో చర్చించారు.  చేనేతకు ప్రసిద్ధి చెందిన మంగళగిరిలో ఆర్‌పీఎస్‌జీ అనుబంధ లగ్జరీ లైఫ్‌స్టైల్ బ్రాండ్  ఎఫ్‌ఎస్‌పీ   డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున సోర్సింగ్, తయారీ,  డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనీ,  అలాగే..  గ్రీన్ పవర్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలని కోరారు. 

ఐటీ రంగ విస్తరణలో భాగంగా, ప్రస్తుతం విజయవాడలో  ఉన్న ఆర్‌పీఎస్‌జీ అనుబంధ సంస్థ  ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్  కార్యకలాపాలను మరింత పెంచాలనీ,  దీనికి అదనంగా విశాఖపట్నం లేదా తిరుపతిలో కొత్త ఐటీ కార్యాలయాలను ప్రారంభించే అవకాశాలను పరిశీలించాలని లోకేష్ శాశ్వత్ గోయెంకాను కోరారు . రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం, వేగవంతమైన అనుమతులు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి:  ఏపీలో పారిశ్రామిక పురోగతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.!

లోకేష్ ప్రతిపాదనలకు  ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయెంకా సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే విజయవాడలోని మేధా ఐటీ టవర్‌లో తమ సంస్థ  ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ కార్యాలయం సమర్థవంతంగా పనిచేస్తోందన్న ఆయన..   2025లో విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ  భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం మేరకు, రాష్ట్రంలో   3 వేల 286 కోట్ల భారీ పెట్టుబడితో 349.8 మెగావాట్ల పవన విద్యుత్  ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. 

విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలలో తమ గ్రూప్‌నకు చెందిన  స్పెన్సర్స్ రిటైల్' ద్వారా హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని   గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ముందుంచిన స్పోర్ట్స్ అకాడమీ, ఐటీ ,  డిజైన్ సెంటర్ల ప్రతిపాదనలు   ఆసక్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ, వీటిపై తమ బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

మీకు నచ్చవచ్చు:  విశాఖ వేదికగా సీఐఐ సదస్సు ప్రారంభం: ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి పియూష్ గోయెల్.!

ఈ నెల 12, 13వ తేదీల్లో సాగర తీరాన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026.!


[SportsTrainingAcademy,  RPSGGroup , Shashwat Goenka,  APInvestments, RenewableEnergy, TeluguOne] 

By
en-us Political News

  
విశాఖలో సినిమా, క్రియేటర్ ఎకానమీ అభివృద్ధికి సహకారం అందిస్తాం..!
మురసు తుపాను కారణంగా రాష్ట్రంలో  2,484.43 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల్లో వెల్లడైంది. రాష్ట్రంలోని 106 మండలాలు, 315 గ్రామాల పరిధిలో దాదాపు 1.93 లక్షల మంది ప్రజలు ఈ తుపాను ప్రభావానికి గురయ్యారని రాష్ట్ర అధికారులు పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి నివేదించారు.
విశాఖపట్నంలో వైభవంగా జరుగుతున్న సీఐఐ సదస్సు కేవలం పారిశ్రామిక ఒప్పందాలకే కాకుండా, ప్రముఖుల ఆసక్తికర సంభాషణలకు కూడా వేదికగా నిలిచింది.
భవిష్యత్తు ఏపీ ఎలా ఉండబోతోంది.. సీఎం చంద్రబాబుతో జర్నలిస్ట్ పాల్కి శర్మ ముఖాముఖి.!
తొలి రోజు  రాష్ట్రంలోకి ఏకంగా 5.84 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి.  మొత్తం 88కి పైగా కీలక ఒప్పందాలు    కుదిరాయి. ఇందులో భాగంగా 73 అవగాహన ఒప్పందాలు,  15 ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ భారీ పెట్టుబడులకు బాటలు పడ్డాయి. ఈ పారిశ్రామిక ప్రాజెక్ట్‌ల  1.07 లక్షల ప్రత్యక్ష,  పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
దేవాంశ్‌ డైనోసార్ల నేపథ్యంతో  డైనో డీట్స్ పేర ఒక పాడ్‌కాస్ట్,  యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ ఏడాది మేలో మొదలైన   ఈ పాడ్‌కాస్ట్ ఇప్పటివరకు పాతిక ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా ప్రతి ఎపిసోడ్ లక్షల సంఖ్యలో వ్యూస్ ను సంపాదించింది.
భూమా మౌనిక రెడ్డి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో భారీ పారిశ్రామిక యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.  36 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో  ఒప్పందం కుదుర్చుకున్నారు.
డిక్సన్ టెక్నాలజీస్ రాష్ట్రంలో కొత్తగా  700 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది.   మంత్రి నారా లోకేష్‌తో ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఓఓ పంకజ్ శర్మ విశాఖలో  భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్   వేదికగా ఈ పెట్టుబడి పెట్టేందుకు పంకజ్ శర్మ సానుకూలత వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పూణేలో విజయవంతంగా అమలవుతున్న లిక్విడ్ రోబోటిక్స్  కో-ప్రొడక్షన్ నమూనాను నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె కేంద్రంగా పునరావృతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ నికుంజ్ పరాశర్ ను కోరారు.
2029 ఎన్నికలకు సమాయత్తమయ్యే క్రమంలో కీలకమైన రానున్న రెండేళ్లలో ఇప్పటి వరకూ గమనించిన పాలనా లోపాలను సరిదిద్దడమే కాకుండా, ఇటు ప్రభుత్వం, అటు పార్టీని మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు చంద్రబాబు నడుంబిగించారని అంటున్నారు.  
శ్రీసిటీలో రూ.1,800 కోట్లతో విస్తరిస్తున్న చాక్లెట్ ప్లాంట్.!
రూ.19 వేల కోట్లతో రెండో యూనిట్ ఏర్పాటు.. 12 వేల మందికి ఉద్యోగాలు.!
భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగ ఆలయ ప్రాంగణమంతా కమ్ముకోవడంతో భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. భారీ శబ్దంతో మంటలు చెలరేగడంతో పోటులో పనిచేస్తున్న కార్మికులు, ఆ సమయంలో అక్కడ ఉన్న భక్తులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.