ఏపీలో ల్యాప్‌టాప్, సర్వర్ తయారీ యూనిట్: లోకేష్ ప్రతిపాదనకు డిక్సన్ టెక్నాలజీ సానుకూల స్పందన.!

Publish Date:Nov 13, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరర్  డిక్సన్ టెక్నాలజీస్ రాష్ట్రంలో కొత్తగా  700 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది.   మంత్రి నారా లోకేష్‌తో ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఓఓ పంకజ్ శర్మ విశాఖలో  భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్   వేదికగా ఈ పెట్టుబడి పెట్టేందుకు పంకజ్ శర్మ సానుకూలత వ్యక్తం చేశారు. ఈ నూతన ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని   2300 మందికి  ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఈ భేటీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..  భారతదేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ తయారీ కేంద్రంగా గుర్తింపు పొందిన డిక్సన్ తిరుపతి హబ్‌తో పాటు, కడప జిల్లా కొప్పర్తిలోనూ తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు  కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మరింత బలోపేతం చేసేందుకు డిక్సన్ ఇన్వెంటెక్ జాయింట్ వెంచర్  ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లు,  సర్వర్ల తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలని లోకేష్ ఆహ్వానించారు. ఐటీ హార్డ్‌వేర్ తయారీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. 

రాష్ట్రంలో డిక్సన్ టెక్నాలజీస్ ప్రస్థానాన్ని,  భవిష్యత్తు ప్రణాళికలను సంస్థ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ ఈ సందర్భంగా వివరించారు. 2018  నుంచే తిరుపతిలో తమ సంస్థకు దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ తయారీ ప్లాంట్ ఉందని, ఇన్ హౌస్ ఎల్‌సీఎం లైన్‌తో షియోమి సహా పలు ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను ఇక్కడి నుంచే తయారు చేస్తున్నామని తెలిపారు. దీనికి తోడు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడలో  ఏఐఎల్ డిక్సన్  యూనిట్‌ను  450 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విస్తరణ ద్వారా అదనంగా ఏడు వేల మందికి ఉపాధి దక్కనుందని, ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం  లభించిందని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ముందుంచిన ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్,  సర్వర్ల తయారీ ప్రతిపాదనలు   ఆకర్షణీయంగా ఉన్నాయన్న పంకజ్ శర్మ,  ఈ అంశాలపై తమ సంస్థ ఉన్నత స్థాయి బృందంతో క్షుణ్ణంగా చర్చించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం త్వరలోనే   సానుకూల నిర్ణయం తీసుకుంటామని అన్నారు.  రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి అందుతున్న ప్రోత్సాహకాలు,  మౌలిక సదుపాయాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  ఏపీలో కోకో సాగుకు కొత్త ఊపు.. మోండెలేజ్‌తో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన.!

తిరుపతి మరియు కొప్పర్తి వంటి ప్రాంతాలలో డిక్సన్ వంటి దిగ్గజ సంస్థల విస్తరణ వల్ల రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కానుంది. కేవలం అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా, కీలక విడిభాగాల తయారీ మరియు ఐటీ హార్డ్‌వేర్ యూనిట్లు కూడా రాష్ట్రానికి తరలివస్తే స్థానిక ఇంజనీరింగ్, సాంకేతిక నిపుణులకు సొంత గడ్డపైనే ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

ఈ పెట్టుబడుల ఒప్పందాలు త్వరలోనే కార్యరూపం దాల్చి ఉత్పత్తి ప్రారంభమవుతుందని పారిశ్రామిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద విశాఖ వేదికగా జరుగుతున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్రంలో పెట్టుబడుల ఆంచనాలను అందుకునే దిశగానే సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మీకు నచ్చవచ్చు:  ఏపీకి కియా భారీ పెట్టుబడులు.. పెనుకొండలో మరో ప్లాంట్.!

ఇన్వెస్టర్ల కార్పొరేట్ హోం ఏపీ: ఐసీసీ సదస్సు వేదికగా లోకేష్ ప్రకటన.!

[DixonTechnologies,  InvestmentAP, Nara Lokesh, Tirupati EMC2,  TeluguOne]

By
en-us Political News

  
విశాఖలో సినిమా, క్రియేటర్ ఎకానమీ అభివృద్ధికి సహకారం అందిస్తాం..!
మురసు తుపాను కారణంగా రాష్ట్రంలో  2,484.43 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల్లో వెల్లడైంది. రాష్ట్రంలోని 106 మండలాలు, 315 గ్రామాల పరిధిలో దాదాపు 1.93 లక్షల మంది ప్రజలు ఈ తుపాను ప్రభావానికి గురయ్యారని రాష్ట్ర అధికారులు పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి నివేదించారు.
విశాఖపట్నంలో వైభవంగా జరుగుతున్న సీఐఐ సదస్సు కేవలం పారిశ్రామిక ఒప్పందాలకే కాకుండా, ప్రముఖుల ఆసక్తికర సంభాషణలకు కూడా వేదికగా నిలిచింది.
భవిష్యత్తు ఏపీ ఎలా ఉండబోతోంది.. సీఎం చంద్రబాబుతో జర్నలిస్ట్ పాల్కి శర్మ ముఖాముఖి.!
తొలి రోజు  రాష్ట్రంలోకి ఏకంగా 5.84 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి.  మొత్తం 88కి పైగా కీలక ఒప్పందాలు    కుదిరాయి. ఇందులో భాగంగా 73 అవగాహన ఒప్పందాలు,  15 ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ భారీ పెట్టుబడులకు బాటలు పడ్డాయి. ఈ పారిశ్రామిక ప్రాజెక్ట్‌ల  1.07 లక్షల ప్రత్యక్ష,  పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
దేవాంశ్‌ డైనోసార్ల నేపథ్యంతో  డైనో డీట్స్ పేర ఒక పాడ్‌కాస్ట్,  యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ ఏడాది మేలో మొదలైన   ఈ పాడ్‌కాస్ట్ ఇప్పటివరకు పాతిక ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా ప్రతి ఎపిసోడ్ లక్షల సంఖ్యలో వ్యూస్ ను సంపాదించింది.
భూమా మౌనిక రెడ్డి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో భారీ పారిశ్రామిక యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.  36 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో  ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఆధ్వర్యంలో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీని నెలకొల్పి, క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించాలని కోరిన లోకేష్.. లక్నో,  డర్బన్ సూపర్ జెయింట్స్ వంటి ఫ్రాంచైజీల నిర్వహణ అనుభవం ఉన్న ఆర్‌పీఎస్‌జీ గ్రూప్..  రాష్ట్రంలోని గ్రామీణ స్థాయి ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) లో ఒక స్థానిక జట్టును కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
ప్రస్తుతం పూణేలో విజయవంతంగా అమలవుతున్న లిక్విడ్ రోబోటిక్స్  కో-ప్రొడక్షన్ నమూనాను నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె కేంద్రంగా పునరావృతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ నికుంజ్ పరాశర్ ను కోరారు.
2029 ఎన్నికలకు సమాయత్తమయ్యే క్రమంలో కీలకమైన రానున్న రెండేళ్లలో ఇప్పటి వరకూ గమనించిన పాలనా లోపాలను సరిదిద్దడమే కాకుండా, ఇటు ప్రభుత్వం, అటు పార్టీని మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు చంద్రబాబు నడుంబిగించారని అంటున్నారు.  
శ్రీసిటీలో రూ.1,800 కోట్లతో విస్తరిస్తున్న చాక్లెట్ ప్లాంట్.!
రూ.19 వేల కోట్లతో రెండో యూనిట్ ఏర్పాటు.. 12 వేల మందికి ఉద్యోగాలు.!
భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగ ఆలయ ప్రాంగణమంతా కమ్ముకోవడంతో భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. భారీ శబ్దంతో మంటలు చెలరేగడంతో పోటులో పనిచేస్తున్న కార్మికులు, ఆ సమయంలో అక్కడ ఉన్న భక్తులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.