శ్రీకాళహస్తి అన్నప్రసాదపోటులో అగ్నిప్రమాదం: భారీగా ఎగసిపడిన మంటలు: తప్పిన పెను ప్రమాదం.!

Publish Date:Nov 12, 2026

Advertisement

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయ ప్రాంగణంలోని   అన్నప్రసాద పోటు (వంటశాల)లో లడ్డూలు, ప్రసాదాలు తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రసాదాల తయారీ సమయంలో కాగుతున్న నెయ్యి ఒలికిపడటం,  గ్యాస్ లీకై సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. 

భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగ ఆలయ ప్రాంగణమంతా కమ్ముకోవడంతో భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. భారీ శబ్దంతో మంటలు చెలరేగడంతో పోటులో పనిచేస్తున్న కార్మికులు, ఆ సమయంలో అక్కడ ఉన్న భక్తులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

 అగ్నిమాపక సిబ్బంది  స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.  ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడం, ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

.ప్రమాద స్థలాన్ని ఆలయ ఈవో బి.కె. వెంకటేశులు తదితరులు   పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  బీజేపీ నేతలు ఈ విషయాన్ని మరిచినట్టున్నారే!!

[Fireaccident, Srikalahasti, Annaprasadapotu, HugeFire, TeluguOne]

By
en-us Political News

  
విశాఖపట్నం వేదికగా   జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో  దేశవిదేశాల నుంచి విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన లోకేష్ నవ్యాంధ్రలో పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం కల్పిస్తున్న   అవకాశాలను వివరించారు.
రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి మంత్రి నారా లోకేశ్ చూపుతున్న చొరవను, ఆయన చేస్తున్న విశేష కృషిని ఈ సందర్భంగా   పవన్ కల్యాణ్ ఈ  అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని దిగ్గజ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి, నవ్యాంధ్రను పారిశ్రామికంగా అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షించారు.
పెట్టుబడులు ప్రతిపాదనల దశ నుంచి వాస్తవ రూపం దాల్చే వరకు ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా వాటి గ్రౌండింగ్ ను వేగవంతం చేస్తున్నది. 
కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ప్రవహించనున్నాయన్న అంచనాలు ఉన్నాయి.
సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో భాగంగా విశాఖపట్నంలోని నోవోటెల్ హోటల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనే సరికి బెంబెలెత్తుతోంది.  దక్షిణ అండమాన్ సముద్రం  దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
గతంలో రాష్ట్రవ్యాప్తంగా మి  సంస్థలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో, వివిధ న్యాయస్థానాలలో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున ఈ 23 స్థానిక సంస్థలలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.
2019 ఎన్నికల్లో కోనసీమ ప్రాంతంలో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ , తాజా స్థానిక సమరంలో చతికిల పడింది.  కోనసీమ వ్యాప్తంగా అధికార  తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇందుకు వైసీపీ నేతలలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. 
ఇటీవల పులివెందుల మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన  ధర్నాకు సంబంధించి పోలీసులు జగన్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) శుభవార్త అందించింది.
ఏపీని పెట్టుబడులకు, పారిశ్రామికాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నెల 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026ను ప్రభుత్వం నిర్వహించనుంది.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అట్టడుగు వర్గాలకు అందుతున్న సేవలు, విద్యా, వైద్య రంగాలలో కల్పిస్తున్న సమాన అవకాశాల కారణంగానే ఏపీకి ఈ  ర్యాంక్ సాధ్యమైందని నిపుణులు, పరిశీలకులూ  విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న సంస్కరణల విధానం,  పాలనా దక్షత రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా నిలిచాయంటున్నారు.
హిట్ కొట్టాం అంటూ కేబినెట్ సమావేశంలో మంత్రుల నినాదాలు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.