ప్రభుత్వంతో మంచు మనోజ్ భార్య ఎంవోయూ: సీఐఐ వేదికగా సంతకాలు.!

Publish Date:Nov 13, 2026

Advertisement

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సీఐఐ  భాగస్వామ్య సదస్సులో టెక్ దిగ్గజాల భారీ పెట్టుబడుల మధ్య   ప్రముఖ నటుడు మంచు మనోజ్ సతీమణి భూమా మౌనిక రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. దేశీయ సంప్రదాయాలను, కళలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆమె నిర్వహిస్తున్న  నమస్తే వరల్డ్  స్టార్టప్  తరపున ఆమె ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.  

ఈ సదస్సులో భాగంగా భూమా మౌనిక రెడ్డి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో భారీ పారిశ్రామిక యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.  36 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో  ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చక్కటి హస్తకళల ఉత్పత్తులు,  సాంప్రదాయ ఆటవస్తువుల  తయారీని ఈ యూనిట్ ద్వారా మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలోని స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించడంతో పాటు, సాంప్రదాయ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశంగా ఆమె చెప్పారు.

ఈ    కార్యక్రమంలో మంచు మనోజ్   తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. సదస్సుకు విచ్చేసిన మంత్రులు మరియు పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా భూమా మౌనిక దంపతులను అభినందించారు. స్థానిక చేతివృత్తుల వారిని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని, ఈ తరహా స్టార్టప్‌లు యువ పారిశ్రామికవేత్తలకు ఎంతో స్ఫూర్తినిస్తాయని అన్నారు.

ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే కర్నూలు ప్రాంతంలో ప్రత్యక్షంగా,  పరోక్షంగా పలువురికి  ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ముఖ్యంగా స్థానిక కళాకారులు, చేనేత మరియు హస్తకళల నిపుణులకు మెరుగైన ఉపాధి దొరుకుతుంది.

ఇది కూడా చదవండి: ఏపీలో కోకో సాగుకు కొత్త ఊపు.. మోండెలేజ్‌తో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన.!

 దేశీయ విఫణిలో ఈ ఉత్పత్తులకు  డిమాండ్ పెరుగుతుందని పరిశీలకులు అంటున్నారు వేస్తున్నారు. ప్రభుత్వం కూడా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు  ఇస్తున్న ప్రోత్సాహం వల్ల ఇలాంటి వినూత్న స్టార్టప్‌లు ముందుకు రావడానికి మార్గం సుగమమైందంటున్నారు. 

రాజకీయంగా చూస్తే, నంద్యాల ప్రాంతంతో బలమైన నేపథ్యం ఉన్న భూమా కుటుంబం నుంచి మౌనిక  పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. ఆమె సోదరి భూమా అఖిలప్రియ ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండగా, భూమా మౌనిక   వ్యాపార రంగంలో సత్తా చాటుతున్నారు.  

మీకు నచ్చవచ్చు:  ఐసీసీ సదస్సు వేదికగా పవన్ తో లోకేష్ భేటీ: రాష్ట్ర పారిశ్రామిక పురోగతిపై చర్చ.!

ఏపీకి కియా భారీ పెట్టుబడులు.. పెనుకొండలో మరో ప్లాంట్.!


[Bhuma Mounika,  MoU, Vizag Summit,  Namaste World, Handicrafts, TeluguOne]

By
en-us Political News

  
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు హేమంత్ కు వైద్యులు అత్యవసర చికిత్స అందించి, కాలు తీసివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  హేమంత్ ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారడంతో..అతడిని మెరుగైన చికిత్సఅందించేందుకు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విశాఖలో సినిమా, క్రియేటర్ ఎకానమీ అభివృద్ధికి సహకారం అందిస్తాం..!
మురసు తుపాను కారణంగా రాష్ట్రంలో  2,484.43 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల్లో వెల్లడైంది. రాష్ట్రంలోని 106 మండలాలు, 315 గ్రామాల పరిధిలో దాదాపు 1.93 లక్షల మంది ప్రజలు ఈ తుపాను ప్రభావానికి గురయ్యారని రాష్ట్ర అధికారులు పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి నివేదించారు.
విశాఖపట్నంలో వైభవంగా జరుగుతున్న సీఐఐ సదస్సు కేవలం పారిశ్రామిక ఒప్పందాలకే కాకుండా, ప్రముఖుల ఆసక్తికర సంభాషణలకు కూడా వేదికగా నిలిచింది.
భవిష్యత్తు ఏపీ ఎలా ఉండబోతోంది.. సీఎం చంద్రబాబుతో జర్నలిస్ట్ పాల్కి శర్మ ముఖాముఖి.!
తొలి రోజు  రాష్ట్రంలోకి ఏకంగా 5.84 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి.  మొత్తం 88కి పైగా కీలక ఒప్పందాలు    కుదిరాయి. ఇందులో భాగంగా 73 అవగాహన ఒప్పందాలు,  15 ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ భారీ పెట్టుబడులకు బాటలు పడ్డాయి. ఈ పారిశ్రామిక ప్రాజెక్ట్‌ల  1.07 లక్షల ప్రత్యక్ష,  పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
దేవాంశ్‌ డైనోసార్ల నేపథ్యంతో  డైనో డీట్స్ పేర ఒక పాడ్‌కాస్ట్,  యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ ఏడాది మేలో మొదలైన   ఈ పాడ్‌కాస్ట్ ఇప్పటివరకు పాతిక ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా ప్రతి ఎపిసోడ్ లక్షల సంఖ్యలో వ్యూస్ ను సంపాదించింది.
ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఆధ్వర్యంలో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీని నెలకొల్పి, క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించాలని కోరిన లోకేష్.. లక్నో,  డర్బన్ సూపర్ జెయింట్స్ వంటి ఫ్రాంచైజీల నిర్వహణ అనుభవం ఉన్న ఆర్‌పీఎస్‌జీ గ్రూప్..  రాష్ట్రంలోని గ్రామీణ స్థాయి ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) లో ఒక స్థానిక జట్టును కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
డిక్సన్ టెక్నాలజీస్ రాష్ట్రంలో కొత్తగా  700 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది.   మంత్రి నారా లోకేష్‌తో ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఓఓ పంకజ్ శర్మ విశాఖలో  భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్   వేదికగా ఈ పెట్టుబడి పెట్టేందుకు పంకజ్ శర్మ సానుకూలత వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పూణేలో విజయవంతంగా అమలవుతున్న లిక్విడ్ రోబోటిక్స్  కో-ప్రొడక్షన్ నమూనాను నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె కేంద్రంగా పునరావృతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ నికుంజ్ పరాశర్ ను కోరారు.
2029 ఎన్నికలకు సమాయత్తమయ్యే క్రమంలో కీలకమైన రానున్న రెండేళ్లలో ఇప్పటి వరకూ గమనించిన పాలనా లోపాలను సరిదిద్దడమే కాకుండా, ఇటు ప్రభుత్వం, అటు పార్టీని మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు చంద్రబాబు నడుంబిగించారని అంటున్నారు.  
శ్రీసిటీలో రూ.1,800 కోట్లతో విస్తరిస్తున్న చాక్లెట్ ప్లాంట్.!
రూ.19 వేల కోట్లతో రెండో యూనిట్ ఏర్పాటు.. 12 వేల మందికి ఉద్యోగాలు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.