సీఐఐ సదస్సు: తొలి రోజు ఎంవోయూల విలువెంతో తెలుసా.?

Publish Date:Nov 13, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యానికి విశాఖ వేదికగా జరుగుతున్న   31వ సీఐఐ  భాగస్వామ్య సదస్సు చేరువ చేస్తున్నది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు తొలి రోజునే అంటే గురువారం (నవంబర్ 12) అద్భుత  ఫలితాలను సాధించింది. ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు పాల్గొన్న ఈ సదస్సులో   మొదటి రోజే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ప్రవహించాయి. పారిశ్రామిక, హరిత ఇంధన, ఆటోమొబైల్, ఇన్ ఫ్రాస్ట్రకచ్చర్  రంగాలలో భారీగా పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఎంవోయూలపై సంతరాలు చేశారు. 

ఈ సదస్సు తొలి రోజు  రాష్ట్రంలోకి ఏకంగా 5.84 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి.  మొత్తం 88కి పైగా కీలక ఒప్పందాలు    కుదిరాయి. ఇందులో భాగంగా 73 అవగాహన ఒప్పందాలు,  15 ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ భారీ పెట్టుబడులకు బాటలు పడ్డాయి. ఈ పారిశ్రామిక ప్రాజెక్ట్‌ల  1.07 లక్షల ప్రత్యక్ష,  పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,  ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తదితరులు ఈ సదస్సులో పాల్గొని పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వసతులు, పారదర్శక విధానాలను వివరించారు. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రతి పెట్టుబడిని గ్రౌండ్ అయ్యేలా చూస్తామని, ప్రభుత్వం  నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. దీంతో దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు  ముందుకు వచ్చారు.

ఈ భారీ పెట్టుబడులలో ప్రధానంగా తయారీ రంగం, విద్యుత్ వాహనాలు,  రసాయనాలు, పెట్రోకెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్,  డిఫెన్స్ రంగాలు పెద్ద ఎత్తున నిధులు ఆకర్షించాయి. కడప జిల్లా కొప్పర్తి, తిరుపతి,  విశాఖపట్నం కేంద్రంగా పలు ప్రముఖ కంపెనీలు తమ యూనిట్ల విస్తరణకు, కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయి. ముఖ్యంగా రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో వచ్చిన పెట్టుబడులు రాష్ట్ర హరిత ఇంధన లక్ష్యాలకు ఎంతో ఊతమిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  ప్రభుత్వంతో మంచు మనోజ్ భార్య ఎంవోయూ: సీఐఐ వేదికగా సంతకాలు.!

గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సులభతర వ్యాపార విధానాలు ,   వేగవంతమైన అనుమతుల ప్రక్రియే పెట్టుబడులు ఈ స్థాయిలో వెల్లవెత్తడానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తుండటం పట్ల సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులు సైతం హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌లు కార్యరూపం దాల్చితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని అంచనా వేస్తున్నారు.

మొదటి రోజు లభించిన ఈ అఖండ స్పందనతో  సదస్సు ముగిసేనాటికి ఈ పెట్టుబడుల ప్రవాహం మరింత పెరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల కంటే అధికంగానే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. ఈ అభివృద్ధి ద్వారా రాష్ట్రంలోని యువతకు స్థానికంగానే అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలు లభించి, రాష్ట్రం ఆర్థికంగా మరింత బలపడటానికి ఈ సదస్సు మైలురాయిగా నిలవనుంది.

మీకు నచ్చవచ్చు: అమరావతిలో స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ: శాశ్వత్ గోయెంకాకు మంత్రి లోకేష్ ప్రతిపాదన.!

ఏపీలో ల్యాప్‌టాప్, సర్వర్ తయారీ యూనిట్: లోకేష్ ప్రతిపాదనకు డిక్సన్ టెక్నాలజీ సానుకూల స్పందన.!

[CIISummit,  Visakhapatnam, MOUs, 1stday, CBN, Lokesh, Pawan, TeluguOne] 

By
en-us Political News

  
విశాఖలో సినిమా, క్రియేటర్ ఎకానమీ అభివృద్ధికి సహకారం అందిస్తాం..!
మురసు తుపాను కారణంగా రాష్ట్రంలో  2,484.43 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల్లో వెల్లడైంది. రాష్ట్రంలోని 106 మండలాలు, 315 గ్రామాల పరిధిలో దాదాపు 1.93 లక్షల మంది ప్రజలు ఈ తుపాను ప్రభావానికి గురయ్యారని రాష్ట్ర అధికారులు పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి నివేదించారు.
విశాఖపట్నంలో వైభవంగా జరుగుతున్న సీఐఐ సదస్సు కేవలం పారిశ్రామిక ఒప్పందాలకే కాకుండా, ప్రముఖుల ఆసక్తికర సంభాషణలకు కూడా వేదికగా నిలిచింది.
భవిష్యత్తు ఏపీ ఎలా ఉండబోతోంది.. సీఎం చంద్రబాబుతో జర్నలిస్ట్ పాల్కి శర్మ ముఖాముఖి.!
దేవాంశ్‌ డైనోసార్ల నేపథ్యంతో  డైనో డీట్స్ పేర ఒక పాడ్‌కాస్ట్,  యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ ఏడాది మేలో మొదలైన   ఈ పాడ్‌కాస్ట్ ఇప్పటివరకు పాతిక ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా ప్రతి ఎపిసోడ్ లక్షల సంఖ్యలో వ్యూస్ ను సంపాదించింది.
భూమా మౌనిక రెడ్డి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో భారీ పారిశ్రామిక యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.  36 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో  ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఆధ్వర్యంలో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీని నెలకొల్పి, క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించాలని కోరిన లోకేష్.. లక్నో,  డర్బన్ సూపర్ జెయింట్స్ వంటి ఫ్రాంచైజీల నిర్వహణ అనుభవం ఉన్న ఆర్‌పీఎస్‌జీ గ్రూప్..  రాష్ట్రంలోని గ్రామీణ స్థాయి ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) లో ఒక స్థానిక జట్టును కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
డిక్సన్ టెక్నాలజీస్ రాష్ట్రంలో కొత్తగా  700 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది.   మంత్రి నారా లోకేష్‌తో ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఓఓ పంకజ్ శర్మ విశాఖలో  భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్   వేదికగా ఈ పెట్టుబడి పెట్టేందుకు పంకజ్ శర్మ సానుకూలత వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పూణేలో విజయవంతంగా అమలవుతున్న లిక్విడ్ రోబోటిక్స్  కో-ప్రొడక్షన్ నమూనాను నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె కేంద్రంగా పునరావృతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ నికుంజ్ పరాశర్ ను కోరారు.
2029 ఎన్నికలకు సమాయత్తమయ్యే క్రమంలో కీలకమైన రానున్న రెండేళ్లలో ఇప్పటి వరకూ గమనించిన పాలనా లోపాలను సరిదిద్దడమే కాకుండా, ఇటు ప్రభుత్వం, అటు పార్టీని మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు చంద్రబాబు నడుంబిగించారని అంటున్నారు.  
శ్రీసిటీలో రూ.1,800 కోట్లతో విస్తరిస్తున్న చాక్లెట్ ప్లాంట్.!
రూ.19 వేల కోట్లతో రెండో యూనిట్ ఏర్పాటు.. 12 వేల మందికి ఉద్యోగాలు.!
భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగ ఆలయ ప్రాంగణమంతా కమ్ముకోవడంతో భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. భారీ శబ్దంతో మంటలు చెలరేగడంతో పోటులో పనిచేస్తున్న కార్మికులు, ఆ సమయంలో అక్కడ ఉన్న భక్తులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.