ఏపీ కేబినెట్ రీషఫుల్: ముమ్మర కసరత్తు చేస్తున్న సీబీఎన్.!

Publish Date:Nov 12, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు చంద్రబాబు రెడీ అవుతున్నారా? అంటే ప్రభుత్వ వర్గాల నుంచీ, పరిశీలకుల నుంచీ కూడా ఔనన్న సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో స్థానిక పోరు ముగింపునకు వచ్చిన తరుణంలో.. ఇక పాలన, పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను మరింత పకడ్బందీగా అమలు చేయడంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్గ ప్రక్షాళనపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

గత రెండేళ్లలో జరిగిన లోటు పాట్లను సమీక్షించుకుని మంత్రివర్గంలో మార్పులు చేర్పులూ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. తద్వారా  పాలనలో వేగం పెంచి ప్రజలకు మరింత చేరువ కావాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2029 ఎన్నికలకు సమాయత్తమయ్యే క్రమంలో కీలకమైన రానున్న రెండేళ్లలో ఇప్పటి వరకూ గమనించిన పాలనా లోపాలను సరిదిద్దడమే కాకుండా, ఇటు ప్రభుత్వం, అటు పార్టీని మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు చంద్రబాబు నడుంబిగించారని అంటున్నారు.  

ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండన్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో  మిగిలిన పాలనా కాలాన్ని మరింత సమర్ధంగా వినియోగించుకునే లక్ష్యంతో చంద్రబాబు కేబినెట్ మార్పులూ చేర్పులూ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అదీ కాక కేంద్రంలో మోడీ కూడా తన కేబినెట్ విస్తరణకు ముమ్మర కసరత్తు జరుపుతున్న నేపథ్యంలో, ఇటు రాష్ట్రంలో కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి  కేబినెట్ కూర్పులో మార్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

2024 ఎన్నికలలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొంతమందికి మంత్రి పదవులు దక్కాయి. ఆ సందర్భంగా కొందరు సీనియర్లకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు తొలి సారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై కేబినెట్ లో స్థానం దక్కించుకున్న వారిలో ఆశించిన స్థాయిలో పని తీరు కనబరచని కొందరికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి, కొత్త ముఖాలకు, మరీ ముఖ్యంగా సీనియర్లు, తొలి కేబినెట్ లో అవకాశం దక్కని వారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  అదే విధంగా జిల్లాల వారీగా పార్టీని పటిష్ఠం చేయగలిగిన సమర్ధులకు కేబినెట్ లో చోటు కల్పించాలన్న భావనతో సీఎం ఉన్నారని పార్టీ, ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.  

ఇది కూడా చదవండి:  చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళన? ఎందరు మంత్రులపై వేటంటే?

కొన్ని జిల్లాల్లో పార్టీ నాయకత్వ లోపాలు, ఆశించిన ఫలితాలు రాకపోవడం వంటి అంశాలు కేబినెట్ ప్రక్షాళనకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ,  ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన, బీజేపీ పార్టీల  కోటాలో కూడా కొన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బీసీ వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించేలా  చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. 

కేబినెట్ లో కొందరి శాఖలను మార్చడం, కొందరికి ఉద్వాసన పలకడం ద్వారా కొత్తగా కేబినెట్ లోకి ఎందరిని తీసుకుంటారు? ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారు అన్న చర్చ ఇప్పుడు పార్టీ, ప్రభుత్వ వర్గాలలో జోరుగా సాగుతోంది.  దీంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాలను ఇప్పటికే ఆరంభించినట్లు చెబుతున్నారు. కూటమి ఐక్యతను మరింత పెంచేలా, సామాజిక, ప్రాంతీయ సమతుల్యత ఉండేలా చంద్రబాబు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మీకు నచ్చవచ్చు: ఉగాది తరువాత ఏపీ కేబినెట్ విస్తరణ.?

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

[CBN, Cabinet, Reshuffle, NewFaces, Changes, Inclissions, TeluguOne]

By
en-us Political News

  
దేవాంశ్‌ డైనోసార్ల నేపథ్యంతో  డైనో డీట్స్ పేర ఒక పాడ్‌కాస్ట్,  యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ ఏడాది మేలో మొదలైన   ఈ పాడ్‌కాస్ట్ ఇప్పటివరకు పాతిక ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా ప్రతి ఎపిసోడ్ లక్షల సంఖ్యలో వ్యూస్ ను సంపాదించింది.
భూమా మౌనిక రెడ్డి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో భారీ పారిశ్రామిక యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.  36 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో  ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఆధ్వర్యంలో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీని నెలకొల్పి, క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించాలని కోరిన లోకేష్.. లక్నో,  డర్బన్ సూపర్ జెయింట్స్ వంటి ఫ్రాంచైజీల నిర్వహణ అనుభవం ఉన్న ఆర్‌పీఎస్‌జీ గ్రూప్..  రాష్ట్రంలోని గ్రామీణ స్థాయి ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) లో ఒక స్థానిక జట్టును కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
డిక్సన్ టెక్నాలజీస్ రాష్ట్రంలో కొత్తగా  700 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది.   మంత్రి నారా లోకేష్‌తో ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఓఓ పంకజ్ శర్మ విశాఖలో  భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్   వేదికగా ఈ పెట్టుబడి పెట్టేందుకు పంకజ్ శర్మ సానుకూలత వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పూణేలో విజయవంతంగా అమలవుతున్న లిక్విడ్ రోబోటిక్స్  కో-ప్రొడక్షన్ నమూనాను నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె కేంద్రంగా పునరావృతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ నికుంజ్ పరాశర్ ను కోరారు.
శ్రీసిటీలో రూ.1,800 కోట్లతో విస్తరిస్తున్న చాక్లెట్ ప్లాంట్.!
రూ.19 వేల కోట్లతో రెండో యూనిట్ ఏర్పాటు.. 12 వేల మందికి ఉద్యోగాలు.!
భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగ ఆలయ ప్రాంగణమంతా కమ్ముకోవడంతో భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. భారీ శబ్దంతో మంటలు చెలరేగడంతో పోటులో పనిచేస్తున్న కార్మికులు, ఆ సమయంలో అక్కడ ఉన్న భక్తులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
విశాఖపట్నం వేదికగా   జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో  దేశవిదేశాల నుంచి విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన లోకేష్ నవ్యాంధ్రలో పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం కల్పిస్తున్న   అవకాశాలను వివరించారు.
రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి మంత్రి నారా లోకేశ్ చూపుతున్న చొరవను, ఆయన చేస్తున్న విశేష కృషిని ఈ సందర్భంగా   పవన్ కల్యాణ్ ఈ  అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని దిగ్గజ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి, నవ్యాంధ్రను పారిశ్రామికంగా అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షించారు.
పెట్టుబడులు ప్రతిపాదనల దశ నుంచి వాస్తవ రూపం దాల్చే వరకు ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా వాటి గ్రౌండింగ్ ను వేగవంతం చేస్తున్నది. 
కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ప్రవహించనున్నాయన్న అంచనాలు ఉన్నాయి.
సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో భాగంగా విశాఖపట్నంలోని నోవోటెల్ హోటల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.