పౌరసత్వం రాకముందే ఓటు హక్కు పొందారా.. సోనియా గాంధీ కేసులో కొత్త ట్విస్ట్.!

Publish Date:Nov 6, 2026

Advertisement

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఓటరు జాబితాలో పేరు నమోదుకు సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో అదనపు ఆధారాలు, పత్రాలు సమర్పించేందుకు ఫిర్యాదుదారుడికి కోర్టు అనుమతి ఇచ్చింది. 

తదుపరి విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.వివరాల్లోకి వెళ్తే.. వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించారు. సోనియా గాంధీ 1983లో భారత పౌరసత్వం పొందారని, అయితే అంతకంటే ముందే అంటే 1980 నాటి న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటరు జాబితాలో ఆమె పేరు ఎలా నమోదైందని ఆయన తన పిటిషన్‌లో ప్రశ్నించారు.

పౌరసత్వం పొందకముందే ఓటరు జాబితాలో పేరు చేర్చడం ఎలా సాధ్యమైందనే అంశంపై విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. తప్పుడు పత్రాలు, నిబంధనలకు విరుద్ధంగా ఆమె పేరు నమోదైందని ఆరోపిస్తూ సమగ్ర దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు.అయితే ఈ ఆరోపణలను సోనియా గాంధీ తరఫు న్యాయవాదులు ఖండించారు. 

రాజకీయ ప్రేరేపిత ఆరోపణలతో న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని వాదించారు. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఊహాగానాల ఆధారంగా ఫిర్యాదు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఇరువర్గాల వాదనలు పరిశీలించిన న్యాయస్థానం.. ఈ కేసులో తమ వాదనలకు మద్దతుగా అదనపు ఆధారాలు, పత్రాలు సమర్పించేందుకు ఫిర్యాదుదారుడికి అనుమతించింది.

ఈ నేపథ్యంలో తదుపరి విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున ఫిర్యాదుదారుడు సమర్పించే ఆధారాలు, వాటిపై కోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.సోనియా గాంధీ పౌరసత్వం, ఓటరు జాబితాలో పేరు నమోదుకు సంబంధించిన అంశాలు మరోసారి జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.


- 1946, డిసెంబర్ 9: ఇటలీలోని లూసియానాలో సోనియా గాంధీ జన్మించారు. అప్పటి పేరు ఆంటోనియా మైనో.
- 1968, ఫిబ్రవరి 25: రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు.
- 1980: ఫిర్యాదుదారుడి ఆరోపణ ప్రకారం, న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గ ఓటరు జాబితాలో ఆమె పేరు నమోదైంది.
- 1982: ఓటరు జాబితా నుంచి ఆమె పేరు తొలగించబడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
- 1983, ఏప్రిల్ 30: భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 5(1)(c) ప్రకారం రిజిస్ట్రేషన్ ద్వారా భారత పౌరసత్వం పొందారు. 
  
ఈ కేసులో అసలు వివాదం ఏమిటి.?

భారత పౌరసత్వం పొందకముందే 1980 ఓటరు జాబితాలో పేరు ఎలా నమోదైందన్నదే ప్రధాన ప్రశ్న. ఆ నమోదు సమయంలో ఎలాంటి పత్రాలు సమర్పించారు? ఎన్నికల అధికారులు ఏ విధంగా పేరు చేర్చారు? అన్న అంశాలపై ఫిర్యాదుదారుడు విచారణ కోరుతున్నారు.

కీలకమైన న్యాయపరమైన అంశం: సెప్టెంబర్ 21, 2026న సెషన్స్ కోర్టు గతంలో మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసి, ఫిర్యాదును మరోసారి పరిశీలించాలని ఆదేశించింది. నవంబర్ 6న అదనపు పత్రాలు సమర్పించేందుకు అనుమతి లభించింది. అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలు నిరూపితమైన నేరంగా పరిగణించరాదు.

ఇది కూడా చదవండి :హైదరాబాద్‌లో కల్తీ పాల దందా గుట్టురట్టు.. పోలీసుల దాడిలో విస్తుపోయే నిజాలు.!

 

 

[ Sonia Gandhi Voter List Case, Sonia Gandhi Citizenship, Rouse Avenue Court, 1980 Voter List, Delhi Court News, TeluguOne News, Vikas Tripathi, PM MODI, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.