సోనియమ్మ దయతలిచెన్... అపాయంట్మెంట్ ఇచ్చెన్...

Publish Date:Dec 6, 2012

Advertisement

 

గత అనేక నెలలుగా తెలంగాణా యం.పీ.లు, నేతలు అమ్మ సోనియమ్మ దర్శనం కోసం ఎంత ప్రాదేయపడినా ఒప్పుకోనీ ఆమె, ఈ రోజు వారు ఆడిగిందే తడువు వారికి అపాయంట్మెంట్ ఇవ్వడమే గాక వారితో దాదాపు గంటసేపు మాట్లాడటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారు అంత పొంగిపోతారని ముందే తెలుసుంటే, ఆమె ఆపని ఎప్పుడో చేసిదేమో! అప్పుడప్పుడు ఇలాగే వారికి దర్శనం గ్రాంట్ చేస్తుంటే వారుకూడా తే.రా.సా. వైపు చూడడం మానుకోనేవారేమో పాపం. ఎవరేవిదంగా కమ్మలుకడితేనేమి, మొత్తం మీద కధ సుఖాంతమయింది అదే పదివేలు అని హుషారుగా బయటకి వచ్చేరు తెలంగాణా యం.పీ.లు.

 

సోనియమ్మ యఫ్.డి.ఐ., రాబర్ట్ వాద్రా గొడవల్లోపడి తమ తెలంగాణా సంగతి మరిచిపోయిఉండవచ్చుననే ఆలోచనతో వారు మళ్లీ ఆమెకు ‘తెలంగాణా ఇవ్వడం ఎంత అవసరమో, ఇవ్వకపోతే ఏ అనర్దాలు జరుగవచ్చో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ లాగ సవివరంగా గుర్తు చేసారు..ట! త్వరలో నిర్వహింపదలచిన అఖిల పార్టీ సమావేశం గురించి కూడా వారు చర్చినట్లు వార్త. ‘అఖిల పార్టీ సమావేశం’ ఈ సంవత్సరానికే ఒక గొప్ప పొలిటికల్ జోకు అని తే.రా.సా. నాయకులు, బి.జే.పి. నేతలు  జోకులు పేలుస్తున్నా ‘ఇది చారిత్రాత్మక సంఘటన’ అని తెలంగాణా యం.పీ.లు అని గర్వంగా చెప్పుకొస్తున్నారు. అయితే, “ఇది మాపార్టీని దెబ్బతీసేందుకే కాంగ్రేసు మొదలుబెట్టిన కొత్త నాటకం” అని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతూనే “దానిని ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు” అని తనకి తానూ దైర్యం చెప్పుకొంటూ, మనకూడా సవినయమగా తెలియజేసారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ హవా.!
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చాయి.
విశాఖ వేదికగా జరగనున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో అపారంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలకు బలంగా చాటిచెప్పాలన్నారు. విధాన రూపకర్తలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు,  స్టార్టప్స్  మధ్య బలమైన వారధిగా ఈ సదస్సు నిలవాలని చంద్రబాబు పేర్కొన్నారు.
మొత్తం 365 కౌంటింగ్‌ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని.. 19,885 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ నిఘాతో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీవోర్న్‌ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కాలంగా వెనుకబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా సంచలన విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.
రాప్తాడు బాలిక లక్ష్మి సాహసానికి గుర్తింపు.. చదువుకు అండగా ఆనంద్ మహీంద్రా.!
ఆచార్య ఎన్.జి. రంగా 127వ జయంతి సందర్భంగా జమీన్ రైతు పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌కు ఆచార్య ఎన్.జి. రంగా పురస్కారం ప్రదానం చేశారు.
ప్రస్తుతం అనంతపురంలో ఉన్న కియా తయారీ కేంద్రానికి ఏటా   3 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే, ఈ తాజా   పెట్టుబడి ద్వారా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత భారీగా పెంచాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా,  సజావుగా పూర్తి చేసేందుకు వీలుగా మూడు దశలలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు పేర్కొంది.  ఇందు కోసం దశలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నవంబర్ 13, రెండో విడత నోటిఫికేషన్ ను నవంబర్ 18న, ఒక  మూడో విడత నోటిఫికేషన్‌ను నవంబర్ 19వ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది. 
  4 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు  19 మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఉన్నాయి. గతంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. 
నష్టంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. కేంద్రానికి సమగ్ర నివేదిక.!
హరిత మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.