కోడలు గెలిచింది..కుమార్తె ఓడింది..బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు.!

Publish Date:Nov 8, 2026

Advertisement

విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ హవా.!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాలు విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడం.. కొందరు విజయం సాధించగా, మరికొందరు ఓటమి పాలవడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

గరివిడి జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన బొత్స సత్యనారాయణ కోడలు బొత్స పూజిత విజయం సాధించారు. ఆమెకు ప్రత్యర్థిగా చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు సంధ్య బరిలో నిలిచారు. ఇద్దరూ రాజకీయంగా ప్రముఖ కుటుంబాలకు చెందినవారు కావడంతో ఈ ఎన్నికపై మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. చివరకు ఈ పోరులో పూజిత తన సమీప ప్రత్యర్థి సంధ్యపై 1,599 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఇదే జిల్లాలోని గుర్ల జడ్పీటీసీ స్థానంలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, బొత్స సత్యనారాయణ సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి విజయం సాధించారు. దీంతో బొత్స కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళా అభ్యర్థులు జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందినట్లయింది.

అయితే, బొత్స కుటుంబానికి మరోవైపు ఎదురుదెబ్బ కూడా తగిలింది. బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి పాశల నీరజ విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఓటమి పాలయ్యారు. నీరజ.. అనూషపై 5,136 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రేసులో ఉన్న అనూష పరాజయం వైఎస్సార్‌సీపీ శ్రేణులకు నిరాశ కలిగించింది.

మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే.. స్థానిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరి సహస్ర తెర్లాం జడ్పీటీసీ స్థానం నుంచి విజయం సాధించారు. దీంతో బొత్స కుటుంబానికి చెందినవారి గెలుపోటములతో పాటు, కుటుంబానికి రాజకీయంగా దగ్గరి సంబంధాలున్న వారి విజయాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.

వాస్తవానికి ఈ ఎన్నికల్లో బొత్స కుటుంబం నుంచి నలుగురు జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయాలని ప్రయత్నించారు. పూసపాటిరేగ నుంచి బొత్స సోదరుడి కుమారుడు చైతన్య నామినేషన్ దాఖలు చేయగా, అది తిరస్కరణకు గురైంది. బొండపల్లి నుంచి కుమార్తె అనూష, గరివిడి నుంచి కోడలు పూజిత, గుర్ల నుంచి సోదరి వెంకటలక్ష్మి ఎన్నికల బరిలో నిలిచారు.

ఈ క్రమంలో గరివిడి, గుర్లలో విజయాలు.. బొండపల్లిలో ఓటమి.. మరోవైపు తెర్లాంలో మజ్జి శ్రీనివాసరావు కుమార్తె గెలుపు విజయనగరం జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు కారణమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్థుల ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారాయి.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు..ప్రత్యేక లేఖ రాసిన ప్రధాని మోదీ.!

 

 

[ Botsa Satyanarayana, Botsa Poojitha, Botsa Anusha, Sangamreddy Venkatalakshmi, Majji Srinivasa Rao, Siri Sahasra, Vizianagaram ZPTC Elections, Garividi ZPTC, Bondapalli ZPTC, Gurla ZPTC, TDP, YSRCP, AP Local Body Elections ]
 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చాయి.
విశాఖ వేదికగా జరగనున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో అపారంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలకు బలంగా చాటిచెప్పాలన్నారు. విధాన రూపకర్తలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు,  స్టార్టప్స్  మధ్య బలమైన వారధిగా ఈ సదస్సు నిలవాలని చంద్రబాబు పేర్కొన్నారు.
మొత్తం 365 కౌంటింగ్‌ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని.. 19,885 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ నిఘాతో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీవోర్న్‌ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కాలంగా వెనుకబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా సంచలన విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.
రాప్తాడు బాలిక లక్ష్మి సాహసానికి గుర్తింపు.. చదువుకు అండగా ఆనంద్ మహీంద్రా.!
ఆచార్య ఎన్.జి. రంగా 127వ జయంతి సందర్భంగా జమీన్ రైతు పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌కు ఆచార్య ఎన్.జి. రంగా పురస్కారం ప్రదానం చేశారు.
ప్రస్తుతం అనంతపురంలో ఉన్న కియా తయారీ కేంద్రానికి ఏటా   3 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే, ఈ తాజా   పెట్టుబడి ద్వారా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత భారీగా పెంచాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా,  సజావుగా పూర్తి చేసేందుకు వీలుగా మూడు దశలలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు పేర్కొంది.  ఇందు కోసం దశలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నవంబర్ 13, రెండో విడత నోటిఫికేషన్ ను నవంబర్ 18న, ఒక  మూడో విడత నోటిఫికేషన్‌ను నవంబర్ 19వ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది. 
  4 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు  19 మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఉన్నాయి. గతంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. 
నష్టంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. కేంద్రానికి సమగ్ర నివేదిక.!
హరిత మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.!
రాప్తాడు  ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది.
జగన్ హయాంలో చెవిరెడ్డి నుంచుంటే మాస్, కూర్చుంటే మాస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏకపక్ష అరాచకాలు, బెదిరింపు రాజకీయాలతో చెలరేగిపోయేవారు. అటువంటి   చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి.. పరిషత్ పోలింగ్ వేళ చుక్కలు చూపించారు పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.