విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు: పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యం.!

Publish Date:Nov 7, 2026

Advertisement

అంతర్జాతీయ పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్ మరోసారి   వేదికగా కానుంది. పారిశ్రామిక రంగానికి కొత్త దిశను నిర్దేశించే  ప్రతిష్టాత్మకమైన 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్  నవంబర్ 12, 13 తేదీల్లో వైజాగ్ లో   నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది.  నావిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్ అనే    థీమ్తో  ఈ సారి సదస్సు  సాగనుంది. ప్రపంచ దేశాలను వేధిస్తున్న ఆర్థిక, వాణిజ్య సవాళ్లకు తగిన పరిష్కారాలను కనుగొంటూ, సరికొత్త సాంకేతికత, విశ్వాసం ఆధారంగా పారిశ్రామిక ప్రగతిని సాధించడమే లక్ష్యంగా ఈ సదస్సు జరగనుంది. 

ఈ సదస్సు ఏర్పాట్లు నిర్వహణపైఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో పాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులు, ఉన్నతాధికారులతో  సమీక్షా సమావేశం  నిర్వహించారు. సదస్సులో చర్చించాల్సిన ముఖ్యమైన అంశాలు, ప్రకటించబోయే డిక్లరేషన్లు,  విదేశీ ప్రతినిధుల రాకపై సీఎం అధికారులకు   దిశానిర్దేశం చేశారు. విశాఖ వేదికగా జరగనున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో అపారంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలకు బలంగా చాటిచెప్పాలన్నారు. విధాన రూపకర్తలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు,  స్టార్టప్స్  మధ్య బలమైన వారధిగా ఈ సదస్సు నిలవాలని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ   సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 59 దేశాల నుంచి   ప్రతినిథులు రానున్నారు. వివిధ దేశాలకు చెందిన  15 మంది  మంత్రులు, పలువురు రాయబారులు,  ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, ఆసియా అభివృద్ధి బ్యాంకు , ప్రపంచ ఆహార కార్యక్రమం వంటి అంతర్జాతీయ సంస్థల ప్రముఖులు ఈ వేదికపైకి రానున్నారు. సింగపూర్, నేపాల్, కంబోడియా, మయన్మార్, యూఏఈ, కెనడా, స్లోవాక్ రిపబ్లిక్, మారిషస్, మొజాంబిక్, ఈజిప్ట్, అల్జీరియా, టాంజానియా, గ్వాటెమాలా తదితర దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకానున్నారు. మొత్తంగా 350 మంది విదేశీ ప్రతినిధులు, 900 మంది  భారత  పారిశ్రామిక వేత్తలు, 40 మందికి పైగా గ్లోబల్ వక్తలు, ఇలా మొత్తంగగా  1,250 మంది ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటారు.

ఈ రెండు రోజుల సదస్సులో వాణిజ్యం నుంచి క్వాంటం టెక్నాలజీ వరకు   ప్రాధాన్యత కలిగిన ఆరు ప్రధాన రంగాలపై  చర్చలు జరుగుతాయి.     వాణిజ్యం,  పెట్టుబడులు,  గ్లోబల్ వాల్యూ చైన్స్, రెండవది ట్రస్ట్, జియో ఎకనామిక్స్, గ్లోబల్ కోఆపరేషన్, అలాగే  వ్యవసాయం, ఆహార భద్రత, జీవ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, ఇంకా  ప్రతిభ, నైపుణ్యాలు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు, అలాగే,  సాంకేతికత, ఆవిష్కరణలు, భవిష్యత్ పరిశ్రమలు,  స్వచ్ఛ ఇంధనం, సుస్థిర వృద్ధి అనే అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను ఈ సదస్సు వేదికగా పంచుకుంటారు. ముఖ్యంగా వ్యాపార సంస్థల మధ్య భాగస్వామ్యాలను వేగవంతం చేసేందుకు సుమారు 400 బీ టూ బీసమావేశాలు, అలాగే ప్రభుత్వాలతో పరిశ్రమల సంప్రదింపుల కోసం ప్రత్యేకంగా బీ టూ జీ   సమావేశాలు నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి:  పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 2.!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ, అధునాతన సాంకేతికత, సెమీకండక్టర్లు,  తయారీ రంగాల్లో ఉన్న అద్భుతమైన అవకాశాలను ఈ సదస్సు ద్వారా అంతర్జాతీయ వేదికపై విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక రాయితీలను ఎస్క్రో అకౌంట్ ద్వారా పారదర్శకంగా చెల్లించే విధానం, అలాగే  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి విప్లవాత్మక సంస్కరణలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా ఈ సదస్సును వేదికగా మలచనున్నారు. అత్యుత్తమ పాలసీలు, సుశిక్షితులైన మానవ వనరులు, పటిష్టమైన మౌలిక వసతులు,  బలమైన నాయకత్వం ఏపీ సొంతమని నిరూపించేందుకు ఇది సువర్ణావకాశమని భావిస్తున్నారు.

ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్లతో అనుసంధానం కల్పించడం, స్థానిక యువత నైపుణ్యాలకు తగిన అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను సృష్టించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. పారిశ్రామిక వేత్తలకు ఏపీలో పెట్టుబడులు పూర్తిగా సురక్షితం,  సులభతరం అనే నమ్మకాన్ని కలిగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సదస్సు విజయవంతం కావడం ద్వారా రాష్ట్రంలో సరికొత్త పారిశ్రామిక శకం ప్రారంభం కావడంతో పాటు, లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని ఆర్థిక నిపుణులు, పారిశ్రామిక వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి.

మీకు నచ్చవచ్చు: ఏపీలో కియా విస్తరణ: 14 వేల 167 కోట్ల పెట్టుబడి: విశాఖ ఇన్వెస్టర్ల సదస్సులో ఎంవోయూ.!

రామాయంపట్నం రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఏపీ పారిశ్రామిక ప్రగతిలో మైలురాయి.!

[CII Partnership Summit Visakhapatna, AP Industrial Investments, Chandrababu Naidu Review, Vizag Business Summit, TeluguOne]

By
en-us Political News

  
మొత్తం 365 కౌంటింగ్‌ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని.. 19,885 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ నిఘాతో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీవోర్న్‌ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కాలంగా వెనుకబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా సంచలన విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.
రాప్తాడు బాలిక లక్ష్మి సాహసానికి గుర్తింపు.. చదువుకు అండగా ఆనంద్ మహీంద్రా.!
ఆచార్య ఎన్.జి. రంగా 127వ జయంతి సందర్భంగా జమీన్ రైతు పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌కు ఆచార్య ఎన్.జి. రంగా పురస్కారం ప్రదానం చేశారు.
ప్రస్తుతం అనంతపురంలో ఉన్న కియా తయారీ కేంద్రానికి ఏటా   3 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే, ఈ తాజా   పెట్టుబడి ద్వారా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత భారీగా పెంచాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా,  సజావుగా పూర్తి చేసేందుకు వీలుగా మూడు దశలలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు పేర్కొంది.  ఇందు కోసం దశలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నవంబర్ 13, రెండో విడత నోటిఫికేషన్ ను నవంబర్ 18న, ఒక  మూడో విడత నోటిఫికేషన్‌ను నవంబర్ 19వ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది. 
  4 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు  19 మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఉన్నాయి. గతంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. 
నష్టంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. కేంద్రానికి సమగ్ర నివేదిక.!
హరిత మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.!
రాప్తాడు  ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది.
జగన్ హయాంలో చెవిరెడ్డి నుంచుంటే మాస్, కూర్చుంటే మాస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏకపక్ష అరాచకాలు, బెదిరింపు రాజకీయాలతో చెలరేగిపోయేవారు. అటువంటి   చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి.. పరిషత్ పోలింగ్ వేళ చుక్కలు చూపించారు పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు,  విచారణను ఆంధ్రప్రదేశ్ పరిధి నుంచి ఇతర రాష్ట్రాలకు మార్చాలన్న ఆ పిటిషన్ ను  విచారణ చేపట్టిన  సీజేఐ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు  విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం కుండబద్దలు కొడుతూ, .  పిటిషన్‌ను కొట్టివేసింది.
కీలకమైన జడ్పీటీసీ స్థానాల్లో  వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వీరు అనూహ్యంగా చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగడం వైసీపీకి తేరుకోలేని ఎదురుదెబ్బగా పరిణమించింది.  కడప జిల్లా మైదుకూరు,  అన్నమయ్య జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి వైకాపా అభ్యర్థులు రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.