అక్కడ ఇల్లు దొరకటం చాలా కష్టం: 60 వేల అద్దె.. లక్షల్లో డిపాజిట్.. అయినా.?

Publish Date:Sep 22, 2026

Advertisement

దేశ ఆర్థిక రాజధానులలో ఒకటిగా, ఐటీ హబ్‌గా పేరుగాంచిన సిలికాన్ వ్యాలీలో ఇళ్ల అద్దెలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నగరంలో నివాసం ఉండాలంటే కేవలం ఉద్యోగం ఉంటే సరిపోదు, భారీగా సంపాదిస్తేనే ఇల్లు దొరికే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో రెంట్స్ విపరీతంగా పెరిగిపోయి ఆకాశాన్ని తాకుతున్నాయి.

తాజాగా బెంగళూరులో ఇళ్ల వేటలో ఎదురైన చేదు అనుభవాలను ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. గత కొన్ని సంవత్సరాలుగా నగరంలోనే ఉంటున్నప్పటికీ, సరైన ఇల్లు వెతకడం ఎంత కష్టతరంగా మారిందో ఆమె తన వీడియో ద్వారా వివరించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం డిజిటల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మూడు వారాలుగా నగరంలోని పలు ప్రాంతాలు తిరుగుతున్నప్పటికీ ఒక్క మంచి ఇల్లు కూడా కుదర్లేదని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ఉండటం వల్ల నిర్దిష్ట ప్రాంతమనే పరిమితి లేకుండా ఎక్కడికైనా వెళ్లాలని చూస్తున్నా, ఏరియా మారినా అద్దె ధరల్లో ఎలాంటి తేడా లేదని వాపోయారు. బ్రోకర్ల సహాయం తీసుకున్నప్పటికీ భారీ ధరల కారణంగా ఇల్లు అద్దెకు తీసుకోవడం పెద్ద సవాలుగా మారిందని తెలిపారు.

నగరంలో ప్రస్తుతం రెండు బెడ్‌రూమ్‌ల (2బీహెచ్‌కే) అద్దె ఏకంగా రూ. 60,000 వరకు పలుకుతుండటం గమనార్హం. దీనికి అదనంగా ప్రతి నెలా రూ. 5,000 నుంచి రూ. 7,000 వరకు మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి కాకుండా సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో యజమానులు ఏకంగా రూ. 3 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు డిమాండ్ చేస్తుండటంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

భారీ డిపాజిట్లు, విపరీతమైన అద్దెలపై ఎలాంటి ప్రశ్నించకుండా ప్రజలు అడిగినంత ఇస్తున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాచిలర్లతో పోలిస్తే కుటుంబాలతో జీవించే వారే ఈ అధిక ధరల భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇళ్ల వేట పుణ్యమా అని ఇంతకాలం తనకు తెలియని బెంగళూరులోని మారుమూల గల్లీలు, ప్రతి ప్రాంతం పరిచయమయ్యాయని ఆమె చమత్కరించారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. బెంగళూరులో ఇల్లు వెతకడం అనేది ఒక ఫుల్ టైమ్ జాబ్ లాంటిదని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు నగరంలో రెంట్స్ పూర్తిగా అదుపుతప్పుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల రాకతో పెరిగిన డిమాండ్‌ను యజమానులు క్యాష్ చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భవిష్యత్తులో ఐటీ కారిడార్లు మరింత విస్తరిస్తే ఇళ్ల డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అద్దెల నియంత్రణకు ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు ఎలాంటి మార్గదర్శకాలు తీసుకురాకపోతే మధ్యతరగతి ప్రజలు నగరంలో జీవించడం మరింత భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

 

 

[ Silicon Valley rental prices, Bengaluru house rents, Bangalore 2BHK rent deposit, Bengaluru house hunting struggle,Silicon Valley rental prices, TeluguOne News, Bengaluru updates, Telugu News  ]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.