14 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు..భార్యతో విడాకులు ప్రకటించిన మంత్రి ఆధవ్‌ అర్జున.!

Publish Date:Nov 16, 2026

Advertisement

తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కేబినెట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ ప్రముఖ మంత్రి వ్యక్తిగత జీవితంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న తన వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.   

తమిళనాడు ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్  క్రీడాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆధవ్ అర్జున, ఆయన సతీమణి డైసీ మార్టిన్ తమ వివాహ బంధానికి అధికారికంగా ముగింపు పలికారు. లాటరీ వ్యాపార దిగ్గజంగా పేరుగాంచిన శాంటియాగో మార్టిన్ కుమార్తె అయిన డైసీ మార్టిన్ సోమవారం ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.   

దాదాపు 14 సంవత్సరాల పాటు సాగిన తమ వైవాహిక జీవితం నుంచి విడిపోవాలని తామిద్దరం పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇన్నేళ్ల ప్రయాణంలో స్నేహితులుగా, జీవిత భాగస్వాములుగా, తల్లిదండ్రులుగా ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచుకున్నామని తెలిపారు. తమ జీవితంలో ఎదురైన ఆటుపోట్లను, మలుపులను ప్రేమతో, అవగాహనతో ఎదుర్కొన్నామని పేర్కొన్నారు.   

భార్యాభర్తలుగా వేర్వేరు దారుల్లో పయనిస్తున్నప్పటికీ, తమ సంతానం పట్ల ఉన్న బాధ్యతను మాత్రం సంయుక్తంగా నిర్వర్తిస్తామని వారు స్పష్టం చేశారు. పిల్లల సంతోషం, వారి భవిష్యత్తు, బాగోగులే తమకు ఎప్పటికీ మొదటి ప్రాధాన్యమని డైసీ మార్టిన్ తన ప్రకటనలో పునరుద్ఘాటించారు.   

ఆధవ్ అర్జున రాజకీయ ప్రయాణంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఎదుగుదల కోసం తాను ఎప్పుడూ ఆకాంక్షిస్తానని ఆమె పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తులో మరింత ప్రశాంతంగా, విజయవంతంగా ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించి, ఈ మార్పు సమయంలో మీడియా ప్రతినిధులు, నెటిజన్లు తమ గోప్యతకు భంగం కలిగించవద్దని వారు విజ్ఞప్తి చేశారు.   

ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజా జీవితంలో బిజీగా ఉంటూనే, వ్యక్తిగత నిర్ణయాలను ఇరువర్గాలు పక్వతతో తీసుకున్న తీరుపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ప్రముఖ రాజకీయ నేత కుటుంబంలో చోటుచేసుకున్న ఈ పరిణామం అందరినీ విస్మయానికి గురిచేసింది. 

ఇది కూడా చదవండి: భారత రక్షణ రంగానికి సరికొత్త డ్రోన్‌ ముప్పు: టర్కీతో పాకిస్థాన్‌ భారీ ఒప్పందం.!

వీసీకే పార్టీకి చెందిన ఆధవ్ అర్జున ఆ తరువాత  విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరారు.  ఆధవ్ అర్జున.. అధికార టీవీకేలో నంబర్ 2 గా వ్యవహరిస్తోన్నారు. విజయ్ కు కుడిభుజంగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ ఏడాది మే లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విల్లివాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.14 సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చిన వీరి వైవాహిక బంధానికి తెరపడినట్టయింది.

దీనిపై డైసీ మార్టిన తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం తమ జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని వ్యాఖ్యానించారు. తాము విడిపోయినప్పటికీ.. ఒకరిపట్ల ఒకరికి ఎప్పటికీ గౌరవం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. 14 సంవత్సరాలుగా స్నేహితులుగా, జీవిత భాగస్వామ్యులుగా, తల్లిదండ్రులుగా కలిసి సాగించిన ప్రయాణంలో ఎంతో ప్రేమ, అవగాహన, ఎత్తుపల్లాలను చూశామని ఆమె పేర్కొన్నారు.

వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ఆధవ్ అర్జున్ పట్ల తనకు ఎప్పటికీ గౌరవం తగ్గదని, అది చిరస్మరణీయంగా నిలిచి పోతుందని డైసీ అన్నారు. ఆయన ఎంచుకునే ప్రతి మార్గంలోనూ సంతోషం, మనశ్శాంతి, విజయం లభించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని అన్నారు. ఈ సమయంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని, కుటుంబానికి అవసరమైన ప్రైవసీని ఇవ్వాలని, అభిమానులు, మీడియా సంయమనంతో వ్యవహరించాలని ఆమె కోరారు.


మీకు నచ్చవచ్చు: కోట్ల విలువైన నగలు కొట్టేశాడు..ఒక్క టాటూతో అడ్డంగా దొరికాడు.!

మీకు నచ్చవచ్చు: హైదరాబాద్‌లో బిర్యానీ ప్రియులకు షాక్..భారీగా పెరిగిన ధరలు.!

 

 

[ Aadhav Arjuna divorce, Daisy Martin husband, Tamil Nadu minister personal life, TVK party leaders news, Santiago Martin daughter ]


 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.