హైదరాబాద్ టు అమరావతి: బాబు విజన్, దక్షత.. శేఖర్ గుప్తా వాక్ ది టాక్ ఇంటర్వ్యూ.!

Publish Date:Nov 11, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ను, ఆయన పాలనా దక్షతను ప్రత్యర్థులు కూడా ప్రశంసిస్తారు. రాజకీయ వైరంతో విమర్శలు గుప్పించినా, ఆ దార్శనికుడిని  మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఆ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు వచ్చిన, వస్తున్న గుర్తింపు, పెరిగిన, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారు సదా చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు.  

ఆ విషయాన్ని  సీనియర్ జర్నలిస్టు శేఖర్ గుప్తా  తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో  నిర్వహించిన వాక్ ది టాక్ ఇంటర్వ్యూలో  మరో సారి రుజువైంది.  దాదాపు 23 ఏళ్ల కిందట శేఖర్ గుప్తా  వాక్ ది టాక్ కార్యక్రమంలో చంద్రబాబును ఇంటర్వ్యూ చేశారు.  . అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్ లో  ఆ ఇంటర్వ్యూ జరిగింది. రెండు దశాబ్దాలు దాటి మూడేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే శేఖర్ గుప్తా, చంద్రబాబును ఇప్పుడు అమరావతి వేదికగా మళ్లీ ఇంటర్వ్యూ చేశారు.  ప్లేస్ మారింది. చంద్రబాబు విజన్ మారలేదు. అప్పుడుఉమ్మడి ఆంధ్రప్రదేశ్  అభివృద్ధి పట్ల చంద్రబాబు నాయుడుకున్న   దృక్పథం, భవిష్యత్ ప్రణాళికలు, ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్  అభివృద్ధి విషయంలో ఆయన చూపుతున్న శ్రద్ధ, రచిస్తున్న ప్రణాళికలు ఆయన విజన్ మరింత పదును తేలిందని ఈ ఇంటర్వ్యూ నిర్ద్వంద్వంగా రుజువు చేసింది.  

అమరావతి  నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలు, ప్రధాన రహదారుల వెంబడి నడుస్తూ శేఖర్ గుప్తా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునుఇంటర్వ్యే చేశారు. ఈ సందర్భంగా  చంద్రబాబు   రాజధాని నిర్మాణంపై తనకున్న స్పష్టమైన విజన్‌ను  పంచుకున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడానికి తాను వేసిన పునాదులను గుర్తు చేసుకుంటూనే, ఇప్పుడు అమరావతిని అంతకుమించిన ఆధునిక, భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దేందుకు  చేస్తున్న ప్రయత్నాలను విపులంగా విశదీకరించారు.  

ఈ ఇంటర్వ్యూలో బాబు విజన్, దార్శనికత, ప్రగతి, పురోగతి, ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం పట్ల 23 ఏళ్ల కిందటి ఆలోచనల కొనసాగింపు.. తనను తాను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అప్ డేట్ చేసుకున్న తీరు స్పష్టంగా తేటతెల్లమైంది.  సరిగ్గా ఇరవై మూడు ఏళ్ల కిందట, అంటే  2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇదే జర్నలిస్టు శేఖర్ గుప్తాతో వాక్ ది టాక్  నిర్వహించారు. ఆ సమయంలో హైదరాబాద్ నగరాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చంద్రబాబు తన ప్రణాళికలను వివరించారు. ఇప్పుడు మళ్లీ అదే శేఖర్ గుప్తాకు వాక్ ది టాక్ అంటూ అమరావతి వీధుల్లో నడుస్తూ మరో ఇంటర్వ్యూ ఇచ్చారు.  జగన్  హయాంలో రాజధాని అమరావతి నిర్మాణానికి ఎదురైన అడ్డంకులు, ఇప్పుడు తన హయాంలో ఆ అడ్డంకులన్నిటినీ అధిగమించి గాడిన పెడుతున్న తీరును, రాజధాని అమరావతి నిర్మాణ పనుల వేగం వంటి అంశాలను చంద్రబాబు వివరించారు.  

ఇది కూడా చదవండి: రాజకీయం అంటే తొడలు చరిచి సవాళ్లు విసరడం కాదు.. చంద్రబాబు.!

ఒక నగరం, ఒక రాజధాని అంటే కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టే భవనాలు మాత్రమే కాదని చంద్రబాబు విస్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిని ఒక సంపద సృష్టి కేంద్రంగా మార్చాలనే తన లక్ష్యాన్ని చంద్రబాబు   వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమల స్థాపన తదితర అంశాలపై తన విజన్ వివరించారు.  ఇరవై మూడు సంవత్సరాల కిందట  చార్మినార్ వద్ద శేఖర్ గుప్తా చంద్రబాబుతో జరిపిన ముఖాముఖీ ఇంటర్వ్యూ అప్పట్లో దేశవ్యాప్తంగా  చర్చనీయాంశమైంది. ఆ తర్వాత హైదరాబాద్ సాధించిన అద్భుతమైన ప్రగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ 23 ఏళ్ల తరువాత  అమరావతిలో  చంద్రబాబుతో శేఖర్ గుప్తా జరిపిన సంభాషణపై ఈ సారి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా  ఆసక్తి వ్యక్తమౌతోంది.

 నాడు హైదరాబాద్ విషయంలో చంద్రబాబు చెప్పిన మాటలు ఏ విధంగా నిజమయ్యాయో, ఇప్పుడు అమరావతి విషయంలో కూడా అలాగే జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చంద్రబాబులోని ఉత్సాహం, పనితీరులో వేగం ఇరవై మూడేళ్ల కిందటితో పోలిస్తే మరింత ఇనుమడించాయని అంటున్నారు.  ఇంకా ఈ ఇంటర్వ్యూ పూర్తి పాఠం ప్రాసారం కానప్పటికీ ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోలు బయటకు వచ్చాయి. వాటి ద్వారా అమరావతి అభివృద్ధి, ఆధునిక నగర నిర్మాణం ఇందుకోసం చంద్రబాబు ప్రణాళికలు, భవిష్యత్ నగరంగా అమరావతి ఠీవీగా, రాష్ట్ర ప్రతిష్ఠనే కాకుండా దేశ ప్రతిష్టను సైతం పెంచుతుందని విస్పష్టంగా తేటతెల్లమైందని మేధావులు అంటున్నారు.   చార్మినార్ నుంచి ప్రారంభమైన ఈ అభివృద్ధి ప్రస్థానం, నేడు అమరావతి వీధుల గుండా  కొత్త చరిత్ర సృష్టించేలా సాగుతోందని అవగతమౌతోంది. వేదికలు మారినా, కాలం గడిచినా, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం మరింత ధృఢతరంగా మారిందని ఈ ఇంటర్వ్యూ రుజువు చేసేలా ఉందనడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.   

మీకు నచ్చవచ్చు: ది లీడర్.. ది లెజండరీ, ది స్టేట్స్ మన్.. ఒకే ఒక్కడు నారా చంద్రబాబు

1995 సెప్టెంబర్ 1 నుంచి చంద్రబాబు ప్రస్థానం... నిజంగా ఒక అద్భుతం.!

[Shekhar Gupta,   Nara Chandrababu Naidu,  Walk The Talk, Amaravati Vision, TeluguOne] 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.