విడిపోవడం ఎలాగో పాపం స్కాట్లాండ్ వాళ్ళకి తెలీదు...

Publish Date:Sep 20, 2014

Advertisement

 

బ్రిటన్‌లో అంతర్భాగంగా వున్న స్కాట్లాండ్ దేశంలో కొంతమంది వేర్పాటు వాదులు పుట్టుకొచ్చారు. మూడు వందల సంవత్సరాలుగా అంతర్భాగంగా వున్న బ్రిటన్లోంచి స్కాట్లాండ్‌ని విడదీయాల్సిందేనని ఉద్యమం లేవదీశారు. గత కొన్ని సంవత్సరాలుగా తెల్లారిందంటే చాలు.. కొంతమంది ఓ చోట గుంపుగా చేరడం.. ప్లకార్డులు పట్టుకోవడం.. స్కాట్లాండ్‌ని విడదీయాలని నినాదాలు చేయడం! వీరి బాధ చూసిన బ్రిటన్ మొన్న 28వ తేదీన స్కాట్లాండ్ వ్యాప్తంగా రెఫరండం నిర్వహించింది. బ్రిటన్‌తో కలసి వుంటారా వద్దా అనే పాయింట్ మీద ఎస్ ఆర్ నో చెప్పేయండని అడిగింది. అత్యంత ఉత్కంఠ భరితంగా నిర్వహించిన రెఫరెండంలో స్కాట్లాండ్ వాసులలో మెజారిటీ జనం బ్రిటన్లోనే కలసి వుండాలని నిర్ణయించడంతో ఈ ఇష్యూకి తెరపడింది. స్కాట్లాండ్ వేర్పాటువాద ఉద్యమం ముగిసింది.

 

అయినా స్కాట్లాండ్ వేర్పాటువాదుల అమాయకత్వం కాకపోతే, తెలివైన వాళ్ళు ఎవరైనా శాంతియుతంగా విభజన ఉద్యమం చేస్తారా? విడిపోవాలంటే ఏం చేయాలి? బ్రిటన్ వాళ్ళని నోటికొచ్చినట్టు తిట్టిపోయాలి. స్కాట్లాండ్‌ని విభజించకపోతే మారణహోమం సృష్టిస్తామని, భూకంపం తెస్తామని బెదిరించాలి. స్కాట్లాండ్‌లో వున్న బ్రిటన్ వాళ్ళు భయభ్రాంతులు అయ్యేలా చేయాలి. స్కాట్లాండ్‌ని విభజిస్తే మీకు ఫలానా ఫలానా ఉపయోగాలుంటాయని స్థానికంగా వున్న జనాన్ని ప్రలోభపెట్టాలి. బ్రిటన్ వాళ్ళు మనని దోచేస్తున్నారని స్కాట్లాండ్ ప్రజల మనసులలో విషం నూరిపోయాలి. బోలెడన్ని ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులని రెచ్చగొట్టాలి. జనం మధ్య విద్వేషాలు పెంచాలి. అధికారంలో వున్నవాళ్ళకి చాక్లెట్లు వేయాలి. నోటికొచ్చిన అబద్ధాలు చెప్పాలి. విషాన్ని పంచే సొంత మీడియాని సిద్ధం చేసుకోవాలి. ఇలాంటి రెఫరెండంలు కాకుండా ఎలాంటి అభిప్రాయ సేకరణ, తోటకూర కట్టా లేకుండా దౌర్జన్యంగా, దుర్మార్గంగా, అన్యాయంగా విభజించే మార్గాలని అన్వేషించి, వాటిని అమలులో పెట్టాలి. అవసరమైతే స్థానిక అసెంబ్లీలలో ఎమ్మెల్యేలని, పార్లమెంటులో ఎంపీలని చావగొట్టాలి... ఇలాంటివి చేస్తే విడిపోవడం వీలవుతుందిగానీ, ఇప్పటిలా శాంతియుత ప్రదర్శనలు, రెఫరెండంలు చేస్తే స్కాట్లాండ్ బ్రిటన్ నుంచి ఎప్పటికీ విడిపోదు. అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు... విభజన ఉద్యమం ఎలా చేయాలో ఇండియాలోని కొంతమంది రాజకీయ నాయకులను చూసి నేర్చుకోండి. ఆ పద్ధతిలో మరోసారి ఉద్యమాన్ని మొదలుపెట్టండి. ఆల్ ద బెస్ట్.

By
en-us Political News

  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.