జగన్ క్రెడిట్ చోరీకి ఉండవల్లి మాటసాయం.. ఏమన్నారంటే?
Publish Date:Sep 5, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోలవరం ప్రాజెక్ట్ మరో సారి చర్చనీయాంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రగడ రేపుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ క్రెడిట్ వార్ కు మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ ట్రోల్ అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ క్రెడిట్ ను ఉండవల్లి తన వ్యాఖ్యల ద్వారా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి క్రెడిట్ లో వేయడానికి ఉండవల్లి ప్రయత్నించారు. పోలవరం పేరు చెబితే ఎవరికైనా గుర్తుకు వచ్చేది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనని ఉండవల్లి అన్నారు. ఎవరెంత ప్రయత్నించినా, ఎంత తపస్సు చేసినా ఈ సత్యాన్ని మార్చలేరంటూ ఉండవల్లి పరోక్షంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి. ఇక ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం, నిర్దుష్ట కాల వ్యవధిలో పూర్తి కావడం తధ్యమన్న అంచనాల నేపథ్యంలో జగన్ కు మద్దతుగా ఉండవల్లి మీడియా ముందుకు వచ్చారు. పోలవరం విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు వచ్చిన ప్రజా సానుకూలతను తగ్గించేందుకు శతధా ప్రయత్నించారు. అంటే పోలవరం అంటే వైఎస్ మాత్రమే గుర్తుకు వస్తుంటారు అని వ్యాఖ్యానించడం ద్వారా వైసీపీకి పోలవరం పురోగతిని అనుకూలంగా మార్చేందుకు ఉండవల్లి ప్రయత్నించారన్న మాట. అయితే.. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను పడుకోపెట్టేసిన విషయాన్ని ఉండవల్లి ఇక్కడ కన్వీనియెంట్ గా మార్చిపోయారు. అంతేనా ఉండవల్లి జగన్ హయాంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు, అవినీతి ఇసుమంతైనా కనిపించదు. ఉదాహరణకు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం గురించి ఉండవల్లి ఎన్నడూ మాట్లాడలేదు. జగన్ హయాంలో చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో రాజమహేంద్రవరం జైలు వైపు ఆయన కన్నెత్తి చూడలేదు. కానీ అక్రమమద్యం కేసులోఅరెస్టైన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టును తప్పుపట్టడమే కాకుండా, రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి మరీ ఆయనను పరామర్శించి వచ్చారు. ఇక పోలవరం విషయానికి వస్తే.. జగన్ హయాంలో ఆయన సర్కార్ నిర్వాకం కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి.. ఖజానాపై 3 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించిన పాపాన పోలేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పోలవరం పనులను పరుగులెత్తిస్తూ.. ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తుంటే.. ఉండవల్లికి క్రెడిట్ వైఎస్ కు.. తద్వారా జగన్ వైసీపీకీ దక్కకుండా పోతోందన్న భయం, బెంగ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే హడావుడిగా పోలవరం అంటే వైఎస్ గుర్తుకు వస్తారనీ, వైఎస్ అంటే పోలవరం గుర్తుకు వస్తుందనీ చెబుతూ తగుదునమ్మా అంటూ జగన్ క్రెడిట్ వార్ కు మద్దతు పలుకుతున్నారు. ఈ వార్త కూడా చదవండి: https://teluguone.com/news/prevsingle/not-undavalli-he-is-chameleon--39-192665.html గతంలో ఇదే పోలవరం గ్యాప్ 2 ఆనకట్ట నిర్మాణంలో సాంకేతిక వ్యత్యాసాలు ఉన్నాయనీ, డిజైన్ ఆమోదాలు లేకుండా పనులు ముందుకు తీసుకెళ్తే భవిష్యత్తులో ముప్పు ఎదురౌతుందంటూ ఇదే ఉండవల్లి సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఇలా సాంకేతిక అంశాల ప్రస్తావిస్తూ ఒక వైపు పోలవరంపై విషం కక్కుతూనే.. మరో వైపు, ఇదే పోలవరం రాజకీయంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి లబ్ధి చేకూరుస్తుందన్న దుగ్ధతో జగన్ క్రెడిట్ చోరీ యత్నాలకు మద్దతు పలుకుతూ ఉండవల్లి తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టుకుంటున్నారు.
[Undavalli Arun Kumar on Polavaram Project, Coalition Government, Chandrababu Naidu, YS Rajasekhara Reddy, AP Politics, Telugu One]
http://www.teluguone.com/news/content/-undavalli-arun-kumar-on-polavaram-project-45-230753.html




