రాజయ్య కోడలు చనిపోయి సాధించిందా?

Publish Date:Nov 4, 2015

Advertisement



కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక ఆమె ముగ్గురు కుమారులు బుధవారం ఉదయం అగ్ని కీలలకు ఆహుతి అయిన  ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజయ్య మీద, ఆయన కుమారుడి మీద సారిక చాలా సంవత్సరాలుగా చేస్తు్న్న న్యాయపోరాటం అర్ధంతరంగా ముగిసిపోయింది. కొంతమంది ఈ ఘటనను ఆత్మహత్యగా భావిస్తున్నారు. సారిక తరఫు బంధువులు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యేనని అంటున్నారు. ఈ మేరకు రాజయ్య మీద అతని భార్య, కుమారుడి మీద కేసు నమోదైంది. పోలీసులు వారిని అరెస్టు కూడా చేశారు. అయితే సారిక మరణం తర్వాత బయటి ప్రపంచానికి వెల్లడి అవుతున్న విషయాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. రాజయ్య కుమారుడిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి సారిక రాజయ్య కుటుంబం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు మీడియాకు వివరిస్తున్నారు. అయితే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం వున్న సారిక ఇలా పిరికిదానిలా ఆత్మహత్య చేసుకుంటుందని తాము ఎంతమాత్రం ఊహించలేదని అంటున్నారు. అయితే సమస్యల ఒత్తిడిని తట్టుకోలేక, తన మామ రాజయ్యను రోడ్డుకు ఈడ్చడానికే సారిక ఇలాంటి పనికి ఒడిగట్టిందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.

ఎంపీ హోదాలో ఉన్న సమయంలో రాజయ్య తన కోడలిని అనేక రకాలుగా వేధించినట్టు సమాచారం. ఆ వేధింపులు తట్టుకోలేక సారిక రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసిందట. రాజయ్య కుటుంబ సభ్యుల మీద గృహహింస చట్ట ప్రకారం కేసు కూడా పెట్టింది. రాజయ్యను బజారుకు ఈడ్చడానికి ఆమె అవిశ్రాంత యోధురాలిలా ప్రయత్నించేది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా ఆ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజయ్య టిక్‌ట్ ఆశిస్తున్న విషయం తెలుసుకుని సారిక కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసినట్టు సమాచారం. రాజయ్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్ ఇవ్వరాదని ఆమె ఆ లేఖలో కోరిందట. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాజయ్యకే టిక్కెట్ ఇచ్చింది. బుధవారం నాడు ఆయన నామినేషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాను చనిపోయి అయినా రాజయ్యను సాధించాలన్న ఉద్దేశంతోనే సారిక ఆత్మహత్య చేసుకుని వుండవచ్చని కొంతమంది అనుమానిస్తున్నారు. సారిక ఆ ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టయితే, ఆమె కోరుకున్నదే జరిగింది. రాజయ్య పోటీ నుంచి తప్పుకోక తప్పలేదు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. రాజయ్య ప్రతిష్ఠ పూర్తిగా దిగజారిపోయింది. అయితే దీన్ని సాధించడం కోసం తన ప్రాణాన్ని, ముగ్గురు చిన్నారుల ప్రాణాన్ని బలిచేయడం సారికకు తగదని పలువురు అంటున్నారు.

By
en-us Political News

  
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.