సిబిఐ నిలిపివేసిన సాక్షి మీడియా ఖాతాల్లో రూ.110 కోట్లు
Publish Date:May 10, 2012
Advertisement
వైయస్ జగన్ ఆస్తుల కేసు విచారణలో భాగంగా సిబిఐ సాక్షి మీడియాకు చెందిన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. సిబిఐ స్తంభింపజేసిన సాక్షి మీడియా ఖాతాల్లో రూ.110 కోట్ల రూపాయలు ఉన్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా ఖాతాలను పదింటిని సిబిఐ ఫ్రీజ్ చేసింది. వాటిలో చాలా వరకు కరెంట్ ఖాతాలే. ఇతర ఖాతాల్లో మూడు కోట్ల రూపాయలకు మించి లేవని తెలుస్తోంది. జగతి పబ్లికేషన్స్ పేర ఒబిసి, ఎస్‌బిఐల్లో ఫిక్స్‌జ్ డిపాజిట్ల రూపంలో రూ.103 కోట్లు, 8 కోట్ల రూపాయలు ఉన్నాయి. జగతి పేరు మీద ఐఒబిలో 3.3 లక్షల రూపాయలు ఉన్నాయి. జనని పేరు మీద రూ.46 లక్షల రూపాయలు ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sakshi-bank-accounts-24-13937.html
http://www.teluguone.com/news/content/sakshi-bank-accounts-24-13937.html
Publish Date:Sep 5, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026





