Publish Date:May 10, 2012
ఇటీవల మూతపడిన కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ వ్యవహారం కేంద్ర స్థాయికి చేరింది. ఈ పరిశ్రమ వైస్ చైర్మన్ నాయుడు హత్య, ఆ తరువాత లాకౌట పరిణామాలు ఓ సంచలనమయ్యాయి. ఈ పరిణామాలను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులు యానాంలో రీజెన్సీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి కాంగ్రెస్ తరుపున అమలాపురం ఎంపీ జి.వి .హర్షకుమార్ యానాంలో కార్మికులతో ఒక కొత్త గ్రూపును నెలకొల్పారు. ఈ గ్రూపును ముందేసుకుని ఆయన స్థానిక ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుపై విమర్శల వర్షం కురిపించారు. ఒకదశలో మల్లాడిని అరెస్టు చేయాలన్నంత సీరియస్ గా ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యానాలు చేశారు.
ఆ తరువాత పరిశ్రమను తెరిపించాలని డిమాండ్ తో హర్షకుమార్ ముందుకు వెళ్ళారు. ఈ దశలో ఎమ్మెల్యే మల్లాడి క్రిష్ణారావు యానాం కార్మికుల విజ్ఞాపనలను తీసుకుని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. తమ ప్రాంతానికి పేరు తెచ్చిన రీజెన్సీ పరిశ్రమలు మూడింటినీ తిరిగి తెరిపించాలని డిమాండ్ చేస్తూనే యానాం అభివృద్ధికి నిధులను మంజూరు చేయాలని కృష్ణారావు కోరారు. తమ ప్రాంతంలో ఎంపీ హర్షకుమార్ అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్ కు ఫిర్యాదు చేశారు. ప్రధాని జోక్యం చేసుకుంటే హర్షకుమార్ యానాం వైపు కన్నెత్తి చూడరన్న మల్లాడి వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో తెరపై చూడాల్సిందేనని వారు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mallaadi-krishnarao-complains-on-mp--harsha-kumar-to-prime-minister-24-13934.html
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.