జగన్ వ్యూహాత్మకంగా అరెస్టు అవుతారా ...?
Publish Date:May 10, 2012
Advertisement
జగన్ అనివార్యంగా అరెస్టు అవుతారా? అంటే ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. సిబీఐ జగన్ అక్రమ ఆస్తుల దర్యాప్తు గాలి జనార్థనరెడ్డి, విజయసాయి రెడ్డి అరెస్టు సందర్భంగా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా జగన్ అరెస్టు వ్యవహారంలో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. కేసులో జగన్ మొదటి ముద్దాయిగా వున్నప్పటికీ సిబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేయకుండా కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయడంలోనే వ్యూహం దాగివుంది. జగన్ సాధారణంగా అరెస్టు చేస్తే రాజకీయ రంగు వస్తుంది. దాంతో కేసు ప్రాధాన్యత తగ్గిపోతుంది. అందువల్ల సిబీఐ నేరుగా జగన్ చేసిన నేరాల చిట్టాను నేరుగా న్యాయస్థానానికి సమర్పించింది. ఇప్పుడు జగన్ ను అరెస్టుచేయడమా లేదా అనేది న్యాయస్థానం చూసుకుంటుంది. అనేక ఆరోపణలతో ఛార్జిషీటు దాఖలు చేయడం వల్ల ఆ ఆరోపనలపై వివరణ ఇవ్వవలసిందిగా జగన్ ను తప్పనిసరిగా వివరణ కోరుతుంది. ఆ వివరణ సంతృప్తిగా లేనిపక్షంలో అరెస్టు చేయవలసిందిగా కొరతే స్వయంగా ఆదేశించే అవకాశం వుంటుంది. సిబీఐ మూడో ఛార్జిషీటు దాఖలు చేసిన అనంతరం కోర్టుకు హాజరు కావలసిందిగా సమన్లు జారీ చేయడం సిబీఐ వ్యూహం నిజమవుతున్నట్టుగా అనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/cbi-stratergy-on-jagan-arrest-24-13940.html





