రాప్తాడు నిందితుడి ఆరోగ్యం విషమం: కర్నూలుకు తరలింపు: ఆపరేషన్ చేయనున్న వైద్యులు.!
Publish Date:Nov 13, 2026
Advertisement
రాప్తాడు నిందితుడికి వైద్యులు ఆపరేషన్ చేయనున్నారు. రాప్తాడు పాఠశాలలో బాలికపై పాశవికంగా ట్రీకట్టర్ తో దాడి చేసిన నిందితుడిని అరెస్టు చేసే సమయంలో అతడు తిరగబడటంతో పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు హేమంత్ కు వైద్యులు అత్యవసర చికిత్స అందించి, కాలు తీసివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారడంతో..అతడిని మెరుగైన చికిత్సఅందించేందుకు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల బృందం పర్యవేక్షణలో హేమంత్ కు చికిత్స అందిస్తున్నారు. వైద్యుల సమాచారం మేరకు హేమంత్ పల్మనరీ ఎంబాలిజం అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా అతని శరీరంలోని రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. రక్త ప్రసరణకు తీవ్ర అంతరాయం కలుగుతుండటంతో అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో అతనికి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఇది కూడా చదవండి: రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు: అనంతపురం జీజీహెచ్‌లో అర్ధరాత్రి శస్త్రచికిత్స.! హేమంత్ ఆరోగ్య తీవ్రతపై వైద్యులు ఇప్పటికే న్యాయస్థానానికి నివేదికను సమర్పించారు. రక్త నాళాల్లో పేరుకుపోయిన రక్తపు గడ్డలను తక్షణమే తొలగించకపోతే, ప్రాణాలకే అపాయం అని తెలిపారు న్యాయస్థానం అనుమతితో హూంమంత్ కు సర్జరీని నిర్వహించేందుకు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆపరేషన్ కు ముందు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలను పూర్తి చేస్తూ, అతని శరీర స్థితిని నిలకడగా ఉంచేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా పల్మనరీ ఎంబాలిజం అనేది ప్రమాదకరమైన వైద్య పరిస్థితిగా చెబుతారు. రక్త నాళాల్లో ఏర్పడే ఈ అడ్డంకులు కీలక అవయవాలకు ప్రాణవాయువు అందకుండా చేస్తాయి. అందువల్ల, ఏమాత్రం ఆలస్యం చేయకుండా శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించడం ఒక్కటే ప్రాణాలను కాపాడే ఏకైక మార్గంగా వైద్యులు చెబుతున్నారు. మీకు నచ్చవచ్చు: రాప్తాడు దాడి బాధితురాలు కోలుకుంటోంది: గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్.! రాప్తాడు బాధిత బాలికకు అండగా నారా లోకేష్.. 48 గంటలు కీలకమన్న వైద్యులు. ! [RaptaduAccused, Health Critical, Kurnool Hospital t, Pulmonary Embolism, Surgery, TeluguOne]
http://www.teluguone.com/news/content/raptaduaccused-43-237061.html





