రాహుల్, కేజ్రీవాల్, ఏచూరిల మీద దేశద్రోహం కేసు!
Publish Date:Feb 29, 2016
Advertisement
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, అక్కడి విద్యార్థులకు మద్దతు పలికిన రాజకీయ నాయకుల మీద తెలంగాణలో దశద్రోహం కేసు నమోదైంది. జేఎన్‌యూకి సంబంధించిన కన్నయా కుమార్ దేశద్రోహం కేసు కింద విచారణను ఎదుర్కొంటుండగా, ఆయనకి మద్దతు పలకడం కూడా దేశద్రోహం కిందకే వస్తుందన్నది ఫిర్యాదుదారుని వాదన. హైదరాబాదుకి చెందిన జనార్ధన్ గౌడ్ అనే న్యాయవాది, సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్లో ఈ కేసుని ధాఖలు చేశారు. ఈ సందర్భంగా రూపొందించిన ఎఫ్.ఐ.ఆర్‌లో రాహు్‌ల్‌గాంధితో పాటు జేఎన్‌యూకి వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఆనంద్‌శర్మ, అజయ్‌మాకెన్లని కూడా చేర్చారు. రంగారెడ్డి జిల్లా కోర్టుకు చేరనున్న ఈ కేసులో న్యాయస్థానం ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rahul-gandhi-45-56273.html
http://www.teluguone.com/news/content/rahul-gandhi-45-56273.html
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 23, 2026





