సీఈఓ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ డిమాండ్.!

Publish Date:Sep 24, 2026

Advertisement

భారత రాజకీయాల్లో ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్  ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వ్యవపై తీవ్ర దుమారం రేగుతోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిర్వహించిన మీడియా సమావేశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ అత్యున్నత ఎన్నికల సంఘంలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు, 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై తోటి ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు మరియు వివేక్ జోషి గత 10 నెలల కాలంలో ఏకంగా 14 సార్లు రికార్డు స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మీడియాలో సంచలన నివేదికలు వెలువడ్డాయి. ఈ పరిణామాల తర్వాతే రాహుల్ గాంధీ ఈ ప్రెస్‌మీట్ నిర్వహించి, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది కేవలం కాగితం మీద ముద్రించేది కాదని, అది ప్రతి పౌరుడి హృదయ స్పందన అని అభివర్ణించారు. కానీ, గత 2024 లోక్‌సభ ఎన్నికలు  పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చోరీ అయ్యాయని ఆయన గట్టిగా ఆరోపించారు. హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో దశాబ్దాలుగా మారుతూ వచ్చిన ప్రజా తీర్పు, అకస్మాత్తుగా 'వ్యతిరేకత' (యాంటీ-ఇన్‌కంబెన్సీ) లేకుండా ఎలా మారిపోయిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఓటు చోరీ జరిగితే, దాని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంటుందని, దీనివల్ల క్రమంగా 'చట్టాల చోరీ' (కానూన్ చోరీ), ఆ తర్వాత 'వ్యవస్థల చోరీ' (సంస్థా చోరీ) జరుగుతాయని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ఎన్నికల సంఘంలో జరిగిన అంతర్గత విభేదాలపై స్పందిస్తూ.. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ధైర్యంగా ముందుకు వచ్చి వాస్తవాలను బయటపెట్టడం ఎంతో మంచి పరిణామమని రాహుల్ గాంధీ ప్రశంసించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఇకనైనా తన పద్ధతి మార్చుకుని, దేశ ప్రయోజనాల దృష్ట్యా అప్రూవర్ (Approver) గా మారిపోవాలని ఆయన సలహా ఇచ్చేశారు. ఇది దేశభక్తితో కూడిన చర్య అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించిన రాహుల్ గాంధీ.. భవిష్యత్తులో దీనిపై సమగ్ర విచారణ జరిగి తీరుతుందని, తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఓట్లు దొంగిలించి పార్లమెంట్‌లో కూర్చున్న ఎంపీలు చేసే చట్టాలన్నీ పూర్తిగా చట్టవిరుద్ధమని ఆయన తేల్చిచెప్పారు.

 

 

 

[ Rahul Gandhi, Gyanesh Kumar, Election Commission, Vote Chori, CEC Resignation, ECI Controversy, Vote theft allegations, Election Commission of India, Narendra Modi, Amit Shah, Voter list revision ]
,

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.