వచ్చే ఆదివారం బ్యాంకులకు వర్కింగ్ డే: ఎందుకంటే.?

Publish Date:Sep 23, 2026

Advertisement

దేశంలోని బ్యాంకింగ్ రంగ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒకింత ఊరట కలిగే కబురు చెప్పింది. ఈ నెలలో బ్యాంకులు మూడు రోజుల సమ్మెకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో..బ్యాంకులు వచ్చే ఆదివారం  (సెప్టెంబర్ 27)న పని చేస్తాయని ప్రకటించింది.   బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెల కారణంగా సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగానే సాధారణంగా సెలవు దినమైన ఆదివారం కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు పనిచేస్తాయని  ప్రకటించింది.   యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు ఈ నెల చివరి వారంలో మూడు రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28 నుండి 30వ తేదీ వరకు వరుసగా మూడు రోజుల పాటు సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఆదివారం (సెప్టెంబర్ 27)న బ్యాంకులకు వర్కింగ్ డేగా ప్రకటించినట్లుకేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.   ఈ నెల 26వ తేదీ నాల్గవ శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు వస్తుంది. ఆ మరుసటి రోజు   సెప్టెంబర్ 27 ఆదివారం కూడా సాధారణంగా సెలవు దినమే. అయితే..  ఆ వెంటనే సోమవారం నుండి మూడు రోజుల పాటు బ్యాంకులు సమ్మెకు పిలుపునివ్వడంతో  వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండని పరిస్థితి ఏర్పడింది.  

దీనివల్ల   ప్రజలు, వ్యాపారవేత్తలు అత్యవసర ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.   ఈ పరిస్థితిని నివారించడానికి వీలుగా సెప్టెంబర్ 27న వచ్చే ఆదివారం నాడు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు యథావిధిగా తెరుచుకుని పనిచేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.  


[Public Sector Banks Sunday Workingday, Bank strike September, UFBU Strike, Banking services, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.