పవన్ కళ్యాణ్ అమెరికా టూర్... మీడియా లైట్ తీసుకుందా?

Publish Date:Feb 13, 2017

Advertisement

 

పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటన... ఈ సంగతి మన మీడియా పెద్దగా పట్టించుకుంటున్నట్టు అనిపించటం లేదు! శశికళ, పన్నీర్ సెల్వం తమిళ డబ్బింగ్ సినిమాకి క్రేజ్ బాగా వుండటంతో పవన్ కళ్యాణ్ స్టారర్ అస్సలు పట్టించుకోలేదనిపిస్తోంది! కాని, ఆయన ఇక్కడ లోకల్ గా అనంతపురం సభ, కాకినాడ సభ అంటే భీభత్సమైన రభస చేసే మన వాళ్లు ఈసారి ఎందుకు లైట్ తీసుకున్నారు? సరైనా సమాధానాలైతే లేవనే చెప్పాలి! అయితే, ప్రధాన కారణం ఎక్కడో అమెరికాలో జరుగుతోన్న మీటింగ్ లు కావటంతో కవరేజ్ బాగా కష్టమయ్యే చాన్సెస్ వున్నాయి. అక్కడ్నుంచీ లైవ్ పెట్టుకోవటం అంత ఈజీ కాదు. పైగా ఎలాగో రికార్డింగ్ చేయించి వీడియో క్లిప్పింగ్ లు తెప్పించుకున్నా... పవర్ స్టార్ కామెంట్స్ లో పెద్దగా మసాలా ఏం వుండటం లేదు. దాంతో పెద్దగా కాన్సన్ ట్రేట్ చేయటం లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా!

 

ఛానల్స్ లో , పేపర్స్ లో మరీ ఎక్కువ చర్చ జరగకున్నా సోషల్ మీడియాలో పవనిజం ఫాలోవర్స్ తమకు వీలైనంత హడావిడి చేశారు. ఒక తెలుగు వాడు అమెరికా గడ్డపై ప్రసగించబోతున్నాడని ప్రచారాలు చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ పవన్ కి సపోర్ట్ చేయాలని కూడా అన్నారు. కాని, తీరా పవన్ వరుసగా సభల్లో ప్రసంగిస్తుంటే వారు కూడా పెద్దగా షేరింగ్ లేం చేయటం లేదు! అమెరికా దాకా వెళ్లినా కూడా పవన్ కళ్యాణ్ తన ఎర్ర కండువా వదలకపోవటం కొంచెం డిస్కషన్ కి దారి తీసింది ఫేస్బుక్, ట్విట్టర్ లలో! రెడ్ కలర్ సామాన్యుడికి ప్రతీక అంటూ పవన్ కొత్త నిర్వచనం ఇచ్చాడు. కాకపోతే, అమెరికాలో జరిగే మీటింగ్ కి అలా ఎర్ర గుడ్డ కప్పుకుని వెళ్లటం ఏం స్ట్రాటజీనో రాజకీయ పండితులకి కూడా అర్థం కాలేదు!

 

ఒక మీటింగ్లో ఎర్ర కండువాతో కనిపించిన పవన్ అన్నిట్లో అలా కనిపించలేదు. అంతే కాదు, అమెరికా దాకా వెళ్లి కూడా ఉత్తరాది, దక్షిణాది భేదాల గురించి మాట్లాడాడు. భారతదేశంలో సంస్కృతుల మధ్య తేడాలున్నాయని పవన్ అభిప్రాయపడ్డాడు! అసలు ఇదంతా జరుగుతున్నా ఎవ్వరికీ అర్తం కాని విషయం ఒక్కటే! పవన్ అమెరికా పర్యటనతో ఆశిస్తున్నదేమిటి? ఎన్నారైలలో జనసేన పాప్యులారిటీ పెంచటామా? నిధుల సేకరణా? లేక 2019 ఎన్నికలకి ఇప్పట్నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయటమా? ఇలా బోలెడు ప్రశ్నలు! కాని, దేనికీ ఇప్పటికిప్పుడు సమాధానాలు లేవు!

 

రానున్న ఎన్నికల్లో పూర్తిస్థాయిలో బరిలోకి దిగుతానని చెప్పిన పవన్ విదేశాల్లోనూ తన ప్రభావాన్ని పెంచుకోవటం సంతోషించాల్సిన విషయమే. కాని, ఇలా మీటింగ్ లలో పాల్గొనటం ఇంచుమించూ మరే భారీతీయ హీరో చేయలేదు. అలాంటిది తాను చేసినా కూడా మీడియాలో తగినంత పబ్లిసిటీ వచ్చేలా చూసుకోకపోవటం ఎంతో కొంత నష్టమే. ఇంకా పవర్ ఫుల్ ప్లానింగ్ చేయాల్సింది పవర్ స్టార్ అండ్ హిజ్ టీమ్!

 

By
en-us Political News

  
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు  అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.