ఆస్కార్ క్లైన్ మెడల్‌ అందుకున్న తొలి ఇండియన్ అశోక్ సేన్.. ఇండియాలోనే పరిశోధనలు.!

Publish Date:Oct 26, 2026

Advertisement

సైంటిస్టుగా అంతర్జాతీయ గుర్తింపు.. సమాజిక బాధ్యతలో వెన్నుచూపని ధీరత్వం.! 

 భౌతిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ క్లైన్ మెడల్‌ అందుకున్న తొలి ఇండియన్ సైంటిస్ట్ అశోక్ సేన్ . స్ట్రింగ్ థియరీ, బ్లాక్‌హోల్ ఎంట్రోపీ, స్ట్రింగ్ ఫీల్డ్ థియరీ వంటి  రంగాల్లో ఆయన చేసిన పరిశోధనలకు గాను 2026 సంవత్సరానికి ఆయనకీ పురస్కారాన్ని స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయం, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని నోబెల్ కమిటీ ఫర్ ఫిజిక్స్ సంయుక్తంగా ప్రదానం చేశాయి. అశోక్ సేన్ పరిశోధనలు ఆధునిక భౌతిక శాస్త్రంపై గణనీయమైన ప్రభావం చూపాయి. 

అపారమైన మేధా సంపత్తి, బోలెడు అవకాశాలూ ఉన్న ఆయన కోరుకుంటే అమెరికాలోనే స్థిరపడి ఈ పరిశోధనలు సాగించవచ్చు. కానీ ఆయన దేశంపట్ల ప్రేమ, గౌరవంతో ఇండియాలోనే తన పరిశోధనలు సాగించారు.  కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదివిన అశోక్ సేన్, ఐఐటీ కాన్పూర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి అమెరికాలో పీహెచ్‌డీ చేశారు.   అక్కడ పరిశోధన అనుభవాన్ని సంపాదించిన ఆయన ఇండియాకు తిరిగి వచ్చి,  ప్రయాగ్‌రాజ్‌లోని హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చాలా కాలం పాటు పని చేశారు. ఇప్పుడు  బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్‌లో  ఛైర్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. 

అమెరికాలోనే స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ భారత్‌లో పరిశోధనలను కొనసాగించడానికి దేశ భక్తితో పాటు, ప్రపంచ స్థాయి పరిశోధనలు ఇక్కడా సాధ్యమేనని నిరూపించాలన్న లక్ష్యం, సంకల్పం ఉంది.  ఆయన పరిశోధనలు, మేధా సంపత్తికి గుర్తింపుగా ఆయనను 2001లో పద్మశ్రీ, 2103లో పద్మభూషణ పురస్కారాలు వరించాయి. 2014లో అశోక్ సేన్ ను డిరాక్ మెడల్ వరించింది. అంతే కాదు ఆయనకు తన పరిశోధనలకు గాను  గతంలో   3 మిలియన్ డాలర్ల భారీ బహుమతి లభించింది.  

అశోక్ సేన్ కేవలం శాస్త్రవేత్తగా సమాజానికీ, మానవ పురోగతికి అవసమైన పరిశోధనలు చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. సామాజిక  బాధ్యత కూడా పరిపూర్ణంగా పోషించారు.  సామాజిక అంశాలపై  తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేయడానికి ఇసుమంతైనా వెనుకాడని వ్యక్తిత్వం అశోక్ సేన్ ది.  2015లో దేశంలో అసహనం పెరుగుతోందన్న ఆందోళన  వ్యక్తం చేస్తూ పలువురు శాస్త్రవేత్తలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఆయన భాగస్వామి.

 గోమాంసం తిన్నారనే అనుమానంతో మొహమ్మద్ అఖ్లాక్‌  హత్య  ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో  వ్యక్తులపై  ఆహారపు అలవాట్ల పేరుతో హింసకు పాల్పడటాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించారు.  ఇలా సమాజంలో చోటుచేసుకునే అన్యాయాలపై గళమెత్తడానికి అశోక్ సేన్ ఎన్నడూ వెనుకాడలేదు.   శాస్త్రీయ ఆలోచన, హేతుబద్ధత, మానవ విలువలు వంటి వాటిపై అశోక్ సేన్ కచ్చితంగా వ్యవహరించారు. 

ఇక ఆయనకు ప్రతిష్ఘాత్మక ఆస్కార్ క్లైన్ మెడల్‌  దక్కడానికి కారణమైన స్ట్రింగ్ థియరీ విషయానికి వస్తే.. విశ్వంలోని ప్రాథమిక కణాలు, బలాలు, గురుత్వాకర్షణ వంటి అంశాలను ఒక విస్తృత సిద్ధాంత చట్రంలో అర్థం చేసుకోవడానికి ఈ ధియదీ దోహదం చేస్తుంది.  ఈ రంగంలో అశోక్ సేన్ చేసిన పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఆయన కృషికి లభించిన ఆస్కార్ క్లైన్ మెడల్ భారత  శాస్త్ర పరిశోధనలకు కూడా గౌరవాన్ని తెచ్చిపెట్టింది.   

[Oskar Klein Medal To Indian Scientist,  Ashoke Sen, First Indian, String, Theory, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.