ఒంగోలు గిత్తలు: బ్రెజిల్ ఆర్థిక ప్రగతి ప్రదాతలు.!

Publish Date:Oct 24, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మట్టిలో పుట్టి, సముద్రాలు దాటి,  బ్రెజిల్   ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న ఘనత  ఒంగోలు జాతి పశువులది.  నాటి ఉమ్మడి గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని గుండ్లకమ్మ నదీ తీరంలో రూపుదిద్దుకున్న ఈ   పశు సంపద, నేడు ప్రపంచ పశుసంవర్ధక రంగానికే మకుటాయమానంగా ఎదిగింది. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ,   బలంలో, రాజసంతో ఉట్టిపడే ఆకారంతో ఒంగోలు గిత్తలు గిత్తలు బ్రెజిల్ లో నెలోర్' పేరుతో  ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కీలకంగా నిలుస్తున్నాయి.  ఆ దేశ మాంస  ఎగుమతులకు, గ్రామీణ ఆర్థిక పురోగతికి మన ఒంగోలు గిత్తలే మూలస్తంభాలు అనడం ఇసుమంతైనా అతి శయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్   కీర్తి కిరీటమైన ఒంగోలు జాతి పశువులు, వేల మైళ్ల దూరంలో ఉన్న ఒక విదేశీ   సామ్రాజ్య  జీవనాడిగా మారడం గర్వకారణం. 

ఒంగోలు గిత్త అనగానే  దేహదారుఢ్యం, రాజసానికి ప్రతీకగా నిలిచే  మూపురం, వెడల్పాటి నుదురు భాగం, , దగదగ మెరిసే తెల్లని లేదా బూడిద రంగు ఛాయల శరీరం కళ్ల ముందు మొదులుతాయి.   రూపంలోనే కాదు, సహనంలోనూ ఈ జాతికి సాటిలేదు. దాదాపు 45 నుంచి 50 డిగ్రీల తీవ్రమైన  ఉష్ణోగ్రతలను సునాయాసంగా తట్టుకోగల అసాధారణ రోగనిరోధక శక్తి ఒంగోలు గిత్తల సొంతం. ప్రాచీన కాలం నుంచి  వీటిని వ్యవసాయ పనులకు, బరువులు లాగడానికి, పాలు,  మాంస  అవసరాల కోసం   పెంచుకునేవారు. నాటి నుంచి నేటి వరకు ఒంగోలు గిత్తల  హుందాతనం తెలుగువారి గ్రామీణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా మారాయి. ఇటువంటి విశిష్ట లక్షణాలే బ్రెజిల్ పశుపోషకులను ఆకర్షించింది, మన ఒంగోలు గిత్తలే బ్రెజిల్ ఆర్థిక పునాదులను పటిష్టం చేశాయి.  

ఇండియా నుంచి  నుంచి బ్రెజిల్‌కు  ఒంగోలు జాతి పశువుల పయనం (రవాణా)  19వ శతాబ్దపు ద్వితీయార్థంలో ప్రారంభమైంది.   క్రీస్తుశకం 1868 ప్రాంతంలో ఇంగ్లాండ్ వైపు వెళ్తున్న ఒక ఓడ బ్రెజిల్‌లోని సాల్వడార్ తీరంలో ఆగగా, అందులోని రెండు ఒంగోలు పశువులను అక్కడి స్థానికులు కొనుగోలు చేశారు. బ్రెజిల్ ఆర్థిక పురోగతికి అదే తొలి బీజం అని చెప్పచ్చు.   ఆ తర్వాత 1870వ దశకంలో బ్రెజిలియన్ పశుపోషకుడు మనోయెల్ ఉబెల్హార్ట్ లెంబ్రూగర్ జర్మనీలోని హాంబర్గ్ జంతుప్రదర్శనశాలలో మెరిసిన ఒంగోలు గిత్తల రాజసానికి ముగ్ధుడై వాటిని తమ దేశానికి తీసుకు వెళ్లాడు. ఒంగోలు గిత్తల సామర్థ్యాన్ని గుర్తించిన బ్రెజిల్ వ్యాపారులు..   19వ శతాబ్దం చివరలో, అలాగే 20వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశం నుంచి పెద్ద ఎత్తున జీబూ రకం పశువులను దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు.

ఈ   ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం 1960-1962 మధ్యకాలంలో చోటుచేసుకుంది. ఆ సమయంలో భారతదేశం నుంచి బ్రెజిల్‌కు ఎగుమతి అయిన 100కు పైగా ఒంగోలు పశువులు అక్కడి పశుసంపద రూపురేకలనే మార్చివేశాయి. ముఖ్యంగా కర్వాది, గోదావరి, గోలియాస్, తాజ్‌మహల్ వంటి ప్రసిద్ధ   వంశావళులకు చెందిన ఆంబోతులు బ్రెజిల్ చేరుకుని, నేటి ఆధునిక నెలోర్ పశుమందల సృష్టికి   పునాది వేశాయి. 1938 నాటికే బ్రెజిల్ ప్రభుత్వం ఈ పశువుల కోసం ప్రత్యేక వంశావళి నమోదు వ్యవస్థను ఏర్పాటు చేసింది, మన ఒంగోలు పశువులు తమ జన్యు సామర్థ్యంతో బ్రెజిల్ వాతావరణంలో అద్భుతాలు సృష్టించాయి. నెల్లూరు జిల్లా పేరు మీదనే అక్కడ వీటికి  నెలోర్' అనే పేరు స్థిరపడిపోయింది. 


బ్రెజిల్ దేశలో విస్తారమైన గడ్డి మైదానాలు, ఉష్ణమండల వాతావరణ పరిస్థితులకు ఒంగోలు జాతి పశువులు  అతి తక్కువ కాలంలోనే అలవాటుపడ్డాయి. యూరోపియన్ రకాల పశువులు అక్కడి వేడికి, కీటకాల దాడికి తట్టుకోలేక విఫలమైన చోట, మన ఒంగోలు జాతి నెలోర్ పశువులు ఆ వాతావరణంలో ఇమిడిపోయాయి. వీటి దట్టమైన చర్మం, స్వేద గ్రంథుల నిర్మాణం ఉష్ణ ఒత్తిడిని సులువుగా తట్టుకునేందుకు దోహదపడ్డాయి.  బాహ్య మరియు అంతర్గత పరాన్నజీవులు, ఈగలు, నల్లుల వంటి క్రిమికీటకాల దాడిని తట్టుకునే సహజ రోగనిరోధక శక్తి ఒంగోలు జాతి పశువులలో పుష్కలంగా ఉండటం బ్రెజిల్ రైతులకు కొండంత   అండగా మారింది. తక్కువ నాణ్యత కలిగిన గడ్డిని మేసినప్పటికీ, శరీరం బరువును వేగంగా పెంచుకోగల ప్రత్యేక జీవక్రియ వీటి సొంతం.

అంతేకాకుండా, నెలోర్ ఆవులలో ఉండే అత్యుత్తమ సంతానోత్పత్తి సామర్థ్యం, దూడలను సంరక్షించే  మాతృత్వ లక్షణాలు ఈ పశువుల మందల సంఖ్య పెరుగుదలకు దోహదం చేశాయి. బ్రెజిల్ పశుపోషకులు కేవలం పశువులను మేపడమే కాకుండా, శాస్త్రీయ పద్ధతిలో జన్యు ఎంపిక ప్రక్రియను చేపట్టారు. వేగంగా బరువు పెరిగే తత్వం, నాణ్యమైన మాంస  దిగుబడి, రోగనిరోధకత వంటి లక్షణాలను ప్రామాణికంగా తీసుకుని తరాల తరబడి అత్యుత్తమ జాతులను అభివృద్ధి చేశారు. ఫలితంగా, భారతదేశ ఒంగోలు పశువుల మూలాలు కలిగిన నెలోర్ జాతి, నేడు బ్రెజిల్ దేశపు వాణిజ్య   ఉత్పత్తిలో  కొత్త రికార్డులను సృష్టిస్తూ, ఆ దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద మాంస ఎగుమతిదారుగా నిలబెట్టింది.

బ్రెజిల్‌లో ఒంగోలు మూలాలున్న నెలోర్ పశువుల నిర్వహణ అత్యంత శాస్త్రీయంగా సాగుతుంది. అక్కడి అపారమైన పచ్చిక బయళ్లనే వీటికి ప్రధాన ఆహార వనరుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పెరిగే బ్రకేరియా  రకం గడ్డి జాతులను, పియాటా, మారాండు వంటి పోషక విలువలున్న గడ్డి రకాలను విస్తృతంగా సాగు చేస్తారు. వర్షాకాలంలో పచ్చిక సమృద్ధిగా దొరికినప్పుడు పశువులు వేగంగా బరువు పెరుగుతాయి. అయితే ఎండాకాలంలో గడ్డి నాణ్యత, అందులోని మాంసకృత్తులు తగ్గే అవకాశం ఉన్నందున, రైతులు ముందుగానే ప్రత్యామ్నాయ దాణా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కాలానుగుణంగా పశువులకు అవసరమైన ఖనిజ లవణాలు, ప్రొటీన్ సప్లిమెంట్లను అందిస్తూ ఉత్పాదకత తగ్గకుండా చర్యలు తీసుకుంటారు. 

పచ్చిక బయళ్ల  నిర్వహణలోనూ బ్రెజిల్ రైతులు వినూత్న పద్ధతులను పాటిస్తున్నారు. భూమిని చిన్న చిన్న భాగాలుగా విభజించి, ఒక భాగంలో గడ్డి మేసిన తర్వాత పశువులను మరొక భాగానికి తరలిస్తారు. దీనివల్ల మొదటి భాగంలో గడ్డి మళ్లీ బలంగా పెరగడానికి తగిన సమయం దొరుకుతుంది. నేల సారాన్ని నిరంతరం పరీక్షించడం,  అవసరమైన ఎరువుల వినియోగంతో  గడ్డి ఉత్పత్తిని గరిష్టం చేస్తారు. ఈ విధమైన క్రమబద్ధమైన యాజమాన్య పద్ధతుల వల్ల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పశువులను సమర్థవంతంగా పోషించడం సాధ్యమవుతోంది. నేటికీ వాతావరణం, నీటి లభ్యత, మేత నాణ్యత ఆధారంగా ఉత్పాదకత మారినప్పటికీ, ప్రాథమికంగా ఒంగోలు జాతికి ఉన్న సహజ సామర్థ్యమే ఈ విజయాలన్నింటికీ పునాదిగా నిలిచింది.

ఒంగోలు జాతి పశువుల విస్తరణ బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థను ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో తెలిపేందుకు ఆ దేశ అధికారిక గణాంక సంస్థ ఐబీజీఈ  నివేదికలో విడుదల చేసిన వివరాలే నిదర్శనం. ఆ నివేదిక ప్రకారం, ప్రస్తుతం బ్రెజిల్‌లో మొత్తం పశువుల సంఖ్య   23.43 కోట్లు. విచిత్రమేమిటంటే, ఆ దేశ జనాభా కంటే పశువుల సంఖ్యే ఎక్కువ! ఇందులో మన ఒంగోలు జాతి మూలాలున్న నెలోర్ పశువుల సంఖ్యే దాదాపు 1.10 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. బ్రెజిల్ నమోదు చేసిన మొత్తం పశుసంపదలో సగానికి పైగా నెలోర్ జాతి మరియు దాని శంకర జాతులే ఆక్రమించాయంటే, ఆ దేశ ఆర్థిక రంగాన్ని మన ఒంగోలు గిత్తలు ఎంతగా శాసిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ పశువుల ద్వారా బ్రెజిల్ ప్రతిఏటా బిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని అర్జిస్తోంది. చైనా, అమెరికా, ఐరోపా,  అరబ్ దేశాలకు బ్రెజిల్ ఎగుమతి చేసే నాణ్యమైన మాంసంలో అత్యధిక శాతం ఈ నెలోర్ పశువుల నుంచే వస్తోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వీధుల్లో, పొలాల గట్ల వెంబడి సాధారణంగా తిరిగిన ఒంగోలు జాతి కోడెలు,  బ్రెజిల్ దేశ  వాణిజ్య రహిత ఆస్తిగా మారడం తెలుగు నేల జన్యు వైభవానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు.

విదేశాల్లో మన ఒంగోలు జాతి పశువులు కోట్లాది రూపాయల ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తుంటే, స్వదేశంలో ముఖ్యంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఈ పశువుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం   ఆందోళనకరం.  ఆధునిక యంత్రాల రాక, వ్యవసాయంలో ట్రాక్టర్ల వాడకం పెరగడం, మేత స్థలాలు తగ్గిపోవడం వల్ల  ఒంగోలు ఆంబోతుల పెంపకం   నెమ్మదించింది. అయితే, బ్రెజిల్ సాధించిన విజయాన్ని స్పూర్తిగా తీసుకుని, మన రాష్ట్రంలో కూడా ఒంగోలు జాతి పరిరక్షణకు, సంవర్ధనకు ప్రభుత్వం,  పశుపోషకులు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆధునిక కృత్రిమ గర్భధారణ సాంకేతికతలు, జన్యు మూల్యాంకనం, నాణ్యమైన పిండ మార్పిడి మ పద్ధతులను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మన దేశంలోనూ ఒంగోలు జాతి విశిష్టతను పునరుద్ధరించవచ్చు. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ కూడా ఒంగోలు జాతి సంరక్షణ కేంద్రాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. బ్రెజిల్ దేశం ఒంగోలు గిత్తలను ఉపయోగించుకుని ప్రపంచ పశుపోషణ రంగానికే మహారాజుగా మారినట్లే, మనం కూడా మన సొంత ఒంగోలు జాతి పశువుల ప్రాముఖ్యతను గుర్తించి,   వాణిజ్యపరంగా, సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్లాలి. ప్రపంచ పశు సంపద చరిత్ర పుటల్లో ఆంధ్రప్రదేశ్ పేరును చిరస్థాయిగా నిలిపిన ఒంగోలు జాతి పశు సంపదను కాపాడుకోవడం అందరి బాద్యత.

[Ongole bulls Key Brazil Finance Progress, , Brazilian Nelore cattle, Livestock Prakasam District,   Ongole Breed,  Andhra Pradesh, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.