కశ్మీరీలు జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నారా..కాంగ్రెస్‌పై ఒమర్ అబ్దుల్లా ఫైర్..!

Publish Date:Sep 11, 2026

Advertisement

పూర్తి వందేమాతరం ఆలాపనపై రగడ..!

జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో 'వందేమాతరం' పూర్తి గీతాలాపన తీవ్ర దుమారం రేపుతోంది. అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయాన్ని పూర్తి స్థాయిలో ఆలపించడంపై మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలకు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అత్యంత తీవ్రంగా  స్పష్టంగా బదులిచ్చారు. జమ్మూకశ్మీర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రారంభ వేడుకల్లో భాగంగా జాతీయ గీతంతో పాటు వందేమాతరం పూర్తి చరణాలను ఆలపించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబడుతూ ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీశాయి. అసలు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది? ఈ నిబంధనలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కొని కాశ్మీరీలు జైలుపాలు కావాలని కోరుకుంటున్నారా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.  

ఇటీవల పార్లమెంటులో జరిగిన చట్టసవరణ ప్రకారం, జాతీయ గీతం లేదా జాతీయ గీతాలాపన జరిగే అధికారిక వేదికల వద్ద వందేమాతరం పూర్తి రూపాన్ని ఆలపించడం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, అది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చట్టబద్ధమైన బాధ్యత (స్టాట్యుటరీ ఆబ్లిగేషన్) అని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, గౌరవ సూచకంగా నిలబడకపోతే చర్యలు తప్పవని ఆయన గుర్తుచేశారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 6 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అంతేకాకుండా, జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి కాంగ్రెస్ వెలుపలి నుంచి మద్దతు ఇస్తోందని, జాతీయ స్థాయిలో 'ఇండియా' (INDIA) కూటమిలో భాగస్వామిగా ఉందని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. 


అయితే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, స్వాతంత్ర్య సమరయోధుల 1937 నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్ణానికి కట్టుబడి కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని సూచించారు.  కాంగ్రెస్ నాయకుల ఈ వైఖరిని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు గట్టిగా తిప్పికొట్టారు. కర్ణాటక, తెలంగాణ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని అధికారిక వేడుకల్లోనూ పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్న వీడియోలను ఎన్సీ నేతలు ప్రస్తావించారు. ఈ వివాదంపై ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు ఈ చట్టంపై నిజంగా అభ్యంతరం ఉంటే పార్లమెంట్‌లో ఈ చట్టం రాకుండా అడ్డుకోవాల్సిందని, కానీ ఇప్పుడు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దాన్ని పాటించక తప్పదని తేల్చిచెప్పారు. 

భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పార్లమెంటు ద్వారా ఈ చట్టాన్ని రద్దు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, త్వరలోనే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తాను ప్రార్థిస్తున్నానని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ పార్టీ (నేషనల్ కాన్ఫరెన్స్) ఎప్పుడూ వందేమాతరాన్ని పార్టీపరంగా అధికారికంగా అంగీకరించలేదని, భవిష్యత్తులోనూ అంగీకరించబోమని స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వ అధినేతగా రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైన నిబంధనలను మాత్రం తాము విధిగా అమలు చేసి తీరుతామని ఒమర్ అబ్దుల్లా తేల్చిచెప్పారు.

 

 

 

[ Omar Abdullah, Vande Mataram row, Congress NC clash, Jammu and Kashmir news, KC Venugopal, India bloc politics, National Conference, INDIA, Congress party, Telugu One, Telugu News]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.