తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ మనవడు దగ్గుబాటి హితేష్.!

Publish Date:Jul 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేవబోతోంది. నందమూరి, దగ్గుబాటి కుటుంబాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న యువనేత దగ్గుబాటి హితేష్ త్వరలోనే పసుపు కండువా కప్పుకో వడానికి సిద్ధమవుతున్నట్లు   విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. దశాబ్దాలుగా నందమూరి, దగ్గుబాటి కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలు, అలాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఉన్న  విభేదాలన్నీ ఇప్పుడు పూర్తిగా సమసిపోయాయని, అందువల్లే హితేష్ రాజకీయ ఎంట్రీకి సర్వం సిద్ధమైందని అంటున్నారు. 

గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న అంతరాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా కుటుంబంలో జరిగిన కొన్ని శుభకార్యాలు, ప్రత్యేక కలయికల తర్వాత విభేదాలన్నీ పక్కన పెట్టి..  అందరూ కలిసిపోయారు.  ఈ క్రమంలోనే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే ఆలోచనలో ఉన్న చంద్రబాబు నాయుడు, హితేష్ చెంచురాంను పార్టీలోకి ఆహ్వానిం చడంపై సానుకూలంగా  స్పందించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హితేష్ తల్లి దగ్గుబాటి పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ లో కీలక నేతగా, ఎంపీగా కొనసాగుతుండగా, తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏ రాజకీయ పార్టీలోనూ యాక్టివ్‌గా లేరు. ఈ నేపథ్యంలో హితేష్‌ను నేరుగా తెలుగుదేశం పార్టీ ద్వారా యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు  నిర్ణయించుకున్నట్లు సమాచారం.

దగ్గుబాటి హితేష్ చెంచురాం రాజకీయ రంగ ప్రవేశం కోసం గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయన ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే.. ఆ సమయంలో సాంకేతిక కారణాల వల్ల, ముఖ్యంగా ఆయనకు సంబంధించిన సిటిజన్‌షిప్,  కొన్ని డాక్యుమెంటేషన్ ప్రక్రియలు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చేజారిపోయింది.

ఆ తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో కూడా ఆయన పోటీకి దూరంగానే ఉన్నారు.ఇప్పుడు  ఆ సాంకేతిక అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోవడంతో, హితేష్ చెంచరాం..  పర్చూరు లేదా బాపట్ల జిల్లా పరిధిలోని ఏదైనా కీలక నియోజకవర్గం నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 దశాబ్దాల కాలంగా ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన దగ్గుబాటి కుటుంబం మళ్లీ టిడిపి గూటికి చేరితే, ఆ ప్రాంతంలో పార్టీ క్యాడర్‌కు కొత్త ఉత్సాహం రావడం ఖాయమంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా హితేష్‌కు ఒక స్పష్టమైన భవిష్యత్తు హామీని ఇచ్చి, పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తోంది.  ఎన్టీఆర్ మనవడిగా, ఉన్నత విద్యావంతుడిగా, స్పష్టమైన విజన్ ఉన్న యువకుడిగా హితేష్ చెంచురాం తెలుగుదేశం పార్టీకి కొత్త మైలేజ్ తీసుకువస్తారని   భావిస్తున్నారు. హితేష్ తెలుగుదశంలో చేరిక విషయంలో అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు.  

daggubati hitesh tdp, ntr grandson hitesh, daggubati purandeswari son, chandrababu naidu, ap politics

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.