నేపాల్‌ జల ప్రళయం.. ప్రకృతి వైపరిత్యమా.. మానవ తప్పిదమా?

Publish Date:Sep 6, 2026

Advertisement

ఇటీవల నేపాల్‌లో సంభవించిన పెను విలయం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. క్షణాల వ్యవధిలో ఊళ్లకు ఊళ్లు నీటమునిగిపోవడం, భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వినాశనానికి కారణాలు ఏమిటి? ఇది కేవలం ప్రకృతి చేసిన బీభత్సమా లేక మానవ తప్పిదాల ఫలితమా అన్న చర్చ జరుగుతోంది. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో..డాక్టర్ దంతి నరసింహారెడ్డి.. అభివృద్ధి పేరిట పర్యావరణ వినాశనానికి పాల్పడటమే ఇటువంటి విపత్తులకు కారణమన్నారు. అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసానికి పాల్పడటం వల్లనే నేపాల్ జలవిలయం వంటివి సంభవిస్తున్నాయని కుండబద్దలు కొట్టారు.  నేపాల్‌తో పాటు హిమాలయ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదని, ఇది యావత్ ఉపఖండాన్ని కలవరపెట్టే పరిణామమని ఆయన అన్నారు.  అభివృద్ధి పేరుతో హిమాలయ పర్వత శ్రేణులలో జరుగుతున్న విద్వంసకర పనులు, నదుల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ చేపడుతున్న ప్రాజెక్టులు ఈ ముప్పును మరింత తీవ్రం చేస్తున్నాయన్నారు. 

భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల హిమాలయాల్లోని గ్లేసియర్లు (మంచు చరియలు)   వేగంగా కరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఏర్పడే సరస్సులు అకస్మాత్తుగా తెగిపోవడం లేదా భారీ మంచు పెళ్లలు నీటిలో పడటం వల్ల ఒక్కసారిగా ఉప్పెనలా వరదలు ముంచుకొస్తున్నాయి. దీనిని 'గ్లాఫ్' (గ్లేషియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్స్) అంటారన్నారు. అయితే ఈ పరిస్థితికి కారణం మానవతప్పిదమేనన్నారు. మావన తప్పిదాల వల్లే సాధారణంగా జరిగే పర్యావరణ మార్పులు అసాధారణ స్థాయిలో జరుగుతున్నాయని గొంతు నరసింహారెడ్డి అన్నారు.  అడవుల నరికివేత, పచ్చదనం కోల్పోవడం వల్ల పర్వతాలు   సున్నితంగా మారుతున్నాయన్నారు. కొండలను తొలచి రోడ్లు వేయడం, నదుల పక్కనే ఇష్టానుసారంగా ఇళ్లు, కట్టడాలు నిర్మించడం వల్ల ముప్పు మరింత పెరుగుతోందన్నారు.

అభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద డాములు, జలవిద్యుత్ ప్లాంట్లు నిర్మించడం కాదని, స్థానిక ప్రజల ఆకాంక్షలను, పర్యావరణ సమతుల్యతను గౌరవించినప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని దొంతి నరసింహారెడ్డి అన్నారు.  భవిష్యత్తులో ఇలాంటి పెను ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

[Nepal disaster, Himalayan glaciers, environmental destruction, hydroelectric projects, natural disasters]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.