నేషనల్ సైన్స్ డే
Publish Date:Feb 27, 2019
Advertisement
1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించారు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు. ఈయన పరిశోధన యొక్క విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో 'భారతరత్న' అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి. ఆయన నాజీవితంలో ఒక విఫల ప్రయోగం. ఎందుకంటే నేను నా మాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను. అంటూ చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20 న భౌతికంగా కన్నుమూసినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి. 1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు. సి.వి.రామన్ గారి గురించి తలుచుకున్నాం కద... శ్రీనివాస రామానుజన్ గారు..
శ్రీనివాస రామానుజన్ అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు స్వతంత్రంగా గాస్, కుమ్మేర్ మరియు హైపర్ రేఖాగణిత సిరీస్ లను కనుకోనేను. అంతేకాక అయన సంఖ్య సిద్ధాంతం మీద ప్రసిద్ధ రచనలు చేసారు. భిన్నాలు మరియు అపరిమిత సిరీస్ లను కొనసాగించారు. 20 వ శతాబ్దపు అత్యుత్తమ గణిత శాస్త్రవేత్తగా గుర్తించబడ్డారు. శ్రీనివాస రామానుజన్ అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు స్వతంత్రంగా గాస్, కుమ్మేర్ మరియు హైపర్ రేఖాగణిత సిరీస్ లను కనుకోనేను. అంతేకాక అయన సంఖ్య సిద్ధాంతం మీద ప్రసిద్ధ రచనలు చేసారు. భిన్నాలు మరియు అపరిమిత సిరీస్ లను కొనసాగించారు. మరో ప్రసిద్ధ విద్యావేత్త,రసాయన శాస్త్రవేత్త,ఉపాధ్యాయుడు అయిన ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదటి భారతీయ ఔషధ సంస్థ,బెంగాల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ ఏర్పాటు చేసారు. భారతీయ రసాయన శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్తగా అయన చాలా ప్రసిద్ధి చెందారు. అంతేకాక కెమిస్ట్రీ రాయల్ సొసైటీ వారిచే జీవిత పురస్కారాన్ని పొందారు. మొట్ట మొదటగా యూరోప్ బయట నుండి ఒక రసాయన ల్యాండ్ మార్క్ ప్లాక్ గా గుర్తింపు పొందారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు..
కర్నాటక చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య,మైసూర్ లో కావేరి నదిపై కృష్ణ రాజ సాగర్ ఆనకట్టను నిర్మించిన ఒక ఇంజనీరు. ఆయన గౌరవార్ధం, భారతదేశం ప్రతి సంవత్సరం అయన పుట్టినరోజు సెప్టెంబర్ 15 న ఇంజినీర్స్ డే గా జరుపుకుంటున్నారు. ఆయన ప్రజా మరియు ఆధునిక నిర్మాణ భారతదేశం గురించి చేసిన వివిధ రచనలకు 1955 వ సంవత్సరంలో భారతరత్న అవార్డు లభించింది.
హోమీ భాభా ఒక సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మరియు ఒక ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ మరియు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్థాపించడంలో ప్రముఖమైన పాత్రను పోషించారు. అయన భారతీయ అణు శక్తి చీఫ్ ఆర్కిటెక్ట్ గా ఉన్నారు. అయన భారతదేశంలో అత్యంత ప్రఖ్యాత శాస్త్రవేత్తలలో ఒకరుగా ఉన్నారు. మరో మహానుభావుడు జగదీష్ చంద్ర బోస్ గారు.. బెంగాలీ భౌతిక శాస్త్రవేత్త,జీవశాస్త్రజ్ఞుడు,వృక్షశాస్త్రజ్ఞుడు మరియు పురాతత్వవేత్త అయిన JC బోస్ రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ రంగంలో వివిధ అధ్యయనాలను కనుగొన్నారు. అయన జంతువులు మరియు మొక్కలు వివిధ పరిస్థితుల్లో ఎలా ఉంటాయో తెలుసుకోవటానికి 'క్రెస్కోగ్రాఫ్' అనే పరికరాన్ని కనుగొన్నారు.
సలీం ఆలీ పక్షుల అధ్యయనం మరియు వాటిని వర్గీకరించడంలో అపారమైన ఆసక్తి కలిగిన ఒక భారతీయ పక్షి శాస్త్రవేత్త .ఆయన భారతదేశం అంతటా క్రమబద్ధమైన పక్షి సర్వేలు నిర్వహించిన మొదటి భారతీయుడు. అలాగే అయన అన్ని సమయాల్లోనూ విస్తృతంగా గొప్ప శాస్త్రవేత్తగా ఆమోదించబడ్డారు. అంతేకాక సలీం ఆలీని "భారతదేశం యొక్క బర్డ్ మెన్ " గా పిలిచేవారు. కంప్యూటర్ సైన్స్ లో వండర్స్ స్రుష్టిస్తాను బిరెడీ...అన్న మహానుభావులు రాజ్ రెడ్డి గారు... రాజ్ రెడ్డి కృత్రిమ ఇంటలిజెన్స్ [AI] సిస్టమ్స్ రంగంలో పెద్ద స్థాయిలో మార్గదర్శకులుగా ఉన్నారు. అయన కృత్రిమ ఇంటలిజెన్స్ [AI] సిస్టమ్స్ కనుకోనుట వలన,1994 వ సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ రంగంలో అత్యున్నత పురస్కారం అయిన అలన్ ట్యూరింగ్ అవార్డు ను గెలుచుకున్నారు. మన భారతదేశానికి ఆయన పేరే తెచ్చింది విజానబలం.. ఆయన వేరెవరో కాదు... A.P.J. అబ్దుల్ కలాం....
అందరం పెడదాం...ఆయనకి సలాం... APJ అబ్దుల్ కలాంను భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ అని అంటారు. అయన విస్తృతంగా భారతదేశం యొక్క బాలిస్టిక్ క్షిపణి మరియు అణు యుద్ధ క్షిపణి కార్యక్రమం అభివృద్ధిలో కీలక పాత్రను పోషించారు. భారతదేశంలో ఉత్తమ రాష్ట్రపతులలో ఒకరిగా చేశారు. మరో మహానుభావులు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్.. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ భారత ఖగోళభౌతిక శాస్త్రవేత్తగా పేరు గాంచారు. అయన నక్షత్రాలు మరియు బ్లాక్ హోల్స్ యొక్క పరిణామ దశలను కనుగొనుట వలన 1983 వ సంవత్సరంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అయన కనుగొన్న సిద్దాంతం 'చంద్రశేఖర లిమిట్' గా పేరు పొందింది. ఇలా ఎందరో మన భారతీయ శాస్త్రవేత్తలు అందరికీ... తలవంచి మరీ దాసోహం చేద్దాం.... ఎందుకంటే ఇవాళ సమాజంలో మనకి అవసరమైన శాస్త్రసాంకేతిక పరికరాలు, వైద్యసదుపాయాలు అన్నీ మనకి ఉన్నాయంటే ఇదంతా వారి చలువ... అందుకే మనమంతా వారందరికీ ఒకసారి... వందనాలు చేసుకుందాం...
ఫిబ్రవరి 28వ తేదీ మన జాతీయ విజ్ఞాన దినోత్సవం.. నేషనల్ సైన్స్ డే... నా మాత్రుభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను అంటూ చివరి వరకూ భారత దేశంలో సైన్స్ అభివ్రుద్దికి పాటుపడ్డ మహనీయుడు చంద్రశేఖర్ వెంకట్రామన్ సి.వి.రామన్ గారి పరిశోధనా ఫలితాల్ని ధ్రువీకరించిన రోజు ఫిబ్రవరి 28 కనక ఈరోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సి.వి.రామన్ గారికి వందనాలు అర్పిస్తూ..ఒక్కసారి ఆయన గురించి మన దేశ శాస్త్రవేత్తల గురించి ఒక్కసారి మననం చేసుకుందాం.
జాతీయ విజ్ఞాన దినోత్సవ సందర్భంగా మన భారతదేశంలో మిగిలిన ప్రముఖ శాస్త్రవేత్తల పేర్లు కూడా ఒక్కసారి తలుచుకుందాం....
మరో భౌతిక శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా..
మనమంతా సలాం చేయాల్సిన మరో మహానుభావులు సలీం ఆలీ గారు...
http://www.teluguone.com/news/content/national-science-day-35-86067.html