కడప జిల్లాలో హత్యల కలకలం.. ఉన్మాదానికి ఒకరు.. కక్షలకు మరొకరు బలి!

Publish Date:Apr 11, 2026

Advertisement

కడప జిల్లాలో ఒకేరోజు   రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.   ఖాజీపేటలో ఒక విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలవ్వగా, రాజూపాలెం మండలంలో పాత కక్షలు ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ రెండు ఘటనలు జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితికి, యువతలో పెరుగుతున్న హింసా ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి. 

ఖాజీపేటలో   పెళ్లి నిరాకరించిందన్న  కారణంతో వెంకటేష్ అనే యువకుడు ఒక విద్యార్థిని ఇంటికి వెళ్లి, గొంతు కోసి చంపడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తీవ్రంగా స్పందించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి ఇలా అకాల మరణం చెందడం తనను కలచివేసిందన్నారు. మహిళల జోలికొచ్చే సైకోల పట్ల ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ఆడబిడ్డల వైపు కన్నెత్తు చూడాలన్నా భయపడేలా చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తూనే, మగబిడ్డల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని హితవు పలికారు. 

ఇక రాజూపాలెం మండలం పర్లపాడులో పాత కక్షలరే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.   బండి మహేష్ బాబు (25) అనే యువకుడిని చరణ్ అనే వ్యక్తి పాతకక్షల కారణంగా దారుణంగా హత్య చేశాడు.  రాజూపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. రూరల్ సీఐ నాగభూషణం, ఎస్ఐ ప్రణయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం చేశారు. 

 కడప జిల్లాలో శుక్రవారం (ఏప్రిల్ 10) జరిగిన ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే యువతలో హింసా ప్రవృత్తి కట్టుతప్పుదోందనిపించకమానదు.  ఖాజీపేట ఘటనలో  ప్రేమ ముసుగులో ఉన్మాదం కనిపిస్తే, రాజూపాలెం ఘటనలో   కక్షతో ఓ యువకుడురెచ్చిపోవడం కనిపిస్తుంది.  ప్రాణాలను తీశాయి. ప్రేమ వైఫల్యాలను స్వీకరించలేకపోవడం, చిన్న గొడవలను కూడా హత్యల వరకు తీసుకెళ్లడం సమాజంలోని నైతిక విలువల పతనానికి నిదర్శనం. ముఖ్యంగా మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో యువత  తప్పుదోవ పడుతున్నారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.  

​ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలని మేధావులు సూచిస్తున్నారు. యువతలో బాధ్యతాయుత ప్రవర్తన, చట్టం పట్ల భయం పెరిగినప్పుడే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడుతుందంటున్నారు. ఈ రెండు ఘటనల్లోని నిందితులపై పోలీసులు కఠినంగా వ్యవహరించి, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

By
en-us Political News

  
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
​చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.