Publish Date:Apr 11, 2026
హైడ్రా మరో భారీ ఆపరేషన్ కు సిద్ధమైంది. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా హైడ్రా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపురం పరిధిలోని ప్రభుత్వ స్థలంలో నిబంధనలను తుంగలో తొక్కి నిర్మించిన ఓ భారీ బహుళ అంతస్థుల భవనాన్ని శనివారం (ఏప్రిల్ 11) ఉదయం నేలమట్టం చేసింది. అనుమతులు లేకుండా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు నిర్ధారించుకున్న హైడ్రా ఆ భవనాన్ని కూల్చివేసింది.
ఐలాపురంలోని సర్వే నంబర్ 101లో సుమారు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత కొంతకాలంగా అక్రమార్కులు పాగా వేసి నివాసాలను, బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 400 గజాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఒక బిల్డర్ ఆరంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న హైడ్రా బృందం, భారీ పోలీసు బందోబస్తు నడుమ ఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతలు చేపట్టింది. భారీ యంత్రాలను, బుల్డోజర్లతో ఈ ఎత్తైన భవనాన్ని కూల్చివేశారు. అక్రమ నిర్మాణంపై గతంలోనే నోటీసులు ఇచ్చినా, స్పందన లేకపోవడంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. భవన యజమానులు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
అమీన్‌పూర్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరిగిపోతు న్నాయని స్థానికుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఐలాపురం గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే అనేక అక్రమ లేఅవుట్లు వెలిశాయని, వాటన్నింటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తి లేదని హైడ్రా స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో అమీన్‌పూర్, పటాన్‌చెరు పరిసరాల్లో మరిన్ని కూల్చివేతలు ఉంటాయని సమాచారం. ముఖ్యంగా ఎఫ్.టి.ఎల్ , బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలపై హైడ్రా దృష్టి సారించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hydra-demolishes-massive-multistoried-building-in-ameenpur-36-217115.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్‌ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్‌లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.